Read more!

మధుర మీనాక్షి కల్యాణం

 

ఈరోజు మధుర మీనాక్షి కల్యాణం. మధుర మీనాక్షి కల్యాణాన్ని చూసేందుకు భక్తులు దేశం నలుమూలలనుంచి తరలి వస్తారు. మధుర మీనాక్షి అమ్మవారంటే మనందరికీ ఎనలేని భక్తి. భక్తులు మీనాక్షి సుందరేశ్వరుల తిరుకల్యాణం చూసి తరిస్తారు..

మధుర మీనాక్షి పవిత్ర దేవాలయ ప్రాంగణంలో ద్వారం దగ్గరున్న మొదటి హాల్లో ఈ మధుర మీనాక్షి కల్యాణ ఉత్సవం జరుగుతుంది. చితిరాయ్ తిరువిజ లేదా చితిరాయ్ పండుగ తమిళనాడులో అత్యుత్సాహంగా జరుపుకునే అతి పెద్ద వేడుక.

ప్రతి సంవత్సరం చితిరాయ్ నెలలో జరిగే బ్రహ్మోత్సవంలో భాగంగా మదుర మీనాక్షి కల్యాణం కనులపండుగ్గా జరుగుతుంది. ఈసారి, అంటే మదుర మీనాక్షి కళ్యాణం 2011 మహోత్సవం ఏప్రిల్ 16న అంటే ఈరోజు వచ్చింది.

మదుర మీనాక్షి కళ్యాణం 2011 వేడుక చూసేందుకు వచ్చిన భక్తులతో మదురై, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కిక్కిరిసి ఉంటాయి. మదుర మీనాక్షి కళ్యాణం తమిళనాట జరిగే మహోత్సవం.

చితిరాయ్ నెలలో 5వ రోజున ఉత్సవాలు ప్రారంభమౌతాయి. 8వ రోజున మీనాక్షి అమ్మవారిని ఊరేగిస్తారు. 8,9,10 వ రోజుల్లో ఉత్సవాలు ఊపందుకుంటాయి. 10వ రోజున మదుర మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుల కల్యాణాన్ని వైభవంగా జరుపుతారు. తమిళుల పండుగల్లో ఈ మదుర మీనాక్షి కల్యాణం చాలా ముఖ్యమైంది.