Read more!

దేవతలూ... పడ్డారండీ ప్రేమలో మరి...

 

 

 

దేవతలు ఈ విశ్వం మొత్తాన్నీ ప్రేమిస్తారు. విశ్వంలోని అణువణువుతో వాళ్ళు ‘టచ్’లో వుంటారు. ఆ ప్రేమ సంగతి అలా వుంటే, ఇప్పుడు వేలెంటైన్స్ డే సందర్భంగా ప్రస్తావించుకునే ‘ప్రేమ’ విషయానికి వస్తే... ఈ ప్రేమలో మానవమాత్రులే కాదు.. దేవతలూ పడ్డారు. దానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. భగవాన్ శ్రీకృష్ణుడు - రాధ మధ్య ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. నిష్కల్మషమైన ప్రేమకు వారిరువురూ తార్కాణంగా నిలిచారు. అదే కృష్ణున్ని ప్రేమించి, ఆయనలోనే ఐక్యమైపోయిన మీరాబాయి గురించి మనకు తెలుసు. ఆ శ్రీమహావిష్ణువును ప్రేమించి, ఆయననే తన భర్తగా స్వీకరించిన గోదాదేవిది ఎంత గొప్ప ప్రేమో. ఇక వేంకటేశ్వరుడు - పద్మావతిల ప్రేమ ఒక అద్భుత ఘట్టం. పరమేశ్వరుడిని ప్రేమించి, మన్మథుడి సహకారంతో ఆయనకు దగ్గరైన పార్వతీదేవి ప్రేమ కథ మనకు తెలిసిందే. పురాణాలను వెతికి చూస్తే ఇలాంటి ఉదాహరణలు వేలల్లో దొరుకుతాయి. సరే, ప్రేమించి పెళ్ళాడిన వాళ్ళు, ప్రేమించి ప్రేమికులుగానే మిగిలిపోయిన వాళ్ళ సంగతి ఇలా వుంటే... పెళ్ళాయ్యాక భార్యని ఎంతో ప్రేమించిన పురాణ పురుషులు మనకెంతోమంది కనిపిస్తారు.. వారిలో శ్రీరామచంద్రుడే అగ్రస్థానంలో నిలుస్తాడు. టోటల్‌గా ఏంటంటే, దేవుడే ప్రేమలో పడ్డాడు.. దైవ స్వరూపులమైన మనం కూడా ప్రేమలో పడటం న్యాయమే. అందుకే... ప్రేమలో పడండి.. దైవత్వాన్ని పెంచుకోండి.