Read more!

Kumaraswamy

 

కుమారస్వామి

Kumaraswamy

 

శివపార్వతులకు జన్మించిన పుత్రుడు కుమారస్వామి. శివుని వీర్యం భూమిపై పడగా, గంగ ఆ వీర్యాన్ని గ్రహించి ఈ పుత్రుడికి జన్మనిచ్చింది. ఆరు ముఖాలతో జన్మించిన కుమారస్వామిని కృత్తికలు చేరదీసి పెంచుతారు. తారకాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు కుమారస్వామి, తర్వాత కాలంలో మహిషాసురుడు తదితర రాక్షసులు మునులను, ప్రజలను బాధించి క్రౌంచపర్వతమనే రెక్కలున్న పర్వతం వద్ద దాక్కుని ఉండడం గమనించి, ఆ పర్వతం రెక్కలను తెగగొట్టినది కుమారస్వామే. విఘ్నాధిపత్యం కోసం వినాయకునితో పోటీపడిన కుమారస్వామి తుదకు వినాయకుని గొప్ప తనాన్ని గ్రహిస్తాడు. నెమలి ఇతని వాహనం. ఈటె ఆయుధం.