Read more!

కార్తికేయ స్తోత్రము (Kartikeya Stotram)

 

కార్తికేయ స్తోత్రము (Kartikeya Stotram)

 

విమల నిజపదాబ్జ వేద వేదాంతవేద్యం

సమకుల గురుదేహం వాద్యగాన ప్రమోదం

రమణ గుణజాలం రాగరాడ్భాగినేయం

కమలజ సుత పాదం కార్తికేయం భజామి

 

శివ శరణజాతం శైవయోగం ప్రభావం

భవహిత గురునాథం భక్తబృంద ప్రమోదం

నవరస మృదుపాదం నాద హ్రీంకార రూపం

కవన మధురసారం కార్తికేయం భజామి

 

పాకారాతి సుతా ముఖాబ్జ మధుపం బాలేందు మౌళీశ్వరం

లోకానుగ్రహ కారణం శివసుతం లోకేశ త(స)త్త్వప్రదం

రాకాచంద్ర సమాన చారువదనం రంభోరు వల్లీశ్వరం

హ్రీంకార ప్రణవ స్వరూపం లహరీమ శ్రీ కార్తికేయం భజే

 

మహాదేవా జ్ఞాతం శరవణభవం మంత్ర శరభం

మహాతత్త్వానందం పరమలహరి మందమధురం

మహాదేవాతీతం సురగణం యుతం మంత్ర వరదం

గుహం వల్లీనాథం మమహృదిభజే గృధగిరీశం

 

నిత్యాకారం నిఖిల వరదం నిర్మలం బ్రహ్మతత్త్వం

నిత్యం దేవైర్వినుత చరణం నిరికల్పాదియోగం

నిత్యేడ్యం తం నిగమ విదితం నిర్గుణం దేవ నిత్యం

వందే మమ గురువరం నిర్మలం కార్తికేయం

 

ఇతి శ్రీ కార్తికేయ స్తోత్రం సంపూర్ణం