సోమవారమే  అష్టమి.. ఈ  రోజు ఇలా చేస్తే భయాల నుండి విముక్తి పొందుతారు..!

 

సోమవారమే  అష్టమి.. ఈ  రోజు ఇలా చేస్తే భయాల నుండి విముక్తి పొందుతారు..!

 


ప్రతి నెలలో అష్టమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టమి తిథి రోజు ముఖ్యంగా కాలభైరవుడిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.  ఏప్రిల్ నెల 21వ తేదీన సోమవారం రోజు  అష్టమి కానుంది.  ఈ రోజు సర్వార్థ సిద్ది యోగం ఏర్పడటం ఈ తిథిని మరింత ప్రత్యేకంగా పరిగణించేలా చేస్తోంది. శివుని ఉగ్రరూపమైన,  రక్షక రూపమైన కాలభైరవుడిని పూజించడం వల్ల అకాల మరణం,  భయం,  వ్యాధి,  శత్రువుల నాశనం మొదలైనవి జరుగుతాయని నమ్ముతారు.

ఈ అష్టమి నాడు సర్వార్థ సిద్ది యోగం ఏర్పడటం వల్ల ఈ యోగం లో చేసే పని విజయం సాధిస్తారని చెబుతున్నారు. ఈరోజు చేసే ఉపవాసం,  పూజ,  జపానికి చాలా ప్రాధాన్యత ఉంటుందట. మరీ ముఖ్యంగా తంత్ర సాధన, మంత్ర సిద్దికి ఈ రోజు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది.


కాలభైరవ అష్టమి రోజు కాలభైరవ అష్టకం,  కాలభైరవ బీజ మంత్రం, కాల భైరవ తాంత్రిక మంత్రం మొదలైన మంత్రాలు పఠించడం వల్ల కాల భైరవుని ఆశీర్వాదం లభిస్తాయి.  ఎవరైతే భక్తితో క్రమం తప్పకుండా ప్రతి అష్టమి రోజు ఉపవాసం పాటిస్తూ,  మంత్ర జపం చేస్తారో వారికి భయం అనేది తొలగిపోతుంది.  ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి సమస్యలలో ఉన్నా నిర్భయంగా ఉంటారు.  అలాగే జీవితంలో తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.


                                             *రూపశ్రీ.