మనసుని పట్టాలి

 

 

 

మనసుని పట్టాలి

 

 

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ ।

తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ॥

మనసుకి ఉన్న ప్రాథమిక గుణం చంచలత్వం. ఆ చాంచల్యంతోనే అది ఇంద్రియాలు ఎటు మోసుకుపోతాయో అటుగా వెళ్లిపోతూ ఉంటుంది. అలా అస్థిరంగా సంచరిస్తున్న మనసుని తిరిగి ఆత్మలో నిలిచేట్లు చేస్తుండాలి. అదే ధ్యానానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఇలాంటి అభ్యాసాన్ని సాధించిన వ్యక్తి, కొన్ని రోజులకు నిరంతరం అదే స్థితిలో ఉండగలిగే స్థాయికి చేరుకుంటాడు. అదే యోగికి సంక్రమించే ప్రాథమిక గుణం.

 

 

..Nirjara