ఆకుపచ్చ రంగు విశిష్టత (Green Colour Therapy)
ఆకుపచ్చ రంగు విశిష్టత
(Green Colour Therapy)
మనకు రంగులతో అవినాభావ సంబంధం ఉంది. మహర్షులు గ్రహాలూ వాటి ఫలితాల గురించి చెప్పినట్లే రంగుల వల్ల వచ్చే ఫలితాలను వివరించి చెప్పారు. రంగులతో ఒనగూరే ప్రయోజనాల గురించి, వర్ణాలతో చేసే చికిత్స గురించి మన ధార్మిక గ్రంధాలు సందర్భానుసారం వర్ణించాయి.
మన ప్రాచీన గ్రంధాల్లో రుషిపుంగవులు చెప్పినదాన్ని అనుసరించి -
ఆకుపచ్చ రంగు హృదయ చక్రాన్ని సూచిస్తుంది.
ఆకుపచ్చ తేజోశ్చక్రం ఉన్నవారిలో విజ్ఞాన ఆసక్తి ఉంటుంది. అభివృద్ధి గడించాలనే ఆశతో ముందుకు సాగుతారు.
ఆరోగ్యపరంగా ఆకుపచ్చ రంగు ఎంతో మేలు చేస్తుంది.
ఆకుపచ్చ రంగు నుండి వచ్చే కాంతి కిరణాలు కళ్ళకు చలవచేస్తాయి.
ఆకుపచ్చ రంగు పుండ్లు, గాయాలను అరికడుతుంది. సెగ్గడ్డలు మొదలు రాచకురుపుల వరకూ అన్నిటినీ తగ్గిస్తుంది.
తేలుకాటు, పాముకాటు, పిచ్చికుక్క, కోతి తదితర జంతువులు కరవడం వల్ల ఏర్పడే గాయాలను నివారిస్తుంది.
ఆకుపచ్చ వర్ణంతో మశూచికం లాంటి భయానక వ్యాధులు కూడా తగ్గుతాయి.
ప్రకృతిలో పచ్చదనమే కనిపిస్తుంది. మన ఉనికిని నిలబెట్టి, మనుగడ కల్పించేవి పచ్చటి చెట్లే.
ఆకుపచ్చ రంగును ఇష్టపడేవారు అంత తేలిగ్గా ఉద్వేగాలకు లోనవరు. స్థిరంగా, గంభీరంగా ఉంటారు.ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటారు.
ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉపయోగించేవారు తోటివారికి సాయపడేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా ఆందోళనకు లోనైనట్లు కనిపిస్తే, వారిని ఓదార్చేందుకు చూస్తారు.
అయితే, ఆకుపచ్చ రంగు ఉపయోగించేవారు సాధారణంగా కొంచెం లావుగా ఉంటారు.
వీళ్ళలో కాస్త ఈర్ష్య, సోమరితనం, కొన్నిసార్లు బొత్తిగా నిర్దయగా వ్యవహరించడం లాంటి లక్షణాలు కూడా ఎక్కువనే చెప్పాలి.
Green Colour Therapy, Colour Therapist and Green Colour, Green Colour Treatment, Balancing Colour