వివేకం కోల్పోతే!

 

 

వివేకం కోల్పోతే!

 

 

 

శిరః శార్వం స్వర్గాత్పశుపతి శిరస్తః క్షితిధరం

మహీధ్రాదుత్తుంగాదవనిమవనేశ్చాపి జలధిమ్‌ ।

అధో గంగా సేయం పదముపగతా స్తోకమథవా

వివేక భ్రష్టానాం భవతి వినిపాతః శతముఖః ॥ (భర్తృహరి)

గంగాదేవి మొదట ఆ ఆకాశము నుంచి శివుని శిరస్సు మీదకు ఉరికింది. అక్కడి నుంచి హిమాలయాల మీదకూ, వాటి మీద నుంచి భూమికీ దూకి... చివరికి భూమి మీద నుంచి పాతాళానికి జారింది. వివేకం నశించినవారు ఇలాగే భ్రష్టులై అధఃపాతాళానికి దిగజారిపోతారని హెచ్చరిస్తున్నాడు కవి.