ఇంద్రియాల తీరు మార్చండి

 

 

 

ఇంద్రియాల తీరు మార్చండి

 

పరాంచిఖాని వ్యతృణత్‌ స్వయంభూః

తస్మాత్పరాన్పశ్యతి నాంతరాత్మన్‌

కశ్చిద్దీరః ప్రత్యగాత్మానమైక్షత్‌

ఆవృత్త చక్షుః అమృత్వమిచ్చన్     (కఠోపనిషత్తు)

పరమాత్మ ఆ ఇంద్రియాలను సృష్టించాడు. ఆ ఇంద్రియాలకు ఎప్పుడూ బాహ్యంగానే సంచరించే లక్షణాన్నీ అందించాడు. కానీ మనిషి ఎప్పుడూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే దర్శించేందుకు ప్రయత్నిస్తాడే కానీ తనలో ఉన్న అంతరాత్మని చూసేందుకు పూనుకోడు. ఎవ్వరో ఒక ధీరుడు మాత్రమే అమృతమయమైన సత్యాన్ని తెలుసుకునేందుకు సాహసిస్తాడు. అందుకోసం తన ఇంద్రియాలను లోపలకు మళ్లించి తనలోని ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాడు.

 

..Nirjara