Read more!

తిరుమల శ్రీవారి ఆలయ సంపదను రక్షించే ఈ దేవతల గురించి మీకు తెలుసా?

 


తిరుమల శ్రీవారి ఆలయ సంపదను రక్షించే ఈ దేవతల గురించి మీకు తెలుసా?

తిరుమలకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమన అంశాలు ఉంటాయి. తిరుమల శ్రీవారి ఆలయ సంపదను కాపాడేందుకు దేవతలు ఉంటారన్న సంగతి మీకు తెలుసా? ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక ఆలయ నిర్మాణం పూర్తవ్వాలంటే ఎన్నో నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విధమైన పూజా నియామాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఆ నియమాన్నే ఆలయ ఆగమ శాస్త్రం అని అంటారు. ఆ ఆగమ శాస్త్రం అనుగుణంగా పరివార దేవతలు, ఆలయ ఏర్పాటుకు అనువైన ప్రాంతం ఈ విధంగా ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైఖాసన ఆగమం ప్రకారం పూజ నివేదనలు సాగుతుంటాయి.

ఇక పరివార దేవతలను కూడా ఆగమ శాస్త్రం ప్రకారమే నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయ మహా దర్శనం ద్వారా దగ్గర మనం కాళ్లు కడిగి పనిలో నిమగ్నం అవుతుంటాం.  అక్కడ రెండు విగ్రహాలు చిన్న పరిమాణంలో ఉంటాయి. ఆ విగ్రహాలను ఎవరు కూడా గుర్తించరు. అసలు ఆ విగ్రహాలు ఏమిటి. అక్కడ ఎందుకు ప్రతిష్టించారు. ఆగమ శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి. నిత్యం శ్రీవారి దర్శనార్థం లక్షమందికిపైగా తిరుమల వస్తుంటారు. సంపన్న దేవుళ్లలో మొదటిస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామే అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం శ్రీవారికి ఒక హుండీ ద్వారానే రూ. 3 నుంచి 4కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా స్వామివారికి రూ. 1000కోట్లు వస్తుంది. ఇప్పుడైతే టీటీడీ దేవస్ధానం..పాలక మండళ్లు వచ్చాయి. స్వామివారి సంపదను కాపాడే దేవతలు వారిద్దరేనని ఆగమం చెబుతోంది. కొన్నివేళ ఏళ్ల నాటి నుంచి ఆలయ మహాద్వారానికి ఆనుకోని శ్రీవారి సిరులను కాపాడుతున్నవారు ఆ ఇద్దరు దేవతలైన శంకనిధి, పద్మనిధి.

శ్రీవారి ఆలయ మహాద్వారా గడపకు పంచహోల మూర్తులుగా..రెండు అడుగుల పంచలోహ మూర్తులు ఇద్దరు ఉన్నారు. వారినే శంకనిధి, పద్మనిధి దేవతలుగా పిలుస్తారు. ద్వారానికి ఎడమ వైపు రెండు శంకఖాలు ఉన్న ఓ రక్షణ దేవత పంచలోహ మూర్తి ఉంటుంది. ఈ దేవతనే శంకనిధిగా పిలుస్తారు. ఇక కుడివైపు రెండు చేతుల్లో రెండు పద్మాలతో మరో రక్షణ దేవత విగ్రహం ఉంటుంది. ఈ దేవతనే పద్మనిధి దేవత అంటారు. ఇక నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకారంలో ప్రతిష్టించడం ఆగమ శాస్త్రంలో ఆనవాయితీ. ముక్కోటి ప్రదిక్షిణ, విమాన ప్రాకారం, సంపంగి ప్రాకారంలో శంఖనిధి, పద్మనిధి దేవతలను ప్రతిష్టించారు. ఆలయంలోకి వెళ్లే ముందు ఆలయం నుంచి బయటకు వచ్చాక ఈ దేవతలకు నమస్కరించడం మంచిదని ఆగమం చెబుతోంది.