నక్షత్రాన్నిబట్టి వస్త్రాలు ధరిస్తే మంచిది (దసరా స్పెషల్)
నక్షత్రాన్నిబట్టి వస్త్రాలు ధరిస్తే మంచిది (దసరా స్పెషల్)
దసరా పండుగ వచ్చేసింది. ఈ తొమ్మిది రోజులు దేశమంతా ఘనంగా ఉత్సవాలు , జరుపుకుంటారు. పూజలు చేసి, నైవేద్యాలు అమర్పించి కొత్త బట్టలు ధరించి ఆనందోత్సాహాలతో గడుపుతారు. దసరా తొమ్మిది రోజులూ ప్రతిరోజూ ఆ వారాన్నిబట్టి, ఆ రోజు నక్షత్రాన్నిబట్టి ప్రత్యెకించిన రంగుల వస్త్రాలు ధరిస్తే మంచిదని శాస్త్రం చెప్తోంది.
మొదటిరోజు :-
దుర్గామ్మవారిని పూజలందుకొమ్మని ఆహ్వానించే ఘటస్తాపన మహోత్సవం. శైలపుత్రిగా,గిరితనయగ, పార్వతి అమ్మవారుగా కీర్తించబడే అమ్మ పుట్టింది కొండ, కోనల్లోంచి.అంటే ప్రక్రుతిలోంచి.అందుకే ప్రక్రుతికి ప్రతీకగ పసుపు రంగు దుస్తులు ధరించడం ఈరోజు శుభప్రదం.
రెండవరోజు :-
పార్వతి అమ్మబారి రూపాన్ని పూజిస్తారు. శివునికోసం తపస్సు చేసింది.అనుకున్నది సాధించే పట్టుదల చూపింది. అందుకు చిహ్నంగా ఆకుపచ్చని బట్టలు ధరించాలి.
మూడవరోజు :-
పెళ్లైన వనితగ, సకల సౌభాగ్యరూపిణిగా చంద్రఘంట రూపంలో అమ్మ పూజలందుకుంటుందీరోజు.ఆమె నుదుటన అర్థచంద్రుడు ఘంటలాగా ఉంటాదు.శివుని పెళ్లాడటానికి ఆమె చూపిన ధైర్యానికి,పోరాటస్ఫూర్తికి గుర్తుగా బూడిద రంగు దుస్తులు ధరిస్తే మేలు.
నాలుగవరోజు:-
కూష్మాండరూపిణిగా అమ్మవారిని పూజిస్తారు ఈరోజు.సూర్యునిలో నివ్నసించి బ్రహ్మాండాన్ని స్రుష్టించిన లయకారిణి. వులుగు,శక్తి ప్రసాదిస్తుంది. దానికిగుర్తుగా ఆరెంజ్ రంగు దుస్తులు ధరించాలి.
ఐదవరోజు :-
కార్తికేయుని తల్లిగా స్కందమాతగా పూజిస్తారు.తెల్లని వస్త్రాలు ఈరోజు ధరించలి.
ఆరవరోజు :-
కాత్యాయనిగ పూజిస్తారు ఈరోజున. మహిషాసురుని సమ్హరించి అరుణిమతో ఉంటుంది కాబట్టి ఎర్రని వస్త్రాలు ధరిస్తే మంచిది.
ఏడవరోజు :-
చిమ్మచీకటి, కాళరాత్రి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. అన్ని సమస్యలు, బాధల నుంచి తప్పించె తల్లిని కీర్తించే రోజు నీలిరంగు దుస్తులు వేసుకోవాలి.
ఎనిమిదవరోజు :-
మహాగౌరి రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజున.పాపాలను తుడిచివేసె బాలికగా,అందాలరాశిగా తేజస్సు ఉట్టిపడే తల్లిని గులాబీ వస్త్రాలు ధరించి మొక్కితే మంచిది.
తొమ్మిదవరోజు :-
సిద్ధిధాత్రిగా, అపూర్వ శక్తిస్వరూపిణిగా కొలుస్తారు ఈరోజున. ఆమెను పూజించిన శివునికి శక్తులు ఇచ్చిన తల్లి భక్తులకూ ఇస్తుందని నమ్మకం. వంగరంగు వస్త్రాలు ధరించాలి ఈరోజు.
పదవరోజు :-
చెడు మీద మంచి సాధించిన విజయం. దసరా పండుగన పంచవన్నెల్లో యే రంగునైనా ధరించవచ్చు.
- Sridevi