అతనే నిజమైన స్నేహితుడు
అతనే నిజమైన స్నేహితుడు
పాపాన్నివారయతి యోజయతే హితాయ
గుహ్యం నిగూహతి గుణాన్ప్రకటీకరోతి ।
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే
సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతః ॥
నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో కవి ఈ పద్యంలో సూచిస్తున్నాడు. మనం పాపాలు చేసేటప్పుడు అతను నివారిస్తాడు; మంచిపనులు చేసే సమయంలో ప్రోత్సహిస్తాడు; రహస్యాలను దాచి ఉంచుతాడు; కానీ మనలోని సద్గుణాలను మాత్రం నలుగురిలో వెల్లడిస్తాడు; ఆపత్కాలంలో మిత్రుని వదిలిపోడు; ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటాడు.