Read more!

Chyavana, Son of Bhrugu Maharshi

 

భ్రుగు తనయుడు చ్యవనుడు

Chyavana, Son of Bhrugu Maharshi

 

చ్యవనుడు మూలికా వైద్యంలో సుప్రసిద్ధుడు. భ్రుగు మహర్షి, పులోమల కుమారుడితడు. 

చ్యవనుడు బాల్యం నుండే తపస్సు ప్రారభించాడు. అనేక సంవత్సరాలు అలా తపస్సులో మునిగిపోగా, అయన చుట్టూ పుట్టలు లేచాయి.

కొంతకాలానికి ఆ ప్రాంతరాజు, తన కుమార్తె సుకన్యతో కలిసి అక్కడికి వచ్చాడు.

ఆ పుట్టలో నుంచి కాంతులు వెలువడడం చూసిన సుకన్య పుట్టను తవ్వించడానికి ప్రయత్నించగా చ్యవనుడు బయటపడతాడు. అప్పటికతడు వృద్దుడు.

సుకన్య తండ్రి అక్కడకు వచ్చి జరిగింది తెలుసుకుని, క్షమించమని మహర్షిని ప్రార్ధించాడు. కుమార్తెనిచ్చి వివాహం కూడా చేశాడు.

ఒకసారి సుకన్యను చూసిన అశ్వనీ దేవతలు, తమతో వస్తే తగిన వరుడిని చూపుతామని చెప్పారు.

తన వృద్దాప్యాన్ని పోగొట్టి తనను యవ్వనవంతునిగా చేయాలని అపుడు సుకన్యను పంపుతానని షరతు విధిస్తాడు చ్యవనుడు. దీనికి అంగీకరించి తమతో ఒక కొలనులో స్నానం చేయమని అశ్వనీ దేవతలు చ్యవనుడికి సూచించారు.

కొలనులో స్నానం చేస్తూ, ఒక మునక మునిగి పైకి లేచేసరికి ముగ్గురూ యవ్వనంలో ఉన్న యువకుల వలె మారడమే కాకుండా ఓకే రూపురేఖలు వచ్చాయి. వారిలో ఒకరిని ఎంచుకోమని అశ్వనీదేవతలు కోరారు.

సుకన్య తన భర్తను గుర్తించడంతో ఆమె పాతివ్రత్యాన్ని, చ్యవనుడి తపోశక్తిని పూర్తిగా తెలుసుకుని వెళ్ళిపోయారు

అశ్వీనీ దేవతలు. తర్వాత తనకు యవ్వనమిచ్చిన అశ్వనీదేవతలకు యాగములో సోమపానము ఇప్పిస్తాడు.

దీనికి ఆగ్రహించిన ఇంద్రుడు చ్యవనుడిని దండించడానికి ప్రయత్నించగా, తన తపోశక్తితో ఇంద్రుడిని శక్తిహీనుడిగా మారుస్తాడు చ్యవనుడు.

చ్యవనుడి తపోశక్తి, ఆయన జాలి గుణం గురించి ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి.