మూర్ఖుల మనసు రంజింపరాదు
మూర్ఖుల మనసు రంజింపరాదు
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు!
ఏనుగులక్ష్మణకవి అనువదించిన భర్తృహరి సుభాషితంలోనిదీ ప్రసిద్ధ పద్యం- ఇసుక నుంచి తైలాన్ని వెలికిదీయవచ్చు, ఎండమావుల వెంటపడి నీటిని సంపాదించవచ్చు, తిరిగి తిరిగి కొమ్ములున్న కుందేలుని సాధించవచ్చు... ఈ పనులన్నీ అసాధ్యమే కావచ్చు! కానీ మరో పనితో పోల్చుకుంటే ఇవి దిగదుడుపేనంటారు కవిగారు. అదే మూర్ఖుని మనసుని మెప్పించాలనుకునే ప్రయత్నం. మూర్ఖుడైనవాడి మనసుని మార్చడంకంటే ప్రపంచంలో మరే ఇతర కార్యాన్నయినా సాధించవచ్చునంటున్నారు.
..Nirjara