ఏమీ తెలియనప్పుడు
ఏమీ తెలియనప్పుడు
యదా కించిద్‌జ్ఞోహం ద్విప ఇవ మదాంధః సమభవం
తదా సర్వజ్ఞోస్మీత్యభవ దవలిప్తం మమ మనః ।
యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం
తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః ॥ (భర్తృహరి)
నాకేమీ తెలియని కాలంలో, అంతా నాకే తెలుసుననుకుని మదమెక్కిన ఏనుగులాగా ప్రవర్తించాను. కానీ జ్ఞానుల సాహచర్యంతో నాకేమీ తెలియదన్న వాస్తవాన్ని తెలుసుకున్నాను. నేను మూర్ఖుడినన్న వాస్తవాన్ని గ్రహించిన తరువాత... జ్వరం నుంచి ఉపశమనం పొందినట్లుగా, నాలోని గర్వం కూడా ఉపశమించింది.
..Nirjara