డబ్బుకి మూడే లక్షణాలు
డబ్బుకి మూడే లక్షణాలు
దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య
యో న దదాతి, న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ॥
ధనం ఖర్చయ్యేందుకు మూడే మూడు మార్గాలున్నాయి. ఒకటి- దానిని ఎవరికన్నా దానం చేయాలి. రెండు- దానిని తన కోసమన్నా ఉపయోగించుకోవాలి. అదీఇదీ కాదంటే ఇక పరుల పాలు అయ్యేందుకు ధనానికి రెక్కలు రాక తప్పదు. నోరు కట్టుకుని పైసా పైసా కూడబెట్టే పిసినారుల ఆస్తి ఏ దొంగల పాలో, అర్హత లేని వారసుల పాలో కావడం సహజమే కదా! అలాంటివారిని చూసినప్పుడు భర్తృహరి చెప్పిన ఈ శ్లోకం గుర్తుకురాక మానదు.
..Nirjara