దెయ్యాలు నిర్మించిన శివాలయం.. భారతదేశంలోనే ఉన్న ఈ శివాలయ రహస్యం తెలుసా!
దెయ్యాలు నిర్మించిన శివాలయం.. భారతదేశంలోనే ఉన్న ఈ శివాలయ రహస్యం తెలుసా!
భారతదేశంలో ఎన్నో విశిష్టమైన శివాలయాలు ఉన్నాయి, వాటిలోని రహస్యాలు మనల్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరేనా జిల్లాలో ఉన్న కాకన్‌మఠ్ ఆలయం. ఈ ఆలయాన్ని సిమెంట్, సున్నం లేదా మట్టి వంటివాటితో కాకుండా, పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించారు. అది కూడా ఈ ఆలయాన్ని నిర్మించడం ఎవరూ ఎప్పుడూ చూడలేదు. కేవలం రాత్రికి రాత్రి ఈ ఆలయ నిర్మాణం జరిగిపోయిందని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయని స్థానిక నమ్మకం. అతీంద్రియ శక్తులు రాత్రికి రాత్రే దీనిని నిర్మించి, ఉదయాన్నే అసంపూర్తిగా వదిలి వెళ్ళిపోయాయని చెబుతారు.
దేవుడు ఉంటే దెయ్యం కూడా ఉంటుంది అంటుంటారు. అయితే.. దేవుడిని పరిచయం చేసినట్టు దెయ్యాన్ని పరిచడం చెయ్యరు ఎవరు. అసలు దెయ్యామా.. అదేం లేదు అనేవాళ్లు ఎక్కువ. కానీ దెయ్యాన్ని పరిచయం చేయడానికి కొన్ని సంఘటలు సాక్ష్యంలా నిలుస్తాయి. అలాంటి కోవలోనిదే దెయ్యాలు నిర్మించిన ఆలయం అని చెబుతున్న కాకన్ ఘాట్ ఆలయం. కేవలం బండరాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చడం ద్వారా దీన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి రాయి ఒక రహస్యంలా అనిపిస్తుంది. దీని గురించి తెలుసుకుంటే..
ఆలయ విశిష్ట నిర్మాణం..
ఆలయం నిర్మాణం చాలా విశిష్టంగా ఉంటుంది. కేవలం రాత్రికి రాత్రి అందులోనూ దెయ్యాలు నిర్మించడం వల్లే ఇది ఇంత విశిష్టంగా, అందులోనూ అసంపూర్తీగా ఉందని అంటున్నారు. దీని ఫలితంగా ఆలయం ఇంత విశిష్టంగా ఉందని కూడా చెబుతారు. శతాబ్దాలు గడిచినా అది చెక్కుచెదరకుండా నిలవడం దాని ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెబుతారు.
చరిత్రకారుల అభిప్రాయం..
చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కచ్ఛపఘాట వంశానికి చెందిన కీర్తిరాజ్ రాజు నిర్మించాడు. ఇది శివునికి అంకితం చేయబడిన ఒక పెద్ద ఆలయ సముదాయంలో భాగంగా ఉండేది. నేడు, చుట్టుపక్కల ఉన్న ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి, కానీ ప్రధాన ఆలయం మాత్రం ఇప్పటికీ పటిష్టంగా నిలబడి ఉంది.
ఆలయ అద్బుతం..
115 అడుగుల ఎత్తైన ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయమైన లక్షణం ఏమిటంటే, అది గురుత్వాకర్షణ నియమాన్ని ధిక్కరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంత ఎత్తైన నిర్మాణం ఉన్నప్పటికీ, ఇది తుఫానులు , హరికేన్‌లను ఎదుర్కొంటూ 1000 సంవత్సరాలకు పైగా నిలబడి ఉంది.
వెయ్యేళ్ల నాటి ఈ ఆలయమంతటా హిందూ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి, వాటిలో చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. భారతదేశంలో జరిగిన పలు యుద్దాల కారణంగా ఈ ఆలయంలోని హిందూ దేవతా విగ్రహాలు శిథిలావస్థలో ఉన్నాయని, చాలామంది పాలకులు యుద్దాల పేరుతో ఈ విగ్రహాలను శిథిలావస్థకు చేర్చారని చెబుతారు.
*రూపశ్రీ.