ఏంటి ఉపయోగం
ఏంటి ఉపయోగం
కట్టుకొన్న సతిని నట్టేటిలో ముంచి
కన్నవారి నోట గడ్డకొట్టి
సభలకెక్కు వాడు చచ్చు పెద్దమ్మరా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
కట్టుకున్న ఇల్లాలి పట్లా, జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్లా తన బాధ్యతలను విస్మరించినవాడు.. సమాజంలో ఎంత కీర్తిప్రతిష్టలని సాధిస్తే మాత్రం ఉపయోగం ఏమిటి. తనని నమ్ముకున్నవారతో సరిగా ప్రవర్తించనివాడు ఎన్ని ఉపన్యాసాలు దంచితే ఏంటి ప్రయోజనం.