Publish Date:Feb 5, 2014
Publish Date:Jan 28, 2014
Publish Date:Sep 16, 2013

EDITORIAL SPECIAL
  మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దగలరని.. మహిళలు ఎందులోనూ తక్కువకాదని.. సహనంలోనైనా, సాహసించి పోరాడటంలోనైనా వారి తరువాతే ఎవరైనా అని ఎందరో మహిళలు రుజువు చేసారు. అలాంటి వారిలో 'దుర్గాబాయి దేశ్‌ముఖ్' ముందు వరుసలో ఉంటారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా.. ఆమె సాహసాలను, ఆమె సేవలను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందుదాం. దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో.. 1909 జూలై 15 న మధ్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ళ వయసులోనే ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. అయితే తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు కూడా అంగీకరించారు.  బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించారు. దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాలుపంచుకున్నారు. ఓ వైపు చదువుకుంటేనే మరోవైపు స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు పాత్ర పోషించారు. తన 12 ఏళ్ళ వయసులో ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించి.. రాజమండ్రిలో బాలికలకు హిందీలో విద్యను అందించడానికి బాలికా హిందీ పాఠశాలను నెలకొల్పారు. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఆమె విరాళాలను సేకరించి ఆయనకు అందచేశారు. తన చేతులకు ఉన్న బంగారు గాజులను సైతం విరాళంగా అందించారు. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పనిచేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణంగా ఆయనను అనుమతించలేదు. తన కర్తవ్య నిర్వహణకు గాను నెహ్రూ నుండి ఆమె ప్రశంసలు పొందారు. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కూడా అయ్యారు. స్వాతంత్ర్య ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి.. బెనారస్‌ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్‌ సైన్స్‌), 1942లో ఎల్‌. ఎల్‌.బి పూర్తిచేసారు. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. తరువాత ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరు సంపాదించారు. స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండేవారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు. 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. స్వాతంత్ర్యం తర్వాత.. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్‌ముఖ్తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆమె 1975 లో పద్మ విభూషణ్ పొందారు. దుర్గాబాయి..1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు. అయితేనేం మరణంలేని ఓ వ్యవస్థగా ఆమె ఎప్పుడూ మనమధ్యనే చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.
  పోలవరం ప్రాజెక్ట్ అసలు ఇప్పట్లో పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పోలవరం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వందల మంది కార్మికులు, భారీ యంత్రాలతో హడావుడిగా కనిపించే పోలవరం ప్రాంతంలో ఇప్పుడు స్తబ్దత నెలకొంది. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరద సీజన్‌ కాబట్టి డయాఫ్రంవాల్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా నిలిచిపోయాయి. స్పిల్‌వే వద్ద కాంక్రీటు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రాబోయే రెండు మూడు నెలలు వరదల ప్రభావం ఉంటుంది. మరోపక్క వర్షాలు కూడా వస్తాయి. ఇలా కొంతకాలం ఈ పనులు పుంజుకునే అవకాశం లేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనాను రూ.55వేల కోట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కానీ కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఏమీ కేటాయించలేదు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.వేల కోట్లు రావలసి ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రూ.కోట్లాది బిల్లులు పెండింగ్‌ పడడంతో కాంట్రాక్టు సంస్థలు మెల్లగా సర్దుకుంటున్నాయి. ఇంతకాలం మట్టి పనులు చేసిన త్రివేణీ సంస్థ ఇప్పటికే ప్రాజెక్టు పని నుంచి తప్పుకుంది. తన కంటైనర్లతోపాటు ఇతర ఎక్విప్‌మెంట్‌ను కూడా తరలించుకుని పోతోంది. ఈ సంస్థకు సుమారు రూ.70 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయట. దీనికంటే ముందు ఎల్‌అండ్‌టీ సంస్థ కాఫర్‌ డ్యామ్‌ బెడ్‌ పనులు చేసి వెళ్లిపోయింది. ఆ సంస్థకు కూడా రూ.కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నవయుగ, మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మాత్రమే ఉన్నాయి. వీటికి కూడా రూ.వందల కోట్ల బిల్లు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు గత నెలలోనే ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు అథార్టీ ఆదేశాల మేరకు ఈ పనులు ఆపేశారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల మధ్య గోదావరిలో నిర్మించనున్న ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం, దానికి ఎగువ, దిగువ భాగాలలో కాఫర్‌ డ్యామ్‌లు నిర్మాణం చేపట్టారు. 2.47 కిలోమీటర్ల పొడవు లక్ష్యంగా పెట్టుకుని రెండు కరకట్టల మధ్య దీని నిర్మాణం చేపట్టారు. అందులో గత నెల వరకూ 1.7 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇంతలో ఈ పనులు ఆపేయమని పీపీఏ ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. దీనిని తర్వాత పూర్తి చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం వరదల వల్ల ఇంతవరకూ నిర్మించిన కాఫర్‌డ్యామ్‌ దెబ్బతినకుండా పీపీఏ ఓ డిజైన్‌ ఇచ్చింది. దాని ప్రకారం రక్షణ చర్యలు చేపట్టారు. మరో వారం రోజుల్లో ఇవి పూర్తి కావచ్చని చెబుతున్నారు. మరోవైపు దేవీపట్నం మండలంలో 34 గ్రామాలకు వరద ముప్పు ఉందని, ప్రజలు ఆ గ్రామాలను ఖాళీ చేయాలని చెబుతున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో పునరావాస కాలనీలు ఇంకా పూర్తి కాకపోవడంతో అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలని తటపటాయిస్తున్నారు. కొందరు ప్రజలు స్వచ్ఛందంగానే తరలివెళ్లిపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా ప్రతీ ఏటా వరదల వల్ల దేవీపట్నం మండలంలో చాలా గ్రామాలు మునిగిపోతుంటాయి. పడవ ప్రయాణమే శరణ్యం. కానీ ఈసారి గోదావరిలో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు. ఇక్కడ గోదావరి వెడల్పు 2.45 కిలోమీటర్లు. గతంలో ఇంత వెడల్పున గోదావరి వరద నీరు కిందకు ప్రవహించేది. కానీ ఇప్పటికే 1.7 కిలోమీటర్ల కాఫర్‌ డ్యామ్‌ను గోదావరికి అడ్డంగా కట్టారు. సుమారు 25మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వైపు నదిలో కొంత భాగం వదిలేశారు. ప్రస్తుతం వరద నీరు కాఫర్‌ డ్యామ్‌ కట్టగా, మిగిలిన నదీ భాగం నుంచే కిందకు లాగవలసి ఉంది. ప్రస్తుతం పోలవరం వైపు పైపుతో నిర్మించిన వంతెన ద్వారా నదిని మళ్లించారు. కానీ గోదావరి వరద ఉధృతమైతే ప్రాజెక్టు వద్ద తక్కువ భాగంలో నుంచి మొత్తం నీరు లాగదు. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం అంటే పాపికొండల వైపు వరదనీరు ఎగదన్నే అవకాశం ఉంది. ఆయా గ్రామాలలో ఎక్కువ నీరు నిల్వ ఉండి, గ్రామాలలో జనం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చని ప్రజల ఆందోళన చెందుతున్నారు.
  తెలంగాణలో తమకు తిరుగులేదు, తాము చెప్పిందే వేదం అనుకుని రాజకీయం చేస్తున్న కేసీఆర్ అండ్ కోకి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్దం అయ్యిందా ? అంటే అవుననే అనిపిస్తోంది తాజాగా జరుగుతున్న పరిణామాలు. కేసీఆర్, జగన్ ల మధ్య దోస్తీ రహస్యం ఎవ్వరికి అంతుచిక్కడం లేదు. అయితే కేంద్రం మాత్రం కేసీఆర్ ను నమ్మినట్లే నమ్మి సమయం కోసం వేచి చూసింది కార్యాచరణ మొదలుపెట్టిందని తెలంగాణాలో కేసీఆర్ ప్రభ అంతం చేయడానికి పూనుకుందని అంటున్నారు.  ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు కేసీఆర్ కి ఊపిరి ఆడనివ్వడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రజలకు ఏదో చేసేశామని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ప్రచారం చేసినట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని కేంద్రానికి నివేదికలు వెళ్లాయి. అసలే ఎప్పుడు ఎంటర్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో పాగా వేద్దామా అని గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్న బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని వదులుకోడానికి సిద్దంగా లేక తాజాగా ఐటీ దాడులు మొదలు పెట్టారు.  హైదరాబాద్‌లో మై హోం రామేశ్వర రావు ఇల్లు, కార్యాలయాలపై నిన్నన  ఉదయం 7 గంటల నుంచి ఐటీ అధికారులు దాడులు చేశారు. నంది నగర్‌లోని ఆయన నివాసం, హైటెక్ సిటీలో ఉన్న ఆఫీసుల్లో సుమారు 200 మంది అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. చానెళ్ళ మీద చానెళ్ళు కొంటూ మీడియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని కేసీఆర్ అండతో భూదందా చేసి వేలకోట్ల ఆస్తులు కూడగట్టి పెద్ద మాఫియాగా తయారైన రామేశ్వరావుకి అవేమీ కాకుండా అనవసరంగా కావాలని కొన్న లావాదేవీలు మెడకు చుట్టుకొని కేంద్రానికి అదే ఆయుధంగా మారింది.  అదీకాక మై హోమ్ సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర రావు టీఆర్‌ఎస్ పార్టీకి ఇటీవల రూ.3000 కోట్ల ధనాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి రామేశ్వర రావుతో పాటు మరో వ్యాపారవేత్త శ్రీనిరాజు హైదరాబాద్ శివార్లలో 100 ఎకరాల భూమిని 20% శాతం ధరకే దక్కించుకున్నట్లు కూడా మరో ప్రచారం జరుగుతోంది. రైతులకు చెందిన భూములను ఉదారంగా కట్టబెట్టినట్లు కొంత మంది ఆరోపిస్తున్నారు.  అయితే నిన్నజరిగిన సోదా మాత్రం టీవీ9 సంస్థలోకి హవాలా మార్గం ద్వారా రామేశ్వర రావు రూ.220 కోట్లను తరలించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అని అంటున్నారు. టీవీ9 సంస్థను రామేశ్వర రావు స్వాధీనం చేసుకోవడం, ఛానెల్ నుంచి రవిప్రకాశ్‌ను తప్పించడం వెనుక తెలంగాణ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు మీడియా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే రవి ప్రకాష్ ఇటీవల ఢిల్లీలో అమిత్ షాను కలిసినట్లు వస్తున్న వార్తలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి.   
ALSO ON TELUGUONE N E W S
  పూరి జ‌గ‌న్నాథ్ ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు ఇండస్ట్రీ అంతా అతడి వెనుక తిరిగింది. స్టార్ హీరోలు, బడా బడా నిర్మాతలు అతడితో సినిమా చేయడానికి ఎగబడ్డారు. ఫ్లాపులు వచ్చేసరికి పరిశ్రమ తీరు మారిందా? 'ఇస్మార్ట్ శంకర్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయి. "సినిమా హిట్ అయితే వెధవను కూడా జీనియస్‌లా చూస్తారు. ఒకవేళ ప్లాప్ అయితే జీనియ‌స్‌ను కూడా వెధవలా చూస్తారు" అని పూరి అన్నారు. 'టెంపర్' తరవాత తనకు సరైన హిట్ లేదని, ఎలాగైనా హిట్ కొట్టాలని కొత్తగా అలోచించి 'ఇష్మార్ట్ శంకర్' చేశానని పూరి జగన్నాథ్ తెలిపారు. సినిమాలో రామ్ క్యారెక్టర్, క్యారెక్ట‌రైజేష‌న్‌ హైలైట్ అనీ... చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంద‌ని ఆయన తెలిపాడు. ఒక హాలీవుడ్ సినిమా నుంచి ఇన్‌స్ఫైర్ అయిన కాన్సెప్ట్‌తో కథ రాశానని పూరి ఒప్పుకున్నారు. ఆల్రెడీ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ కథ, 'డబుల్ ఇస్మార్ట్' టైటిల్ రిజిస్టర్ చేయించిన పూరి జగన్నాథ్... సినిమా హిట్ అయితే వెంటనే దాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు.
క‌మ‌ల్ హాస‌న్ హీరోగా, శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `భార‌తీయుడు` చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా `భార‌తీయుడు -2` ను ప్రారంభించారు ద‌ర్శ‌కుడు శంక‌ర్. కొన్ని రోజుల షూటింగ్ కూడా చేసారు. అయితే స‌డ‌న్ గా బ‌డ్జెట్ ఆపేసారు.  శంక‌ర్ కు నిర్మాణ సంస్థ లైకా వారికి వ‌చ్చిన బేదాభ్రిప్రాయాల వ‌ల్లే సినిమా ఆగిపోయిందంటూ ఆ మ‌ధ్య న్యూస్ వ‌చ్చాయి.  ఇక ఇత‌ర సంస్థ‌ల్లో సినిమాను పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు చాలా ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌లుడ‌య్యాడ‌ని తెలుస్తోంది. ఇక దీంతో లైకా వారు పెట్టిన బ‌డ్జెట్ ప‌రిమితుల్లోనే సినిమాను కంప్లీట్ చేయాల‌ని భావించిన శంక‌ర్ అగ‌స్ట్ నుండి మ‌ళ్లీ షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో దీని పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలున్న‌ట్లు త‌మిళ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందుతోంది.
  ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్‌. ఇటీవల విడుదలైన ‘ఓ బేబీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే, లక్ష్మీ భూపాల్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. సాధారణంగా మీడియా ముందుకు రాని మీరు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం? 'ఓ బేబీ' విడుదల తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు సమంత నటన, నందినీరెడ్డి దర్శకత్వంతో పాటు నేను రాసిన మాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారు ఫోన్ చేసి అరగంటకు పైగా మాట్లాడారు. కెఎస్ రామారావుగారు ఫోన్ చేశారు. ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి ఎన్నో ఫోనులు వచ్చాయి. అందరికీ కృతజ్ఞత తెలపడానికి వచ్చాను.  'ఓ బేబీ' విజయం మీకు అంత ప్రత్యేకమా? నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఒక 50, 60 సినిమాలు చేశా. అందులో కొన్ని విజయాలు ఉన్నాయి. ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలు చేసినా రాని శాటిశ్‌ఫ్యాక్ష‌న్‌ 'ఓ బేబీ'కి వచ్చింది. మాటల గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగానూ సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నా చిన్నతనంలో మరణించారు. అప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మ సంరక్షణలో పెరిగాను. అందుకని, సినిమా కథ నాకు మరింత కనెక్ట్ అయింది. ఇందులో బేబీ పాత్రకు రాసిన ప్రతి మాట మా అమ్మ లేదా అమ్మమ్మ అన్న మాటలే. నేను చిన్నతనంలో ఎన్నోసార్లు విన్న మాటలే. ఉదాహరణకు... 'మగాళ్లు అందరికీ మొగుడులా బతికా' అని లక్ష్మిగారు ఒక సన్నివేశంలో డైలాగ్ చెబుతారు. నేనది అమ్మమ్మ నోటి నుంచి 150 సార్లు విని ఉంటాను. అందుకని, 'ఓ బేబీ' మాటల రచయితగా నా విజయాన్ని మా అమ్మ, అమ్మమ్మకు అంకితం ఇస్తున్నాను. సినిమా చూశాక, మీ అమ్మగారు ఏమన్నారు? అమ్మ సినిమా చూసేటప్పుడు నేను పక్కనే కూర్చున్నాను. కొన్ని సన్నివేశాలు వచ్చేటప్పుడు నావైపు చూసేది. ఉదాహరణకు... చేపల పులుసు వాసన చూసి ఉప్పు సరిపోలేదని నేను చెప్పేస్తా. లక్ష్మిగారి పాత్రకు దాన్ని అన్వయిస్తూ సన్నివేశం రాశా. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అమ్మకు సినిమా బాగా నచ్చింది. కొన్ని ఘాటైన డైలాగులు కూడా రాశారు. మగాళ్లపై విమర్శ చేసినట్టున్నారు? 'మొలతాడుకి, మోకాలి మధ్య కొవ్వు పెరిగిపోయి కొట్టుకుంటున్నారు' డైలాగ్ గురించేనా? సినిమాలో నాగశౌర్య పాత్రను ఉద్దేశించి సమంతగారు ఆ డైలాగ్ చెప్పారని అనుకుంటున్నారు. సరిగా వింటే అందరినీ ఉద్దేశించి రాసిన డైలాగ్ అని తెలుస్తుంది. ప్రతివారం ఎక్కడో చోట చూస్తున్నాం లేదా వింటున్నాం. తొమ్మిదేళ్ల పాపపై అని, మరొకటి అని. అందుకే, ఆ మాట రాశా. సెన్సార్ వాళ్లకు భయపడి నేను చెప్పాలనుకున్న భావాన్ని పూర్తిగా కాకుండా, కొంచెం సుతిమెత్తగా రాశా. లేదంటే ఇంకా ఘాటుగా రాసేవాణ్ణి. కృష్ణవంశీ, నందినిరెడ్డి, సతీష్ కాసెట్టి... వీళ్లతో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు? అవును. ఒక్కొక్కరితో మూడేసి సినిమాలు చేశా. ఇంకా చాలామందితో చేశా. తేజగారితో చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' మంచి పేరు తెచ్చింది. స్టార్ హీరోల సినిమాలకు చేయకపోవడానికి కారణం? కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, కుదరలేదు. రవితేజ 'బలాదూర్'కి చేశాను కదా! బహుశా... నేను పంచ్ డైలాగులు, ప్రాసలకు దూరంగా ఉంటాను కనుక అవకాశాలు రాలేదేమో. స్టార్ హీరోలు, దర్శకులు అవకాశాలు ఇవ్వలేదేమో. నాకు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు చేయాలని ఉంటుంది. అవకాశం వస్తే... వాళ్ల బాలాలు చూపించేలా డైలాగులు రాయాలని ఉంటుంది. చిరంజీవిగారు 'దొంగ మొగుడు' వంటి సినిమా చేస్తే ఎంత హుషారుగా ఉంటుందో ఆలోచించండి. అవకాశాల కోసం చూస్తున్నాను. స్టార్ హీరోలతో పనిచేయలేదేమో గానీ... స్టార్ ప్రొడక్షన్ హౌసులు సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, ఉషాకిరణ్ మూవీస్ కి పని చేశా. నా ఫస్ట్ మూవీ 'సోగ్గాడు' సురేష్ ప్రొడక్షన్స్ సినిమా. సినిమాలు ప్లాప్ అయితే రైటర్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? నేను రైటర్ గా వర్క్ చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కానీ, రైటర్ గా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయితే తర్వాత మరో అవకాశం వచ్చేది కాదు కదా. ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి నేను లక్ష రూపాయల రెమ్యునరేషన్ పెంచేవాణ్ణి. కసితో రాసేవాణ్ణి. ప్రజెంట్ రైటర్స్ రెమ్యునరేషన్ ఎలా ఉంది? బావుంది. హ్యాట్సాఫ్ టు త్రివిక్రమ్ గారు. ఆయన ఒక ప్యారామీటర్ సెట్ చేశారు. రైటర్ ఇంత తీసుకోవచ్చు, రైటర్ కి ఇంత ఇవ్వొచ్చు అని చూపించారు. ఇటీవల రచయితలు దర్శకులుగా మారుతున్నారు. మీరు? కొందరు రచయితలు ఫ్ర‌స్ట్రేష‌న్‌లో దర్శకులు అవుతున్నారు. తాము రాసినది దర్శకులు సరిగా ఆవిష్కరించడం లేదనే కోపంలో దర్శకులుగా మారుతున్నారు. నేను ఫ్ర‌స్ట్రేష‌న్‌లో, కోపంలో దర్శకుడు కావాలని అనుకోవడం లేదు. నేను మాత్రమే కథకు న్యాయం చేయగలని భావించిన రోజున మెగాఫోన్ పడతా. మీ దగ్గర ఎన్ని కథలున్నాయి? అందులో మీరు మాత్రమే న్యాయం చేయగలిగినవి ఎన్ని? నా దగ్గర మొత్తం 24 కథలున్నాయి. అందులో ఆరు కథలను నా కోసం పక్కన పెట్టుకున్నా. సతీష్ కాసెట్టికి ఒక కథ ఇచ్చాను. అలాగే, రచయితగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను, క్రేజ్ ను స్టార్ డ‌మ్ ను తెచ్చిన సినిమా `అర్జున్ రెడ్డి.` ఇక  ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సందీప్ వంగా బాలీవుడ్ లో షాహిద్ క‌పూర్ హీరోగా  అర్జున్ రెడ్డి ని రీమేక్ గా `క‌బీర్ సింగ్`  సినిమా చేసాడు. ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌లై మూడు వంద‌ల కోట్ల గ్రాస్ ను కొల్ల‌గొట్టి విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సినిమా షాహిద్ క‌పూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలివ‌డం విశేషం. ఇక `ఈ సినిమా నేనేందుకు చూడాల‌న్న` ఓ ఆస‌క్తికర‌మైన కామెంట్ చేసాడు ఇటీవ‌ల ఓ ప్రెస్ కాన్ఫ్ రెన్స్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఒక సారి ఆ విశేషాల్లోకి వెళితే... భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ , ర‌ష్మిక జంట‌గా `డియ‌ర్ కామ్రేడ్ ` చిత్రం రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఈ నె 26న విడుద‌ల కానుంది. ఇందులో భాగంగా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్నాడు విజయ్ దేవ‌ర‌కొండ‌.  ఈ కార్య‌క్ర‌మంలో `క‌బీర్ సింగ్` సినిమా చూసారా అని అడ‌గ్గా....అందుకు విజ‌య్ బ‌దులిస్తూ....`` అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్ అని, అందులో షాహిద్ క‌పూర్ న‌టించ‌డానీ, ఆ స్టోరి, ద‌ర్శ‌కుడు అన్నీ నాకు తెలుసు ..ఇందులో కొత్తేముంది ..నేనెందుకు క‌బీర్ సింగ్ మూవీ చూడాలంటూ చెప్పుకొచ్చాడు. ద‌ర్శ‌కుడు సందీప్ వంగా నా మ‌నిషి, క‌బీర్ సింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డం చాలా సంతోషంగా ఉంది...ఇంకా పెద్ద విజయం సాధించాలంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు సెన్సేష‌న‌ల్ హీరో.
`రాజుగారిగ‌ది` సినిమాతో డైర‌క్ట‌ర్ గా మారాడు ఓంకార్‌. అది చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద స‌క్సెస్ అయింది. ఇక ఉత్సాహంతో నాగార్జున, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో `రాజుగారి గ‌ది-2` చిత్రం రూపొందింది. అయితే ఆ సినిమా ఆశించిన రీతిలో ఆడ‌లేదు. ఇక ఇటీవ‌ల `రాజుగారి గ‌ది-3` త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో షూటింగ్ లాంచ‌నంగా ప్రారంభించారు. ఇంత‌లో త‌మ‌న్నా రాజుగారి గ‌ది 3 నుంచి త‌ప్పుకుందంటూ వార్త‌లు వ‌చ్చాయి. కార‌ణాలు ఏంట‌ని ఆరా తీయ‌గా ఓంకార్ ఫ‌స్ట్ చెప్పి ఒప్పించ‌ని క‌థకి త‌ర్వాత చెప్పిన క‌థ‌కి పొంత‌న లేక‌పోవ‌డంతో ఆమె త‌ప్పుకుంద‌ని తెలిసింది. దీంతో తాప్సీ, కాజ‌ల్ ను సంప్ర‌దించ‌గా భారీ రెమ్యూనిరేష‌న్ డిమాంట్ చేసార‌నీ, దీంతో అవికా గోర్ ని ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మ‌రో పాత్ర కోసం ర‌ష్మీ గౌత‌మ్ ని సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. ఆమె కూడా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది.  త్వ‌ర‌లో దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలున్నాయి.
  ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్, అభివృద్ధి మీద కాక అవినీతి మీద ద్రుష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని పదే పదే అక్రమాస్తుల కేసును ఉద్దేశిస్తూ చంద్రబాబు, ఆయన పార్టీ చేసిన అవినీతి ఆరోపణల మీద రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడో ఏమో కానీ ఎలా అయినా చంద్రబాబు అవినీతి పరుడు అనే ముద్ర వేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.  అందుకు అనుగుణంగానే బాబు నిర్ణయాలు, ఆయన ప్రభుత్వ ఉత్తరవుల మీద కేబినేట్ సబ్ కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే అమరావతి, పోలవరం, విధ్యుత్ కొనుగోళ్ళ విషయాల్లో తెలుగుదేశంని టార్గెట్ చేయడానికి చూస్తోంటే ఎప్పటికప్పుడు అది ఎదురు తిరుగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో చేసుకున్న సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్ సర్కారు భావిస్తోంది.  అందుకే వాటిని ఎలా అయిన బయట పెట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో అవకతవకలేమీ చోటు చేసుకోలేదని, పీపీఏలను రద్దు చేస్తే.. దాని ప్రభావం పెట్టుబడులపై పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఇటీవలే జగన్‌కు లేఖ రాసిన రాశారు. అలా ఒక విషయంలో గేట్లు క్లోజ్ అవ్వగా నిన్న మరో విషయంలో కూడా గేట్లు క్లోజ్ అయ్యాయి. అదే పోలవరం, పోలవరం నిర్మాణంలో అవకతవలకు సంబంధించి నిన్న రాజ్యసభలో వైసీపీ, బీజేపీ సభ్యులు కొన్ని ప్రశ్నలు సంధించారు.  అంతేకాక పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. అయితే విజయసాయి ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని తేల్చి చెప్పారు.  అందుకే ఈ విషయం మీద విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజన చట్టంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని షెకావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి వంద శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్ప్పిన ఆయన నిర్మాణ పనులు ఇప్పటి వరకు 60 శాతం వరకు పూర్తి అయ్యాయని తెలిపారు. 
  మీడియా అనేది.. ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ప్రశంసించాలి. తప్పు చేస్తే ప్రశ్నించాలి. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. అయితే ఇప్పుడు మీడియా సంస్థలు కొన్ని పార్టీల సొంత సంస్థలుగా మారిపోయి నిజాలను దాస్తున్నాయి. కొందరు నాయకులను ముంచుతున్నాయి. సరిగ్గా చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని తెలుగు మీడియా సంస్థలు గత ఐదేళ్ళలో బాబు ఏమి చేసినా పొగడటమే పనిగా పెట్టుకున్నాయి. బాబు ఏమి చేసినా ఆహా ఓహో అనడం, బాబు ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నట్టు చెప్పడం చేసాయి. అసలు బాబు పాలన మీద, పార్టీ మీద ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందనే విషయాన్ని నిజాయితీగా తెలియజేసే ప్రయత్నమే చేయలేదు. అదేమంటే బాబు పొగడ్తను తీసుకున్నట్టు విమర్శను తీసుకోరు. ఆయన్ని పొగిడితే పక్కన పెట్టుకుంటారు, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టినా, విమర్శించినా శత్రువుగా చూస్తారు అందుకే మేము భజన చేశామని కొందరు మీడియా అధినేతలు చెబుతున్నారు. మొత్తానికి ఆ మీడియా భజన వల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత.. బాబుకి తెలియకుండా పోయింది. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరి బాబు ఇకనైనా పొగడ్తతో పాటు విమర్శ కూడా తీసుకొని మళ్ళీ గాడిలో పెడతారేమో చూడాలి.
  బిగ్ బాస్ తొలి రెండు సీజ‌న్స్ ప‌ద్ద‌తిగా సాగిపోయాయి. చిన్న కాంట్రవ‌ర్సీ కూడా లేకుండా అయిపోయాయి. కానీ మూడో సీజ‌న్ మాత్రం ప్రారంభానికి ముందే  ఎన్నో వివాదాల‌కు తావిస్తుంది.  బిగ్ బాస్ తొలి సీజన్‌తోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. ఆయన కూడా అద్భుతంగా హోస్ట్ చేయడంతో తెలుగు టీవీ చరిత్రలోనే అత్యధిక టీఆర్‌పీ రేటింగ్‌తో ఈ షో దూసుకుపోయింది.  ఇక రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సీజన్ 100 రోజులపాటు సుధీర్ఘంగా సాగింది. హౌజ్‌లో మసాలా, గొడవలతో మొదటి సీజన్‌ను మించి హైలైట్ అయ్యింది.  మూడో సీజన్  జులై 21 నుంచి ‘బిగ్ బాస్’ షో ప్రసారం కానున్నట్టు ఇప్పటికే ప్రోమో వీడియో ఒకటి స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతోంది. ఇప్పుడు ఆ షో నిడివి, సెలబ్రిటీల సంఖ్యను ఖరారుచేస్తూ స్టార్ మా ఛానల్ ట్వీట్ చేసింది.  100 రోజులపాటు ఈ షో కొనసాగనుంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. అయితే గత రెండు సీజనల సమయంలో బ‌య‌టికి రాలేదో లేక ఏమో కానీ ఇప్పుడు ఈ షో మీద సెక్స్ ఆరోపణలు వస్తున్నాయి.  సినీ పరిశ్రమ వరకే పరిమితమైన లైంగిక వేధింపులు ఇప్పుడు ‘బిగ్ బాస్’లోకి కూడా వచ్చాయని శ్వేతా రెడ్డి ఆరోపిస్తోంది. తాను బిగ్ బాస్ హౌజ్‌లోని అడుపెట్టాలంటే తమ బాస్‌ను ఇంప్రస్ చేయాలని ఒక కో ఆర్డినేటర్ తనను అడిగాడని ఆరోపిస్తూ ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు లైంగిక వేధింపుల కింద ‘బిగ్ బాస్’ నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  తాజాగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది.. బిగ్‌ బాస్‌ 3 నిర్వాహకులు తనకు అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ సినీ నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వేతారెడ్డితో కలిసి రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన గాయత్రి గుప్తా పోలీసులకు కంప్లయింట్ చేశారు. బిగ్‌బాస్‌ 3 నుంచి నిర్వాహకులు ఫోన్‌ చేసి నటించేందుకు సిద్ధమా అని అడిగారని.. ఆ తర్వాత ఆ టీమ్‌కు సంబంధించిన మరి కొంత మంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చి అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారని గాయత్రి చెప్పారు.  ఈ మేరకు తాను సినిమాలు కూడా వదులుకున్నానని తెలిపారు. అయితే తనను అసభ్యకరమైన రీతిలో కమిట్‌మెంట్‌ అడగడంతో ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఫోన్‌ చేసి తనకు ఛాన్స్‌ రాలేదని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిగ్‌ బాస్‌ షోలో సెలక్ట్‌ అయ్యానని చెప్పడంతో ఆరు సినిమాల్లో ఛాన్స్‌లు వదులుకున్నానని తనకు జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ కూడా చేయలేదని గాయత్రి గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు.  షోను రక్తి కట్టించేందుకు పాపులర్ పర్సనాలిటీలతో పాటు సోషల్ మీడియాలో పాపులర్ అయినవారికి బిగ్ బాస్ హౌజ్ లోకి అవకాశం కల్పిస్తారు. బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ తో కంటెస్టెంట్లకు మరింత పాపులారిటీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ క్రేజ్ నే బిగ్ బాస్ కో-ఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌కి కంటెస్టెంట్ వీక్‌గా ఉండటంతో ఆ ప్రభావం రేటింగ్స్‌పై పడింది.  ఈసారి అలాంటి తప్పులు జరగకుండా.. ఆటను రక్తికట్టించగలిగే సెలబ్రిటీలను బిగ్ బాస్ హౌస్‌కి తీసుకువస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరైతే కాంట్రివర్శిలు చేసి ఫేమస్ అయ్యారో వాళ్ళనే సంప్రదించించారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఇదంతా న‌మ్మ‌డానికి లేద‌ని కావాల‌నే కాంట్ర‌వ‌ర్సీ చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేసి పాపుల‌ర్ కావాల‌ని చేస్తున్నారంటూ వాళ్ల‌పైన ఎదురు దాడి కూడా జరుగుతోంది.  తాజాగా స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకున్న కత్తి మహేష్ ఈ విషయం మీద కామెంట్స్ చేశారు.  బిగ్ బాస్ హౌస్‌కి వస్తే 100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలరా? అని నిర్వాహకులు అడగడంలో తప్పేం లేదని కత్తి మహేష్ అంటున్నాడు. అంతేకాదు గాయిత్రి గుప్తను ‘యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయి’ అని కూడా ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఆయన ఏమని పోస్ట్ చేశారంటే  ‘2017 లో..  బిగ్ బాస్ టీం: 70 రోజుకు సెక్స్ లేకుండా ఉండగలరా?  నేను: బాత్రూమ్ లో కెమెరాలు ఉండవుగా! పర్లేదు మ్యానేజ్ చేసుకుంటాను.  ఇదే ప్రశ్న , ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పడు 2019లో అడిగితే తప్పైపోతుందా? జస్ట్ ఆస్కింగ్! అని పోస్ట్ చేశారు ఆయన.  అయితే ఈ విషయాన్ని ఒక ఫీమెల్ కంటెస్టెంట్ని అడగకూడని గాయత్రి అంటుంటే లేదు అడిగితే తప్పేంటని కత్తి మహేష్ అడుగుతున్నారు. అయితే ఈ విషయం మీద మాత్రం బయటకి వచ్చి కంప్లైంట్ చేసిన వారిదే తప్పన్నట్టు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు కూడా.  ఒక ఆడపిల్లను అలా అడగొచ్చా ? అంటే ఏమని చెప్పగలం గేమ్ ఆడించే వారి రూల్స్ వారికి ఉంటాయేమో ?. ఈ వివాదాలు రాకుండా ఆ అగ్రిమెంట్ చేసే టీమ్ లో ఒక మహిళని పెట్టుకుని వారి చేత లేడీస్ ని ఈ ప్రశ్న వేయించి ఉంటే సరిపోయేది. అయితే రెండు సీజన్లు ఎటువంటి ఆరోపణలు లేకుండా సాగిన ఈ షో మీద వీరు కామెంట్ చేయడం వలన నష్టం వీరికా ? బిగ్ బాస్ కా ? పాపులర్ అయ్యేది బిగ్ బాసా ? ఈ ఇద్దరా ?
  ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి రోజూ ఏదో ఒక టెన్షన్ మామూలు అయిపొయింది. ఓపక్క పలువురు నేతలు పార్టీని వీడుతుండగా మరోవైపు పార్టీలోని నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్‌ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  అయితే దీనికి బుద్దా కూడా కౌంటర్‌ ఇచ్చారు. అయితే ఈరోజు పోద్దుపోద్దున్నే కేశినేని ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు గారు.. నన్ను వద్దనుకుంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధం. నాలాంటి వాళ్లు పార్టీలో ఉండాలంటే.. మీ పెంపుడు కుక్కను కంట్రోల్‌ చేయండి’  కేశినేని ట్విటర్‌లో పేర్కొన్నారు.  అయితే కేశినేని ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దాని మీద క్లారిటీ లేకున్నా, ఆ వ్యాఖ్యలు బుద్ధా వెంకన్నను ఉద్దేశించినవేనని అంటున్నారు విశ్లేషకులు. నిన్న కూడా పేరు ప్రస్తావించకుండా ‘‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు’’ అంటూ నాని ట్వీట్ చేశారు.  మొన్నటి ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ నుండి రెండో సారి ఎంపీగా గెలిచిన ఆయన ఆనాటి నుండే ట్వీట్ల ద్వారా పార్టీలో సంచ‌ల‌నంగా మారారు. పేర్లు ఆయన ఎక్కడా ప్రస్తావించకున్నా ఆయ‌న కృష్ణా జిల్లాకు చెందిన పార్టీలో అధికారం చెలాయిస్తున్న ఇద్ద‌రు నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఈ రచ్చ చేస్తున్నారని అర్ధమయ్యింది. అయితే ఆ మధ్య పార్లమెంటరీ నేత ఎన్నిక సమయంలో కూడా ఆయన రచ్చ రేపుతుండడంతో చంద్ర‌బాబు పిలిపించుకుని మాట్లాడారు.  అయితే తాత్కాలికంగా అప్పటికీ సైలెంట్ అయినా మళ్ళీ ట్వీట్ల రచ్చ మొదలుపెట్టారు. ముందుముందుగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు మినహా' అంటూ ఓ ట్విట్‌, మొదలుపెట్ట్రిన ఆయన ఆ తర్వాత నేను పార్టీలో ఎప్పుడూ ధిక్కార స్వరం వినిపి స్తూనే ఉంటా.. అది నా నైజం.. నేను నిజం మాత్రమే మాట్లాడతా.' అంటూ మరో ట్విట్‌ చేశారు. అయితే నిజానికి ఈయన టార్గెట్ చేస్తున్నది ఆ జిల్లా మాజీ మంత్రి, జిల్లా మొత్తానికి టీడీపీ ఫైనలైజర్ లీడర్ అయిన ఉమాని, అలాగే ఆయన అనుచరుడుగా పేరొందిన బుద్ధా వెంకన్నని.  ఉమాకి.. ఎంపీ కేశినేని నానికి మధ్య దూరం ఉందన్న విషయం ఇటీవల నాని పోస్టులతో స్పష్టమవుతోంది. రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలన్న పార్టీ అధినేత నిర్ణయం ఈ ఇద్దరు నేతల నడుమ దూరానికి కారణమైందని అంటున్నారు. వీరి నడుమ అంతరాన్ని తగ్గించేందుకు అధినేత చోరావ్ అ చూపినా ఫలితం లేకుండా పోయింది. నిజానికి కొద్ది రోజుల క్రితం వీఎంసీ తాజా మాజీ కార్పొరేటర్లతో నాని ఏర్పాటు చేసిన సమావేశం మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది.  ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో నాగుల్‌ మీరా పశ్చిమ నుంచి పోటా చేస్తారన్న సంకేతాలను నాని పంపారు. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత బుద్ధా వెంకన్న కొందరు పార్టీ నేతల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ అధినేత అనుమతి లేకుండా నాని ఎలా ప్రకటిస్తారని వెం కన్న కొందరు నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆ వ్యాఖ్యలను కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నానికి చేరవేశారు.  దీంతో వీరిద్దరి నడుమ దూరం పెరిగింది. అప్ప‌టి నుండి ఈయన కూడా కేశినేనికి టార్గెట్ గా మారారు. ఈ రచ్చ చంద్ర‌బాబునే ఇబ్బంది పెట్టె స్థాయికి చేరింది. తాజాగా నాలుగు ఓట్లు సంపా దించలేనివాడు నాలుగు పదవులు సంపా దిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు.. నాలుగు వాక్యాలు రాయలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు.. దౌర్భాగ్యం' అంటూ నాని ట్వీట్‌ చేశారు. నిజానికి ఇప్పుడు బుద్ధా వెంకన్న నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, దీంతో ఈ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవే అని అంటున్నారు.  దీనికి వెంకన్న కూడా వెంటనే స్పందించారు. ‘సంక్షోభ సమయం లో పార్టీ కోసం నాయకుడు కోసం పోరా డేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాగా అవకాశ వాదులు కాదు. చనిపోయే వరకు చంద్ర బాబు కోసం సైనికుడిలా పోరాడే వాడు కావాలి' అంటూ ట్వీట్‌ చేశారు. ఇదే స‌మ‌యంలో కేశినేని నానికి మ‌ద్ద‌తుగా పార్టీ నేత నాగుల్ మీరా ట్వీట్ చేసారు.   ‘పార్టీ కష్టకాలంలో చంద్రన్న ఆదేశంతో బాధ్యత తలకెత్తుకుని కోట్లాది రూపా యలు ఖర్చు పెట్టి వస్తున్నా మీకోసం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించి, విజయవాడ పార్లమెంటు నియోజక వర్గాన్ని విజయపథంలో నడిపించిన కేశినేని నాని కష్టంతోనే నీకు, నాకు పదవులు దక్కాయి. గుర్తుపెట్టుకో’ అంటూ నాగుల్‌ మీరా, బుద్దా వెంకన్నను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.  ఎంపీ కేశినేని నాని తాజా ట్వీట్ చూస్తుంటే ఆయ‌న తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారనే విష‌యం అర్దం అవుతోంది. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్‌లో పార్టీలో తాను అస‌వ‌రం లేద‌ని భావిస్తే ఆ విష‌యం త‌న‌కు స్ప‌ష్టం చేయా ల‌ని తాను ఎంపీ ప‌దవితో పాటుగా పార్టీకి కూడా రాజీనామా చేస్తాన‌ని ట్వీట్ ద్వారానే చంద్ర‌బాబుకు అల్టిమేటం జారీ చేసా రు. అదే స‌మ‌యంలో పెంపుడు కుక్క‌ను కంట్రోల్ చేయండి అంటూ ప‌రోక్షంగా తాను ట్వీట్ల ద్వారా యుద్దం చేస్తున్న నేత గురించి ప్ర‌స్తావించిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఏమి చేస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది.  
  గత ఎన్నికల్లో హోరాహోరీ పోరాడిన వైసీపీ ప్రభుత్వం నిన్న తొలి పద్దును ప్రవేశపెట్టింది. దాదాపు రూ.2.28 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై జగన్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ఎన్నికల్లో తాము గెలవడానికి ఎంతో దోహదపడిన మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల అమలు కోసం బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయించారు.  అయితే ఈ కేటాయింపుల్లో ఎక్కువ మొత్తం సంక్షేమ పదకాలకే కేటాయించిన నేపధ్యంలో ముందుకుముందే విమర్శలు రాకుండా తమకి ఒక విజన్‌ ఉందని, రాబోయే కాలంలో తమ విజన్ తో  దేశంలోనే ఎపీను ప్రథమ స్థానంలో నిలుపుతామని బడ్జెట్ సందర్భంగా బుగ్గన వ్యాఖ్యానించారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే సంక్షేమ పథకాల కోసం రూ.90 వేల కోట్లు కేటాయించిన తరుణంలో ప్రభుత్వానికి విజన్ ఎంతో అవసరం.  పూర్తి బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా ఆదాయ వనరులేమో రూ.1,78,697 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఏపీకి పన్నుల రూపేణా 75,437 కోట్లు సమకూరుతాయని సర్కారు భావిస్తుండగా కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.34,833 కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ.7354 కోట్లు, రుణ వసూళ్ల ద్వారా రూ.600 కోట్లు ఖజనాకు చేరతాయని భావిస్తోంది. మరోపక్క రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు ఉండగా ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58 కోట్లుగా ఉంది.  ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం మీదనే ఏపీ సర్కారు భారీ ఆశలు పెట్టుకుంది. కేంద్ర నుంచి నిధుల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. గతంలో చంద్రబాబు కేంద్రం నుంచి రూ.50 వేల కోట్ల సాయాన్ని ఆశిస్తే వారిచ్చినది రూ.19 వేల కోట్లే. అంటే డిమాండ్ కి సప్ప్లై కి మధ్య ఉన్న తేడా రూ.30 వేల కోట్లు. ప్రస్తుతానికి వైసీపీ బీజేపీ మధ్య సఖ్యత ఉన్నా అడిగినంత నిధులిచ్చేంత అవసరమైతే మోడీకి లేదు.  దీంతో ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పడక తప్పదేమో ? గత ఏడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది బడ్జెట్ అంచనా 19.32 శాతం పెరుగుతుందని వైసీపీ నిన్న ప్రకటించింది. కానీ ఆ అంచనాలు ఎంత మేర నిజమవుతాయో చెప్పలేం. వారి అంచనా మేరకు పెరగకపోతే జగన్ సర్కారుకు చిక్కులు తప్పవు. ఎందుకంటే గత 2018-19 బడ్జెట్లో బాబు సర్కారు అంచనాల కంటే తక్కువగా ఆదాయం సమకూరింది.  ఆ వ్యత్యాసం ఎంత అంటే రూ.35 వేల కోట్లకుపైగా. దీంతో అప్పుడు రూ.33,461 కోట్ల మేర అప్పులు తెస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు రూ.38 వేల కోట్ల మేర రుణాలు తెచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో అదే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ఇక రుణాల రూపంలో రూ.46,921 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2018-19 నాటికి రాష్ట్రానికి రూ.2.58 లక్షల కోట్ల రుణాలు ఉన్నాయని నిన్న బుగ్గన స్పష్టం చేశారు.  అయితే గత ఆర్థిక సంవత్సరంలో టీడీపీ సర్కార్ ఎడాపెడా అప్పులు చేస్తోందని ఆరోపించిన వైసీపీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు తేవాల్సిన దుస్థితి. జగన్ సమర్ధతకి ఆది పెద్ద పరీస్ఖ అనే చెప్పాలి. నిజానికి పాలనలో అనుభవం ఉన్న చంద్రబాబుకే సాధ్యం కానిది, యువకుడిని అని చెబుతున్న జగన్ ఏమి చేయనున్నారో ? చూడాలి మరి.  
  ఏపీ రాజధాని అమరావతి మీద జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండే జానానికి అనుమానం పట్టుకుంది. దానికి కారణం మొదటి నుండి రాజధాని అక్కడ కట్టడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తూ రావడమే. అదీ కాకా ఎన్నికల ముందు జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో జగన్‌ను రాజధాని మార్పుపై అడిగితే ఏమీ స్పందించకుండా ఉండిపోయాడు. ఆ మౌనం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉంటుందేమో అన్న సందేహాలున్నప్పటికీ జగన్ ఆనాడు స్పందించకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే.  అయితే జగన్ వైపు నుండి పడతాయి అనుకున్న బ్రేకులు ప్రపంచ బ్యాంక్ నుండి పడేలా కనిపిస్తున్నాయి. దానికి కారణం అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే వెంటనే తాము తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. అయితే బాబు సర్కార్ ఆ నిదులను సద్వినియోగం చేసింది కాబట్టి వాళ్ళు తనిఖీలు చేసినా వచ్చే నష్టం లేదు. కానీ ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం ఇప్పటి వరకు దేశంలో లేదని, ఇప్పుడు కూడా ఆ అవకాశం ఇవ్వమని కేంద్రం చెప్తోంది.  ఇక దీంతో ఎటూ రాజధాని మార్చాలని చూస్తున్న జగన్ కు ఈ  వ్యవహారం కలిసోచ్చేలా ఉంది. ఇప్పటి వరకూ లేని ప్రపంచబ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ప్యానెల్ తనిఖీ అనేది కొత్త సంప్రదాయమని భావిస్తున్న కేంద్రం అవకాశం ఇస్తే దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూడా తనిఖీలు చెయ్యాలని చూస్తారని అది మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూత్రప్రాయంగా పేర్కొన్నట్టు సమాచారం. దాని స్థానే ఇతర మార్గాల ద్వారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జగన్ కి కాస్త సంతోషంగానే ఉన్నా, ఆయనకి ఇది రిస్క్ లానే తోస్తోంది. ఎందుకంటే తనిఖీల విషయమై తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంక్ స్పష్టం చేసింది. కానీ కేంద్రం తనిఖీలను వ్యతిరేకిస్తుంది. అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. కానీ లేఖ అయితే పంపింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయనుంది అనేదే ఆసక్తికరంగా మారింది.  ఎందుకంటే నిర్మణాలు మొదలు పెట్టి చాలా వరకూ పూర్తి చేసుకున్న అమరావతికే నిధులు సమకూర్చలేకుంటే ఇంకా కొత్తగా ఓకవేళ దొనకొండ రాజధాని అని చెప్పినా అది ప్రజామోదం పొందే అవకాశం లేదు, దీంతో జగన్ ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. చూడాలి అమరావతి ఏమవుతుందో ?
  అనగనగా ఓ కాకి! దానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా తనలాంటి కాకులే కనిపించేవి. తోటి కాకుల కావుకావులతో దాని చెవులు చిల్లులు పడిపోయేవి. అసలు ఆ కాకులను చూడగానే జనమంతా విసుక్కునేవారు. ఏదో కాసిన ఎంగిలి మెతుకులు విదిలించి వాటిని వదిలించుకునేవారు. రోజురోజుకీ ఆ కాకికి తన మీద తనకే అసహ్యం వేయడం మొదలైంది. ‘కావుకావుమంటూ కరుకుగా అరవాలి. సర్వభక్ష్యాలనూ తిని కడుపు నింపుకోవాలి. ఇదీ ఓ బతుకేనా!’ అనుకుంటూ ఓ రోజు దీర్ఘాలోచనలో ఉండగా... దానికి పక్కనే ఉండే మామిడి చెట్టు మీద నుంచి ఒక తీయని గొంతు వినిపించింది.   కాకి పక్కకి తిరిగి చూసేసరికి మామిడి చెట్టు మీద ఒక కోయిల కనిపించింది. ‘మిత్రమా! నీ గొంతు భలే మధురంగా ఉంది సుమా! పైగా నాలాగా నువ్వు నానాచెత్తా తినాల్సిన అవసరం లేదు. హాయిగా ఆ మామిడి చిగురులతో కడుపు నింపుకోవచ్చు. నీ గొంతు విన్న ఈ లోకం ఉగాది వచ్చేసిందని పొంగిపోతుంది. నీదెంత అదృష్టజాతకం’ అని తెగ పొగిడేసింది. ‘ఆ నాదీ ఒక బతుకేనా!’ అంది కోకిల నిట్టూరుస్తూ. ఆపై ‘నా రంగు నీకంటే నలుపు. పైగా వసంత రుతవులో తప్ప కూయలేను. అంతదాకా ఎందుకు! ఆఖరికి నా పిల్లలని కూడా నేను పొదగలేక, నీ గూటిలోకి చేరుస్తుంటాను. నా జాతి ముందుకి సాగుతోందంటే అది నీ చలవే. ఇక అదృష్టం అంటావా! ఆ మాట వస్తే చిలుకే గుర్తుకువస్తుంది. పంచరంగుల వన్నెలు, పంచదార పలుకులు దాని సొంతం కదా’ అని నిట్టూర్చేసింది.   కోకిల మాటలు విన్న కాకికి అందులో నిజం లేకపోలేదనిపించింది. వెంటనే ఓ చిలుకని వెతుక్కుంటూ బయల్దేరింది. కొన్ని గడియలు గడిచేసరికి ఓ జామచెట్టు మీద మాంచి దోరపండుని తింటున్న చిలకమ్మ కనిపించింది. ‘చిలుకా క్షేమమా! ఇప్పటిదాకా నీ అదృష్టం గురించే నేనూ కోకిలా మాట్లాడుకున్నాము. నిన్ను చూస్తుంటే కోకిల చెప్పినదానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తోంది. ఏమి అందం, ఏమి గాత్రం... పైగా కమ్మని జామపళ్లతోనే కడుపు నింపుకునే భాగ్యం. అసలు బతుకంటే నీదే!’ అంటూ పొగడ్తలను వల్లె వేసింది.   ‘ఉష్‌! గట్టిగా అరవబాక. ఏ వేటగాడన్నా వింటే నన్ను పట్టుకుపోయి పంజరంలో బంధించేయగలడు. అయినా నాదీ ఒక అందమేనా? నాదీ ఒక స్వరమేనా? అసలు నువ్వెప్పుడన్నా నెమలి అనే పక్షిని చూశావా? అది పురివిప్పి నాట్యమాడటాన్ని గమనించావా? అదీ అందమంటే! అదీ నాట్యమంటే! అదీ అదృష్టమంటే!’ అంటూ నోరు తెరుకుని ఉండిపోయింది. కాకికి చిలుక మాటలు నిజమే కదా అనిపించాయి. తానెప్పుడూ నెమలి నాట్యం గురించి వినడమే కానీ చూసే అదృష్టం కలుగలేదు. ఈసారి ఆ నాట్యమేదో తను కూడా చూసి తీరాలి. చిలుక చెప్పిన మాటలను పూర్తిగా రూఢిచేసుకోవాలి. నెమలి జీవితమే అన్నింటికంటే అదృష్టజాతకం అని రుజువుపరుచుకోవాలి. అలా అనుకుంటూ నెమళ్లు ఎక్కువగా తిరుగాడే ప్రాంతానికి వెళ్లి కాపువేసింది.   కాకి అదృష్టం ఏమో కానీ, కాసేపట్లోనే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గుంపులోని నెమళ్లు కొన్ని పురివిప్పి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఆ నాట్యాన్ని చూసి కాకి కళ్లు చెదిరిపోయాయి. ఏం అందం! ఏం నాట్యం! ఏం ఈకలు! ఏం హొయలు! అనుకుంటూ ఆశ్చర్యపోయింది. వెంటనే ఓ నెమలి దగ్గర వాలి ‘ఆహా అదృష్టమంటే మీదే కదా! అసలు పక్షిజాతిలో మిమ్మల్ని మించినవారు లేనే లేరు. మీ గాత్రం, మీ నాట్యం, మీ అందం.... ముందర మా బతుకులన్నీ బలాదూర్‌’ అనేసింది.   ఆ మాటలు విన్న నెమలి కళ్లలోంచి కన్నీరు ఒలికింది ‘ఓసి పిచ్చిదానా! నాదీ ఒక బతుకేనా! మబ్బు పట్టినప్పుడు తప్ప నేను నాట్యం చేయలేను. మిగతా సమయాలలో ఈ ఈకలు నాకు బరువు. పైగా ఈ ఈకల కోసమే వేటగాళ్లు నన్ను వేటాడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని వండుకు తినేందుకు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఇక అన్నింటికీ మించిన దౌర్భాగ్యం చెప్పనా! పక్షినన్న మాటే కానీ ఆకాశంలో అంతెత్తున ఎగరగలనా? నా మటుకు నాకైతే నిన్ను చూసినప్పుడల్లా భలే ఈర్ష్యగా ఉంటుంది. ఏది పడితే అది తిని బతికేస్తావు. ఆకాశంలో చక్కుర్లు కొడుతూ తిరిగేస్తావు. నీకు వేటగాళ్ల బాధ లేదు. ఆకలితో ఉండే రోజూ ఉండదు. హాయిగా వేళకింత తింటూ, పిల్లల్ని కంటూ, గూట్లో గువ్వల్లే బతికేస్తావు. అసలు అదృష్టమంటే నీది. అన్నింటికంటూ అమూల్యమైన స్వేచ్ఛ నీ దగ్గర ఉంది. అన్నింటికంటే శాపమైన ఆకలి నీ జోలికి రాదు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమలి మాటలకు కాకి మనసు ఆకాశంలో తేలిపోయింది. ఆ మనసుతో పాటే తాను కూడా రివ్వున నింగికి ఎగిరిపోయింది. (జానపద కథ ఆధారంగా) - నిర్జర.
  ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం మీ డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలనీ, వారి కళ్లో మీ అభిరుచి పట్ల అభినందన కనిపించాలనీ ఎవరికి మాత్రం అనిపించదు. అతిథుల సంగతి పక్కన పెడితే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే ఇందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు. అందుకోసమే ఈ చిన్న చిట్కాలు...     మామూలు వస్తువులతోనే అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడుకునే వస్తువులనే మరింత కళాత్మకంగా కనిపించేవి ఎన్నుకొంటే సరి. బట్టలు తగించే కొక్కేలు, కర్టెన్ రాడ్స్, పెన్‌స్టాండులు, గడియారాలు, నైట్‌ ల్యాంప్స్ వంటివి కొంచెం విభిన్నమైనవి ఎంచుకొని చూడండి.     వాల్‌ స్టికర్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్ పుణ్యమా అని ఇప్పుడు వాల్‌స్టికర్స్‌ అందరికీ అందుబాటులోనే దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా మరీ అంత ఎక్కువగా ఉండవు. కాకపోతే ఎలాంటి బొమ్మని ఎంచుకోవాలి? అది ఎంత పరిమాణంలో ఉండాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవాలి. గోడ రంగుని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఆర్డర్‌ చేసిన వాల్ స్టికర్‌ ఒకే షీట్‌ మీద వస్తోందా లేకపోతే వేర్వేరు స్టికర్స్‌ని అసెంబుల్‌ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి.     చిన్న చిన్న బొమ్మలతో ఇంట్లో చిన్న బొమ్మలు చాలానే పేరుకుంటాయి. చాక్లెట్లతో పాటుగా వచ్చినవో, చైనా బజార్లలో కొనుక్కున్నవో, కీచెయిన్లు ఊడిపోయినవో మిగిలిపోయిన బొమ్మలను అక్కడక్కడా అతికించవచ్చు. ఫ్రిజ్‌ తలుపులకీ, కిటికీ చెక్కలకీ, స్విచ్‌ బోర్డులకీ డబల్ స్టికర్‌తో అంటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు.     పోస్టర్స్‌ గృహాలంకరణకు సంబంధించి అతి చవకగా లభించేవి వాల్‌ పోస్టర్లే. కాకపోతే చవగ్గా దొరుకుతోంది కదా అని ఇల్లంతా నింపితే మాత్రం వీటితో అసలుకే మోసం వస్తుంది. మరీ భారీ పరిమాణంలో ఉండే పోస్టర్లు ఒకోసారి ఇల్లు ఇరుకుగా ఉన్న భావన కలిగిస్తాయి. కాబట్టి కంటికి నదురుగా, మరీ ఆడంబరంగా తోచని పోస్టర్లని ఎన్నుకోవాలి. వీటిని సెలోఫిన్‌ టేప్‌తో అతికిస్తే త్వరగా ఊడిపోవడమే కాకుండా, గోడ మీద కూడా మరకని మిగులుస్తాయి. ఇలాంటి సందర్భాలలో మెడికల్‌ షాపుల్లో దొరికే తెల్లటి సర్జికల్‌ టేపుని ఉపయోగిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటు గోడకీ, అటు పోస్టరుకీ నష్టం కలగకుండా తీసివేయవచ్చు.     ఉపాయం ఉంటే ఇల్లు మనది కాకపోవచ్చు, మేకులు కొట్టడం ఇష్టం లేకపోవచ్చు, గోడకి ఏదన్నా అంటించడానికీ మనస్కరించకపోవచ్చు... అయినా కూడా కాస్త శ్రద్ధ పెడితే గదిని అలంకరించేందుకు చాలా ఉపాయాలు తడతాయి. ఫ్రిజ్‌ మీద ఒక బొమ్మల కొలువు తీరుతుంది, బెడ్‌ల్యాంప్‌ నుంచి ఒక అందమైన బొమ్మ వేళ్లాడుతుంది, టీవీ కింద ఉన్న కేబుల్ బాక్స్‌ మీద ఒక టెడ్డీ బేర్‌ కూర్చుంటుంది... కాస్తంత ఉపాయం ఉంటే గది మొత్తం అందంగా మారిపోతుంది. కావాలంటే ఒక్కసారి మీ డ్రాయింగ్ రూమ్‌ని పరిశీలించి చూడండి. - నిర్జర.
భూమి ఓ అసాధారణమైన గ్రహం. అదృష్టమో, ప్రకృతి వరమో కానీ ఇక్కడ జీవం మనుగడ సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ఉన్నాయి. అనువైన ఉష్ణోగ్రతలు, సూర్యుడి నుంచి తగినంత దూరం, అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ పొర, నీటి సౌలభ్యం, రాతి నేల, గురుత్వాకర్షణ శక్తి, భూమి మీదకు ఉల్కలు దూసుకురాకుండా కాపాడే గురుగ్రహం.... ఇలా చెప్పుకొంటూపోతే అద్భుతం అనదగ్గ సానుకూలతలు ఎన్నో భూమికి సొంతం. అందుకనే భూమిలాగా జీవానికి సహకరించే ప్రాంతం ఈ విశ్వంలో ఉండే అవకాశం లేదని నమ్ముతుంటారు శాస్త్రవేత్తలు. ఎక్కడో శనిగ్రహం చుట్టూ తిరిగే టైటాన్ వంటి అతికొద్ది ఉపగ్రహాల మీద మాత్రమే జీవం మనుగడ సాగించే సావకాశం ఉందని భావిస్తుంటారు. మరి ఇప్పుడో... భూమికి కేవలం 39 కాంతిసంవత్సరాల దూరంలో సౌరకుటుంబాన్ని పోలిన ఓ వ్యవస్థ ఉన్నట్లు నాసా ప్రకటించింది. ఏడాదిలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో అది ఓ కాంతి సంవత్సరం అన్న విషయం తెలిసిందే! వినడానికి ఈ దూరం కాస్త ఎక్కువే అనిపించినా, ఈ అనంత విశ్వంలో ఇది ఇంచుమించు పక్కింటితో సమానం. కుంభరాశిలో భాగంగా ఉన్న ఈ వ్యవస్థలోని నక్షత్రానికి ట్రాపిస్ట్‌ 1 అని పేరు పెట్టారు. ఈ ట్రాపిస్ట్‌ 1 నక్షత్రం చుట్టూ ఏడు గ్రహాలు తిరుగుతున్నట్లు గమనించారు. ఈ గ్రహాలన్నీ కూడా సదరు నక్షత్రానికి చాలా చేరువలో ఉన్నాయట. ఒక గ్రహం మీద నిలబడి చూస్తే మిగతా ఆరు గ్రహాలన్నీ కూడా కనిపించేంత దగ్గరదగ్గరగా ఇవి ఉన్నాయి. సూర్యుడితో పోలిస్తే ఈ ట్రాపిస్ట్‌ నక్షత్రం దాదాపు పదోవంతు మాత్రమే ఉంటుంది. పైగా దీని నుంచి వచ్చే కాంతి మన సూర్యకాంతికంటే 200 రెట్లు తక్కువట. అయితే నక్షత్రానికి బాగా దగ్గరగా ఉండటం వల్ల దీని చుట్టూ తిరిగే గ్రహాల మీద ఉష్ణోగ్రతలు 0- 100 మధ్యలోనే ఉంటాయని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా 4,5,6 గ్రహాలు జీవానికి మరింత అనువుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ట్రాపిస్ట్‌ 1 గురించి అందిన సమాచారమంతా వాటి మీద మనిషి మనుగడకి సంబంధించి కొత్త ఆశలను కల్పించేట్లుగానే ఉంది. అయితే అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ గ్రహాల మీద నీటి లభ్యత ఎంత, వాటి మీద లభించే ఖనిజాల ఏమిటి... లాంటి పరిశోధనల ఇంకా జరగాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వాటి మీద మనుషులు జీవించే అవకాశం ఉందో లేదో నిర్ధారించగలం. అసలు ఇప్పటికే వాటి మీద కొన్ని జీవులు బతికేస్తున్నాయేమో అన్న అనుమానాలు కూడా మొదలైపోయాయి. ఏది ఏమైనా ఇన్నాళ్లకి భూమిని పోలిన గ్రహాలు కొన్ని శాస్త్రవేత్తలకు కొత్త ఆశలను కల్పిస్తున్నాయి.   - నిర్జర.
  సంచలన నిర్ణయాలకి కేరాఫ్ గా మారిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈరోజు  నుండి అసెంబ్లీకి ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు రావడంలేదో లెక్క తేల్చాలని కొందరు సీనియర్ లను ఆయన ఆదేశించారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో ఈరోజు నుండే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకి అటెండెన్స్ వేయాలని నిర్ణయించారు. ప్రతి సభ్యుడి ఏ టైంకి సభకు వస్తున్నారు.. ? ఎప్పుడు వెళ్తున్నారు ? అన్న సమాచారాన్ని పక్కాగా నమోదు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్‌కి జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతిరోజు సాయంత్రం తనకు నివేదిక ఇవ్వాలని కూడా జగన్ ఆదేశించారని అంటున్నారు. సభలో టీడీపీ బలం చాలా తక్కువగా ఉన్నప్పటికీ అధికారపక్షాన్ని వారు దీటుగానే ఎదుర్కొంటున్నారు.  దానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే టీడీపీ విమర్శలు చేస్తున్న సమయంలో సభలో ఎక్కువ మంది వైసీపీ సభ్యులు ఉండటం లేదని జగన్ నోటీస్ కి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తమ సభ్యులకు అటెండెన్స్ వేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు హాజరు తీసుకోవడం విప్ ల బాధ్యత అయితే, ఎవరి జిల్లాల వారిని వారు డుమ్మా కొట్టకుండా ఆయా జిల్లాల మంత్రులకి బాధ్యత అప్పగించారు.
  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. అధికార, విపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై వైసీపీ నేత, మంత్రి పేర్నినాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడుని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారని నాని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న టెక్కలి ప్రజలు రోజూ ఇదేం గోల అని బాధపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. నీయమ్మ ఏంట్రాబాబు ఈ గోల అంటూ ఆవేదన చెందుతున్నారంటూ పేర్నినాని వ్యాఖ్యానించారు.  పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తన వ్యాఖ్యలు తప్పని తేలితే వెనక్కి తీసుకుంటానని పేర్ని నాని స్పష్టం చేశారు. అనంతరం సభలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. నాని వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాని వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని తెలిపారు. సభలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ మూడు రోజులుగా బాధపడుతున్నట్లు తెలిపారు. నీయమ్మ, బయటకు రా చూసుకుందాం, తేల్చుకుందాం అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంటి ఈ వ్యాఖ్యలు అంటూ ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు. తాను ఇప్పటి వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, వల్గర్ గా అసలు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను ఏదైనా తప్పుగా మాట్లాడితే సభలో ఇక ఉండనంటూ అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కియా మోటార్స్ విషయంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సెటైర్లు వేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కారణంగానే ఏపీకి కియా మోటార్స్ పరిశ్రమ వచ్చిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బాబు స్పందించారు. "రాజేంద్రనాథ్ రెడ్డిగారూ.. చాలా తెలివైన వాళ్లు మీరు. హ్యాట్సాఫ్. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే, 2009లో రాజశేఖరరెడ్డి చనిపోయారు. ఆయన ఆత్మ వెళ్లింది ఆ సీఈఓ దగ్గరకు. 2016లో మీరు చంద్రబాబు దగ్గరకు వెళ్లండి. ఆయన అన్నీ ఇస్తారు. ఇన్సెంటివ్స్ అన్నీ. అన్ని పనులు చేస్తారు.. పెట్టమని ఆయన చెప్పారు. ఆయనొచ్చి పెట్టారు. అదీ మీరు చెప్పే కథ. మీరు ఎంత గొప్పనాయకులంటే, ఇలాంటి అసత్యాలను కూడా సత్యంగా చెప్పే మనస్తత్వం మీకుంది. మీకు కంగ్రాచ్యులేషన్స్" అని చంద్రబాబు సెటైర్లు వేశారు.
గోల్ప్‌ ఈ మధ్య పుట్టిన ఆట కాదు. రోమన్ల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆట. అయితే ఇది ఏనాడూ ప్రజాదరణ పొందలేకపోయింది. ఆట ఆడేందుకు విశాలమైన మైదానాలు, ఖరీదైన పరికరాలూ కావల్సి రావడంతో ఇది కేవలం ధనవంతుల ఆటగా నిలిచిపోయింది. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో గోల్ఫ్ ఇప్పుడు చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఇన్నాళ్లుగా ఫలానా వ్యాయామం చేస్తే ఈ ఫలితం, ఫలానా ఆట ఆడితే ఆ ఫలితం అని వింటూ వస్తున్నాము. మరి గోల్ఫ్ ఆడటం వల్ల ఉపయోగం ఏమిటా అన్న సందేహం శాస్త్రవేత్తలకి వచ్చింది. దాని ఫలితమే ఈ నివేదిక-     గోల్ఫ్ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్ట్‌ World Golf Foundation అనే సంస్థ గోల్ఫ్‌ ఆటకీ ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని గమనించేందుకు ఈ గోల్ఫ్‌ అండ్‌ హెల్త్‌ ప్రాజెక్టుని ఆరంభించింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు... గోల్ఫ్‌ మీద ఇప్పటివరకూ జరిగిన ఐదేవేల పరిశోధనలను సమీక్షించారు. గోల్ఫ్‌ ఆడే సమయంలో వారిలో ఎన్ని కేలొరిలు ఖర్చవుతున్నాయి, వారు సగటున ఎంత దూరం నడవాల్సి వస్తోంది, వారి ఆరోగ్యం మీద ఆట ప్రభావం ఏమిటి... తదితర విషయాలను పరిశీలించారు.     జీవతకాలమే మెరుగుపడింది. పరిశోధకుల సమీక్షలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో బయటపడ్డాయి. గుండెపోటు, పక్షవాతం, డయాబెటీస్‌, పేగు క్యాన్సర్ వంటి 40 రకాల తీవ్రమైన రోగాలను గోల్ఫ్‌ నివారించగలుగుతోందని తేలింది. ఒక పరిశోధనలో అయితే గోల్ఫ్‌ అడేవారి జీవితకాలం ఏకంగా ఐదేళ్లపాటు మెరుగుపడినట్లు బయటపడింది. ఇంతేకాదు! వయసుతో పాటు వచ్చే నరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధ వ్యాధులు... గోల్ఫ్‌ ఆటలో మాయమవుతున్నాయట. గోల్ఫ్‌ ఆటతో శరీరమే కాదు మనసు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మెరుగుపడటంతో పాటుగా... ఆందోళన, మతిమరపు, క్రుంగుబాటు వంటి వ్యాధుల నుంచి దూరం కావడం జరిగిందట.     కారణం! గోల్ఫ్ ఆటలో ఆటగాళ్లు కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాలి. వారి బలమంతా ఉపయోగించి బంతిని కొట్టాల్సి ఉంటుంది. విశాలమైన పచ్చిక బయళ్లలో గుట్టలని దాటుతూ, మైదానాలలో నడుస్తూ ఈ ఆటని ఆడాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు దాదాపు 6 నుంచి 13 కిలోమీటర్ల వరకూ నడుస్తారనీ, 500కి పైగా కేలొరీలను ఖర్చు చేస్తారని తేలింది. పైగా గోల్ఫ్‌ ఆటని వయసుతో సంబంధం లేకుండా ఏ వయసువారైనా ఆడవచ్చు. తమ ఓపికను బట్టి ఆటలో మార్పులు చేసుకోవచ్చు. ఈ కారణాలన్నింటి వలనా గోల్ఫ్‌ గొప్ప ఆరోగ్యాన్ని అందించే ఆటగా మారిపోయిందని పరిశోధకులు సంతోషపడిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఐదుకోట్ల మందికి పైగా ఈ ఆటని ఆడుతున్నారనీ, భవిష్యత్తులో మరింత మంది ఈ ఆట పట్ల ఆసక్తి చూపుతారనీ భావిస్తున్నారు. - నిర్జర.
  మనకి ఏది వచ్చినా పట్టడం కష్టం. ఫలానా ధెరపీ మంచిదనో, ఫలానా ఆహారం తినిచూడండి అనో ఓ వార్త రాగానే... దానిని అల్లుకుని వందలాది వార్తలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. మనం కూడా వాటికి అనుగుణంగానే ప్రవర్తించేస్తుంటాం. ఏం చేస్తాం! ఆరోగ్యం గురించి అవగాహనతో పాటుగా తొందరపాటు కూడా సహజమేనేమో! బహుశా అందుకేనేమో విటమిన్‌ డి ప్రాముఖ్యత గురించి వార్తలు వినిపించగానే కొంతమంది ముందూవెనుకా ఆలోచించకుండా డి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం మొదలుపెట్టారు. వైద్యులు ఇష్టపడకపోయినా అడిగి మరీ రాయించుకుంటున్నారు. కానీ ఇదేమంత శుభపరిణామం కాదంటున్నారు నిపుణులు.   ఎందుకీ విటమిన్ డి: విటమిన్‌ డి గురించి ఒకప్పుడు పెద్దగా తెలియదు. శరీరంలోకి చేరిన కాల్షియం సరిగా ఒంటపట్టాలంటే విటమిన్ డి అవసరం అన్న విషయం మాత్రమే తెలుసు. కానీ ఈమధ్య మన శరీరానికి విటమిన్‌ డి ఎంత అవసరమో చెబుతూ, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పరిశోధన వెలుగుచూస్తూనే వస్తోంది. ఈ పరిశోధనల ప్రకారం మెదడు ఎదుగుదలలో లోపాల దగ్గర్నుంచీ షుగర్‌ వ్యాధి వరకు, ఎన్నో సమస్యలు రాకుండా డి విటమిన్‌ తోడ్పడుతుంది. ఇక కాల్షియం లోపం వల్ల ఏర్పడే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు త్వరగా దరిచేరకుండా విటమిన్‌ డి అడ్డుకొంటుందని నమ్ముతున్నారు.   అదనంగా ఎందుకు: మన శరీరానికి విటమిన్‌ డిని అందించే ప్రధాన వనరు సూర్యకాంతి. ఎందుకంటే ఆహారపదార్థాల ద్వారా విటమిన్ డి లభించే శాతం చాలా తక్కువ. అందుకనే ఈ మధ్య కాలంలో నూనె, పాలు, పళ్లరసాలు వంటి ఉత్పత్తులకు విటమిన్‌ డిని కృత్రిమంగా జోడించి మరీ విక్రయిస్తున్నారు. ప్రస్తుత జీవనశైలిలో మనం బయట తిరిగేది తక్కువ కాబట్టి, శరీరానికి అందవలసినదానికంటే తక్కువ విటమిన్‌ డి అందుతోందేమో అన్న అనుమానం ప్రతివారిలోనూ మొదలైంది. ఆ ఆనుమానమే అవసరం లేకపోయినా విటమిన్ డి తీసుకునే అలవాటుని కల్పిస్తోంది.   ఎంత అవసరం! చాలామంది రోజుకి 1000 IUల విటమిన్‌ డి మన శరీరానికి అవసరం అనుకుంటారు. కానీ 2010లో సరిచేసిన పరిమితుల ప్రకారం 70 ఏళ్లలోపువారికి 600 IUలు, 70 ఏళ్లు దాటినవారికి 800 IUల విటమిన్‌ డి అందితే సరిపోతుంది. దీనికి ఓ 200 IUలు తగ్గినా కూడా పెద్ద ప్రమాదం లేదని చెబుతున్నారు. కీళ్లవ్యాధులు వంటి సమస్యలు ఉన్నవారు తప్ప ప్రత్యేకించి విటమిన్ డిను మందుల ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ అటు వైద్యులు ఇటు రోగులు కూడా డి విటమిన్‌ను తీసుకునేందుకు ఉబలాట పడుతున్నారు.   దుష్ప్రభావాలు లేకపోలేదు: అవసరానికి మించి విటమిన్ డి మన శరీరంలోకి చేరితే చిన్నాచితకా దుష్ప్రభావాలు లేకపోలేవంటున్నారు. నీరసం, నిద్రలేమి, తలనొప్పి, అజీర్ణం, వికారం వంటి తాత్కాలిక సమస్యలు ఎలాగూ ఉంటాయట. వీటితో పాటుగా డి విటమిన్‌ వల్ల శరీరంలో అధికంగా కాల్షియం పేరుకుపోవడంతో రక్తనాళాలు గడ్డకట్టడం దగ్గర్నుంచీ కిడ్నీలు దెబ్బతినడం వరకూ రకరకాల సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక గర్భవతులు, పాలిచ్చే తల్లులు అధికంగా డి విటమిన్‌ తీసుకోవడం వల్ల వారి శిశువుకి హానిజరిగే ప్రమాదం ఉందంటున్నారు. అందుకనే ఆటకాయితనంగా విటమిన్ డి జోలికి పోవద్దని సూచిస్తున్నారు. ముందుగా వైద్యుల సలహా సంప్రదింపుల మేరకే మనకు డి విటమిన్‌ అవసరం ఉందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ సూర్యకాంతిలో కాసేపు తిరగడం వల్ల అది అదుపులోకి వస్తుందేమో ప్రయత్నించాలి. ఆ తరువాతే సప్లిమెంట్ల జోలికి పోవాలి.   - నిర్జర.
  సంసారాన్ని విడిచిపెట్టేసి హిమాలయాల్లో గడపాలనుకోవడం వింతేమీ కాదు. అది ఏకాంతం! కానీ సమాజంలో ఉంటూ కూడా ఇతరుల తోడు లేకపోవడం బాధాకరం. అది ఒంటరితనం! మన ఆరోగ్యం మీద ఈ ఒంటరితనం ప్రభావం గురించి ఇంతకుముందు చాలా పరిశోధనలే జరిగాయి. ఒంటరితనంతో వేగిపోయేవారు రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతారనీ, త్వరగా గతించిపోతారనీ తేల్చారు.   ఒంటరితనంలో దీర్ఘకాలిక అనారోగ్యాల సంగతి అలా ఉంచితే చిన్నపాటి జలుబు ఎలా వేధిస్తుందో చూడాలని అనుకున్నారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ 159 మందిని అయిదు రోజుల పాటు గమనించారు. వీరంతా కూడా 18 నుంచి 55 ఏళ్ల వయసు లోపలివారే! పరిశోధన కోసం ఎన్నుకొన్నవారందరి దగ్గరా కొన్ని వివరాలను సేకరించారు. వారు తమ జీవితాలలో ఎంత తీవ్రంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు? ఇతరులతో వారి సంబంధబాంధవ్యాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలను గ్రహించారు. ఆ తరువాత వారందరికీ జలుబుని కలిగించే ఒక మందుని ఇచ్చారు. ఒంటరితనంతో వేగిపోయేవారిని జలుబు చాలా తీవ్రంగా వేధించిందట! జలుబు లక్షణాలు, వాటి వల్ల వారు బాధపడిన తీరు కూడా తీవ్రంగానే ఉన్నాయట.   అబ్బా...జలుబుతో బాధపడటం కూడా ఓ బాధేనా! ఇదీ ఓ పరిశోధననే అనుకోవడానికి వీల్లేదు. జలుబు వల్ల డబ్బుకి డబ్బు, సమయానికి సమయం వృధా అయిపోతుంటాయి. పైగా ఒంటరతనంలో ప్రతి చిన్న ఆరోగ్య, మానసిక సమస్యా అమితంగా వేధిస్తుందనడానికి ఇదో రుజువు. ఉదాహరణకు ఒంటరితనంతో బాధపడేవారిలో ఒత్తిడి కూడా మనసు మీద తీవ్రమైన ప్రభావం చూపవచ్చునట. ఆ ఒత్తిడే వారి శరీరాన్ని కూడా లోబరుచుకుని కేన్సర్ వంటి అనారోగ్యాలకి దారితీస్తుంది.   ఒంటరితనంటే ఎవరూ లేకపోవడమే కాదు.... తన చుట్టూ వందమంది ఉన్నా కూడా ఎవరితోనూ మనసుని పంచుకోలేకపోవడం. ఇది నిజంగా ఓ మానసిక సమస్యే! దానికి పరిష్కారం వెతుక్కోవాల్సిందే. వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగుల శారీరిక లక్షణాలకి మందులు ఇచ్చేసి ఊరుకోకుండా... వీలైతే వారి మానసిక పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వైద్యం ఓ వ్యాపారం అయిపోయిన ఈ రోజుల్లో అంత శ్రద్ధ ఎవరికన్నా ఉంటుందంటారా! - నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.