లోకం మెచ్చిన లోకేష్.. పెంపకం అంటే ఇదీ!

లోకేష్ ఎంత సంస్కార వంతుడో,  వ్యక్తిత్వ ఔన్నత్యం ఎంతటిదో ఇటీవలి కాలంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.  విద్యా మంత్రిగా నారా లోకేష్ ఆ శాఖను సుసంపన్నం చేస్తూ వినూత్న కార్యక్రమాలతో విద్యార్థులలో విద్య పట్ల ఆసక్తిని, అనుకర్తినీ పెంచుతూనే.. తల్లిదండ్రులు తనకు నేర్పిన   స‌భ్య‌త సంస్కారాల‌ు మరింత ఇనుమడింప చేసే లాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.  అపకారికి ఉపకారం అన్నట్లుగా.. లోకేష్ జ‌గ‌న్ వంటి ప్ర‌త్య‌ర్ధుల ప‌ట్ల కూడా స‌హృద‌య‌త చాటుకుంటుంటూ జనం మన్ననలు పొందుతున్నారు. దీంతో లోకేష్ ద లీడ‌ర్ ఆఫ్ మాసెస్ గా జనహృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటున్నారు. 

బేసిగ్గా లోకేష్   త‌ల్లిచాటు బిడ్డ‌గా  ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా  చాలా  చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు  భువ‌నేశ్వ‌రి  అని చెప్ప‌డానికి  ఎన్నో నిద‌ర్శ‌నాలు. ఆయ‌న ఇటీవ‌ల చేస్తున్న మంచి ప‌నులు  అంద‌రినీ విశేషంగా ఆక‌ర్షిస్తున్నాయ్. త‌న పెద్ద‌మ్మ పురంధేశ్వ‌రి  కాళ్ల‌కు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకున్న దృశ్యానికి తెలుగు త‌మ్ముళ్లు పులకించి పోయారు. అలాగే  ప్రవచన కారుడు చాగంటి కోటేశ్వ‌ర‌రావు కు ఇటీవల లోకేష్ పాదాభివంద‌నం చేయ‌డం కూడా ప్రజలను విశేషంగా ఆక‌ట్టుకుంది.

ఆపై పిల్ల‌ల్ని ఫ్లైట్ లో ఢిల్లీ వ‌ర‌కూ తీసుకెళ్లిన ఘ‌న‌త లోకేష్ దే. ఇటీవ‌ల రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భంగా  ఏపీలో విద్యార్ధుల‌తో జ‌రిగిన మాక్ అసెంబ్లీపై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఒక విద్యా మంత్రిగా  లోకేష్ ఈ ప్రతిపాదనను అసెంబ్లీలో నే చేసి అనుమతి పొందారు. ఇక విద్యార్థులతో అసెంబ్లీ ఆవరణలో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా  ఉన్న 45 వేల స్కూళ్ల  నుంచి మెరిక‌ల్లాంటి  విద్యార్ధుల‌ను ఎంపిక చేసి వారి ద్వారా జూనియ‌ర్స్ అసెంబ్లీని  అత్యద్భుతంగా నిర్వహించి భళా అనిపించింది.  ఈ విష‌యంలోనూ లోకేష్ కి మంచి మార్కులు ప‌డ్డాయి. సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

తాజాగా  తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టు ఒకరు   అత్యుత్సాహం కొద్దీ జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కోసం బాబు, లోకేష్‌, ప‌వ‌న్ కాళ్ల వేళ్లా  ప‌డి బ‌తిమిలాడుతున్నట్లుగా ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వెంటనే వైరల్ అయ్యింది.  అయితే ఆ వీడియోను వెంటనే తీసేయాలనీ,  జ‌గ‌న్ మ‌న‌కు ఎంత  ప్ర‌త్య‌ర్ధి అయినా స‌రే వ్య‌క్తిగ‌తంగా   కించ ప‌రచడం సరికాదనీ పార్టీ సోషల్ మీడియా వింగ్ కు హితవు చెప్పారు.  దీంతో  ఇంతటి సంస్కారం, ఔన్నత్యం, ఉదాత్త గుణాలను పెంపొందేలా లోకేష్ పేరెంట్స్ ఆయనను పెంచిన విధానం ఎంత గొప్పదో కదా అంటూ పలువురు చంద్రబాబు, భువనేశ్వరిలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.  గ‌తంలో బాబు కూడా.. జగన్ కు అర్హత లేకపోకయినా అసెంబ్లీలోకి నేరుగా కారులో రావడానికి అనుమతి ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  

వైసీపీకి చెందిన వంశీ, కొడాలి వంటి నేతలు అసెంబ్లీలో లోకేష్ త‌ల్లి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు జగన్ క‌నీసం ఖండించలేదు సరికదా..  మ‌రింత నవ్వుతూ , వారిని మరింత ప్రోత్సహించి, రెచ్చ‌గొట్టే ధోర‌ణితో వ్యవహరించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. లోకేష్ కీ జ‌గ‌న్ కీ  ఇంత తేడా ఉండటానికి వారి వారి పెంపకాలలో ఉన్న తేడాయే కారణమని పరిశీలకులు సోదాహ రణంగా విశ్లేషిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu