Home

»

Latest News

ప్రాబ్లమ్స్ క్లియర్.. క్లారిటీ వచ్చిన అఖండ 2 షోస్ డిటైల్స్ ఇవే

Dec 04, 2025

 

 


-నో ప్రాబ్లమ్స్
-రేపు జాతర స్టార్ట్ 
-నో డౌట్స్ 

 

 

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)..సుదీర్గ కాలం నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ పేరు వినపడితే చాలు, అప్పటి వరకు బాక్స్ ఆఫీస్ అమ్ముల పొదిలో ఉన్న రికార్డులు వాటంతట అవే పక్కకి జరిగి బాలయ్య పేరుని తమ అక్కున చేర్చుకుంటాయి. ఈ కోవలోనే అఖండ 2 తో మరోసారి రికార్డులని తమ ఒడిలో ఉంచుకోవడానికి సిద్ధమయ్యాయి.

 

 

కొన్ని కారణాల వల్ల ఈ రోజు నైట్ ప్రదరించాల్సిన ప్రీమియర్స్ ఆగిపోయాయి. దీంతో అభిమానుల్లో కొద్దిగా నిరుత్సాహం వచ్చింది. కొన్ని ఏరియాల్లో తమ నిరసన ని కూడా వ్యక్తం చేసారు. కానీ ఓవర్ సీస్ లో మాత్రం యధావిధిగా అనుకున్న టైంకే ప్రారంభం కానున్నాయి. ఇండియాలో మాత్రం రేపు ఉదయం నుంచి షోస్ స్టార్ట్  కాబోతున్నాయని నిర్మాతలు ప్రకటించారు. కానీ నిర్మాతలకి ఉన్న ఆర్ధిక ఇబ్బందుల వల్లే బెనిఫిట్ షో స్ ప్రదర్శించలేకపోయారనే వార్తలు వైరల్ గా నిలవడంతో  అభిమానులు మరో అధికార అప్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

 

 

also read:   బాలయ్య అభిమానుల ఆందోళన.. రిలీజ్ పై నిర్మాతలు చెప్పింది ఇదే

 

ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలు మీడియా ఛానల్స్ అఖండ 2 రిలీజ్ కి సంబంధించిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఫైనాన్షియల్ మాటర్ మొత్తం క్లియర్ అయింది. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇండియాలో షోస్ ప్రారంభం కానున్నాయని తెలిపింది.  దీంతో  అభిమానుల్లో తిరిగి జోష్ వచ్చినట్లయ్యింది. సో రేపు ఉదయం నుంచి థియేటర్స్ దగ్గర బాలయ్య శివ తాండవం ప్రారంభం కానుంది. సినిమా రిజల్ట్ విషయంలో అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే వస్తుంది. 

 

 


 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com