LATEST NEWS
 అస్సాంలో  యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది.  ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు.  దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో  యువత బరిలోకి దిగింది.   అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి  30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే  క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.  భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న  యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను  బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే  అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది.  తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై  అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి.  ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.  
తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలిలో   విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేయకపోతే.. ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా అని  ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై  శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం   పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.  ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు.. ఆ కుటుంబాలకు నెలకు పాతిక వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలన్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమకారులపై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలనీ,  ప్రభుత్వ గుర్తింపు కార్డు  ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ  ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు.   అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు.  ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.  ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.   ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.  కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు.  అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే  నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.  
ALSO ON TELUGUONE N E W S
'దేవర 2' లేటెస్ట్ అప్‌డేట్ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో అనిరుధ్ బిజీ డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్ షూటింగ్ ఎప్పుడంటే..? 'దేవర 2' ఉంటుందా లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నలా మారింది. ఒకసారి ఉంటుందని, మరోసారి ఉండదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి 'దేవర 2' తెరపైకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఈ సినిమాకి డేట్స్ కేటాయించాడని, షూటింగ్ డేట్ కూడా లాక్ అయిందని న్యూస్ వినిపిస్తోంది. (Devara Part 2) 'దేవర: పార్ట్ 1' కమర్షియల్ సక్సెస్ సాధించినప్పటికీ, కంటెంట్ పరంగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. అందుకే 'దేవర 2' ఉండకపోవచ్చనే అనుమానాల వ్యక్తమయ్యాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా 'దేవర 2' ఉంటుందని చెబుతూ వచ్చాడు. అందుకు తగ్గట్టే తాజాగా డేట్స్ కూడా ఇచ్చినట్లు వినికిడి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'దేవర 2' షూటింగ్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. తారక్ ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కేటాయించాడని, అక్టోబర్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారు. రెండో భాగంలో యాక్షన్ సీక్వెన్స్‌లు అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతున్నాయని, అందుకే ఈసారి ప్లానింగ్ చాలా పకడ్బందీగా చేస్తున్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయట. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇప్పటికే కొన్ని అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేశాడని, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని వినికిడి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' (Dragon) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ 40 శాతానికి పైగా అయిందని టాక్. అక్టోబర్ నాటికి ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందేమో చూడాలి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఆ రోజు 'డ్రాగన్'తో పాటు 'దేవర 2' అప్డేట్ వచ్చే అవకాశముంది. 'దేవర' మొదటి భాగం సముద్ర నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటన, అనిరుధ్ సంగీతం సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. రెండో భాగంలో 'దేవర' మరియు 'వర' పాత్రల మధ్య ఘర్షణ మరింత తీవ్రంగా ఉంటుందని, ఫస్ట్ పార్ట్‌లో మిగిలిపోయిన చిక్కుముడులన్నీ ఈ సీక్వెల్‌లో వీడతాయని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.  
  -పహిల్వాన్ లుక్ తో ఆల్ రికార్డ్స్ బద్దలు  -అసలు పెద్దికి బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ ఎలా వచ్చింది! -చేసిన వ్యాయామాలు ఏంటి! -తీసుకున్న ఫుడ్  -మరి పెద్ది రహ్యసం ఏంటో చూద్దాం స్టిల్ మెగాఫ్యాన్స్ తో పాటు, పాన్ ఇండియా ప్రేక్షకుల మస్తిష్కాలు రోజువారి దినచర్యలో బిజీగా ఉన్నాయి. అదే టైంలో వాళ్ల మస్తిష్కాల్లో పెద్ది(Peddi)బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ కూడా కదలాడుతూనే ఉంది. అదేనండి.. కండలు తిరిగిన దేహంతో ఇటీవల రిలీజైన పెద్ది పహిల్వాన్ లుక్. పెద్దిని ఒక రేంజ్ లో ఎలివేషన్ చేసిన సదరు లుక్ ఇప్పుడు సోషల్ మీడియాని ప్రశాంతంగా ఉండనివ్వని పరిస్థితి. చరణ్ కి బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ ఎలా సాధ్యమైంది! ఎలాంటి ఆహరం తీసుకున్నాడు! ఎలాంటి నియమాలు, వ్యాయామాలు చేసాడు! అని గూగుల్ తల్లితో పాటు తమకి తెలిసిన వాళ్ళందరిని కనుక్కోవడం స్టార్ట్ చేసారు. మరి ఈ విషయంలో మీరు కష్టపడకుండానే మాకు అందిన సమాచారం ప్రకారం  పహిల్వాన్ గురించి కొన్ని విశేషాలు తెలియచేస్తున్నాం. సాధారణంగా కండలు పెంచాలంటే మాంసాహారం తప్పనిసరి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. మోస్ట్ లీ ఆ విధంగా చేసే వాళ్ళే ఉంటారు. కానీ చరణ్ ఈ విధమైన నాన్ వెజ్ ఐటం జోలికి వెళ్ళలేదు. కనీసం ఎగ్ ని కూడా ముట్టుకోలేదు. కేవలం కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటి ప్రకృతి సిద్ధమైన ఫుడ్ తోనే  బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ ని సొంతం చేసుకున్నాడు. అదే విధంగా గత ఎనిమిది నెలలుగా ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే కఠినమైన వ్యాయామాలతో పాటు వ్యక్తిగతట్రైనర్ పర్యవేక్షణలో మరిన్ని వ్యాయామాలు చేసాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి కూడా ఆధ్యాత్మిక నియమాలని పాటిస్తూనే వ్యాయామాలు చేసాడు. వాటిల్లో 'ముగ్ధార్' అనే సాంప్రదాయ వ్యాయామ పరికరాన్ని  ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. బరువైన చెక్కతో తయారైన ముగ్ధార్' ని పాతకాలంలో యోధులు, పహిల్వాన్లు, మల్లయోధులు తమ శారీరక దారుఢ్యం, బలం, కండరాల పుష్టి కోసం చేతితో తిప్పుతూ వ్యాయామం చేసేవారు. గద  ఆకారాన్ని పోలి ఉంటుంది. టీజర్‌లో చరణ్ గదను తిప్పుతూ పోరాట సన్నివేశాల్లో కనిపించడం ఈ శిక్షణకి నిదర్శనమని కూడా చెప్పవచ్చు. Also read: UStaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ పై అలీ కీలక వ్యాఖ్యలు  చరణ్ ఇటీవల పెద్ది షూట్ లో గాయాలపాలవ్వడంతో పెద్ది వాయిదా అనే న్యూస్ నెటిజన్స్ అత్యధిక ఓట్లతో వాయిదా అనేది నమ్మశక్యంగానే ఉంది.  కానీ మూవీ లవర్స్, ఫ్యాన్స్ మాత్రం ఏప్రిల్ 30 న పెద్ది ఆగమనం ఫిక్స్ అంటున్నారు. మరి వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదనే కోరుకుందాం.         
పెద్ది రిలీజ్ డేట్‌పై గందరగోళం ఏప్రిల్ 30నే వస్తుందా లేదా జూన్‌లో వస్తుందా?  క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన ఎస్‌కేఎన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. నిజానికి మార్చి 27న విడుదల కావాల్సిన పెద్ది, ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా కష్టమే అంటున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి పోస్ట్ పోన్ న్యూస్ ఊపందుకున్నాయి. పెద్ది కొత్త విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ రకంగా ఈ చర్చకు కారణమైన నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) తాజాగా ఈ విషయంలో స్పందిస్తూ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక ఈవెంట్ లో ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా జూన్ 26న విడుదలవుతుందని అందుకే తమ సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకుంటున్నామని ప్రకటించారు.  మెగా కాంపౌండ్ కి దగ్గరగా ఉండే నిర్మాత నోటి నుంచి ఈ మాట రావడంతో, 'పెద్ది' విడుదల ఏప్రిల్ 30 నుండి జూన్‌కు వాయిదా పడిందని అందరూ ఫిక్స్ అయిపోయారు.ఈ న్యూస్ వైరల్ కావడంతో మెగా అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్‌కేఎన్ ఒక వీడియోను విడుదల చేస్తూ అసలు విషయం వివరించారు.  ఈవెంట్‌లో ఎస్‌కేఎన్ తో సాయి రాజేష్ మాట్లాడుతూ.. 'పెద్ది' జూన్ 26న రానుందని సోషల్ మీడియాలో ట్వీట్లు కనిపిస్తున్నాయని, ఆ టీం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు మన సినిమా డేట్ అనౌన్స్ చేయొద్దు అని చెప్పారట. అయితే ఆ సమయంలో అక్కడ సౌండ్ డిస్టబెన్స్ వల్ల వల్ల సాయి రాజేష్ మాటలను ఎస్‌కేఎన్ తప్పుగా అర్థం చేసుకున్నారట. 'పెద్ది' మేకర్స్ అప్పటికే డేట్‌ను అధికారికంగా ప్రకటించేశారని పొరబడిన ఎస్‌కేఎన్, స్టేజి మీద ఆ విషయాన్ని చెప్పేశారు. తన వల్ల జరిగిన ఈ చిన్న మిస్ కమ్యూనికేషన్‌కు ఆయన చింతిస్తూ, "పెద్ది లాంటి పెద్ద సినిమా అప్‌డేట్స్ ఆ ప్రొడక్షన్ హౌస్ నుండే రావాలి. నేను పొరపాటున ఆ డేట్ చెప్పినందుకు క్షమించండి" అన్నారు. దీంతో పెద్ది వాయిదాపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రారా' సాంగ్స్ చార్ట్‌బస్టర్స్ గా నిలిచాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ ఉంది. ఏప్రిల్ 30నే వస్తుందా లేదా ఎస్‌కేఎన్ చెప్పినట్లు జూన్‌లో వస్తుందా అన్నది 'పెద్ది'ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Also Read: మెగా సర్‌ప్రైజ్.. మాఫియా డాన్‌గా చిరంజీవి! https://x.com/SKNonline/status/2038650185690341758
  -ఉస్తాద్ ఈ నెల 19 న రిలీజైన విషయం తెలిసిందే  -పవన్ రేంజ్ కి తగ్గ కలెక్షన్స్ లేవు  -మరి ఈ టైంలో అలీ చెప్పిన విషయమేంటి  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)వన్ మాన్ షో 'ఉస్తాద్ భగత్ సింగ్'(ustaad Bhagat Singh)టాక్ అభిమానులు, మూవీ లవర్స్ నుంచి పర్లేదనే వచ్చినా కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. దీంతో పవన్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మేకర్స్ మాత్రం ఉస్తాద్ విజయం సాధించిందని చెప్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో రీసెంట్ గా ఉస్తాద్ పై ప్రముఖ నటుడు అలీ(Ali)చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆ వ్యాఖ్యలు ఏంటో చూద్దాం.  అలీకి ఇటీవలఒక ఇంటర్వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దాంతో అలీ మాట్లాడుతు హరీష్, పవన్ కాంబోలో రెండవ సినిమా. తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో, ఉస్తాద్ కూడా ఆ రేంజ్ హిట్ కావాలని  కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ఉస్తాద్ రిలీజ్ కి కొన్ని రోజుల ముందు ఈ ఇంటర్వ్యూ జరిగినా కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదన్నాయ్, బులెట్ దిగిందా లేదా అనే రీతిలో ఎక్సక్లూజివ్ గా సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. దీంతో నెటిజన్స్ స్పందిస్తు అలీ సాబ్ గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ ని ఉస్తాద్ అందుకోవాలని మీరు కోరుకున్నారు. కాకపోతే ఆ రేంజ్ హిట్ కాలేదనే కామెంట్స్ చేస్తున్నారు. also read: Dhurandhar 2: ధురంధర్ 2 పై వెట్రిమారన్ కామెంట్స్!..ప్రాణాలు కోల్పోయిన వారిని చూసారా! పవన్ ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి నుంచి వకీల్ సాబ్ వరకు దాదాపుగా అన్ని చిత్రాల్లో అలీ కనిపించాడు. హరీష్, పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ లోని క్యారక్టర్ అలీకి మంచి పేరు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  
చిరంజీవి-బాబీ మూవీ క్రేజీ అప్‌డేట్ సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ వేరే లెవెల్ మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన 'మన శంకరవరప్రసాద్‌ గారు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తన సత్తా చాటారు. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ విజయోత్సాహంతో ఉన్న మెగాస్టార్, ఏమాత్రం విరామం తీసుకోకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. (Mega 158) మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానుంది.  ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవిని మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత శక్తివంతమైన మాస్ అవతార్‌లో చూపించబోతున్నారట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.  ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి ఒక 'మాఫియా డాన్' పాత్రలో కనిపిస్తారని, ఆ సమయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది. బాబీ ఇప్పటికే స్క్రిప్ట్‌ను పక్కాగా సిద్ధం చేసి, ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేశారు. గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాలో చిరు మాస్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ అభిమానులను విపరీతంగా అలరించాయి. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  చిరంజీవి కెరీర్ లో 158గా సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ని కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. టాలీవుడ్‌లో ఈ బ్యానర్‌కు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. యశ్ తో 'టాక్సిక్', విజయ్ తో 'జన నాయగన్' వంటి భారీ సినిమాలను నిర్మిస్తున్న ఈ బ్యానర్, చిరు సినిమాను కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ సినిమాలో ఇతర నటీనటుల విషయానికి వస్తే, సీనియర్ నటి ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కూడా మరో ముఖ్యమైన పాత్రలో మెరవనుంది.  అంతేకాకుండా, తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, చిరంజీవి తన కూతురిని కాపాడుకునే తండ్రిగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. మాస్ యాక్షన్‌తో పాటు ఎమోషన్స్‌ను కూడా సమపాళ్ళలో జోడించి బాబీ ఈ సినిమాని మలుస్తున్నారట.  'వాల్తేరు వీరయ్య' మ్యాజిక్‌ను బాబీ మళ్ళీ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.  ప్రస్తుతం చిరంజీవి తన మరో భారీ ప్రాజెక్ట్ 'విశ్వంభర' పనుల్లో కూడా బిజీగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న 'విశ్వంభర'.. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: అవకాశాల్లేక ఈగలు తోలుకుంటున్నా.. కంటతడి పెట్టిస్తున్న మణిశర్మ కామెంట్స్!   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా కూడా సాగుతాయి.  చాలామంది భార్యాభర్తలు గొడవలు జరిగిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి గొడవలే కాదు.. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని అలవాట్లు భార్యాభర్తల మధ్య బంధాన్ని విచ్చిన్నం చేస్తాయని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  బంధాన్ని నాశనం చేసే అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. తప్పులు వెతకడం.. భార్యాభర్తల బందం ముడిపడింది అనగానే పూర్తీగా ఒకరి చేతిలో బంధం కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు కొందరు. మరీ ముఖ్యంగా భర్తలు ఇలా ఎక్కువ చేస్తారు. వారు నిలబడే తీరు, ధరించే దుస్తులు, చేసే పనులు ఇలా.. ప్రతి విషయంలో తప్పులు వెతకడం చేస్తుంటారు. అలా తప్పులు చూపించడం తమ గొప్ప అని వారు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల లైఫ్ పార్ట్నర్ చాలా ఇబ్బంది పడతారు. ఇదే విధంగా ఎక్కువ కాలం సాగితే.. మా ఇద్దరికి సెట్ కావడం లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కాస్తా బంధం పెళుసుబారడానికి దారితీస్తుంది. మౌనం.. భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరైనా సరే.. ఏదైనా తమకు నచ్చని పని జరిగినప్పుడు లేదా తమకు ఏ విషయంలో అయినా అసంతృప్తి ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడటం కంటే.. మౌనంగా ఉండి భాగస్వామిని సాధిస్తూ ఉంటారు. ఈ పద్ధతి చాలా హానికరమైనది.  భాగస్వామిని పట్టించుకోకుండా  మానసిక హింసకు గురి చేయడం లాంటిది ఇది. ఆరోగ్యకరమైన సంబంధానికి,  మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడటం చాలా అవసరం. మౌనంగా ఉండటం వల్ల  భాగస్వామి అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఎక్కువ, అంతేకాదు.. ఇలాంటి ప్రవర్తన వల్ల బంధంలో దూరం పెరుగుతుంది. పాత  విషయాలు.. గొడవల సమయంలో బార్యాభర్తలలో చాలామంది పాత విషయాలను బయటకు లాగి వాటిని తమకు అనుగుణంగా ఉండేలా చేసుకుంటారు. భాగస్వామి చేసిన తప్పును ఒకసారి క్షమించేశాక.. తరువాత వాదన జరిగిన ప్రతిసారీ ఆ విషయాన్ని తిరిగి ప్రస్తావించకూడదు. ఇలా చేయడం వల్ల  భాగస్వామి నమ్మకం దెబ్బతింటుంది,   ఇంకా పాత విషయాలను మనసులో పెట్టుకున్నారని, బంధంలో అర్థం చేసుకునే తత్వం లేదని అనుకుంటారు. ఆధిపత్యం.. ప్రేమ అంటే  భాగస్వామి ఫోన్‌ను నిరంతరం రహస్యంగా చూడటం, వారు స్నేహితులతో ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు గమనించడం, గూఢచర్యం చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ కాదు.. చాలామంది ఇవన్నీ చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ దాన్ని ప్రేమ అని అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే అది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టే.. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి బంధంలో నమ్మకం పోతుంది. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను ఇతరులతో పోల్చడం మంచిది కాదు.  భాగస్వామిని స్నేహితులు, వారి భాగస్వాములు,  అక్క చెళ్లేళ్లు,  అన్నదమ్ములు ఇలా అందరితో  పోల్చడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి బలాలు, బలహీనతలు ఉంటాయి. పోలికల వల్ల  భాగస్వామి బాధపడవచ్చు.  బంధంలో ఎప్పటికీ వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి.అప్పుడే బంధం బాగుంటుంది. లేదంటే బంధం విచ్చిన్నమవుతుంది.                                            *రూపశ్రీ  
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం. మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద పనిగా మారుతుంది.  మండే ఎండల్లో బయటకు వెళ్లిరావడం అంటే పెద్ద యుద్దం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతాయి.   ఇంత కఠినమైన వేసవి ఎండలో బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు తమకు తాము రక్షణ కల్పించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.  లేకపోతే  అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వేసవి ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లే అవసరం వస్తే.. మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లాలని, అది వారికి ఎంతో సహాయపడతాయని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఇంతకూ వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసిరిగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో.. వారి ఉపయోగం ఎంటో తెలుసుకుంటే.. వాటర్ బాటిల్.. మండుటెండలో  ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు  బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్  ఉంచుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే డీహైడ్రేషన్ తీవ్రమై  అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ. సన్ గ్లాసెస్.. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు  బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎండ నుండి  కళ్ళను కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి. సన్‌స్క్రీన్ క్రీమ్.. వేసవి ఎండలకు సన్‌స్క్రీన్ క్రీమ్ చాలా ముఖ్యం. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ  చర్మం పొడిబారడం లేదా గరుకుగా మారడం మొదలైతే వెంటనే సన్ స్క్రీన్  రాసుకోవచ్చు. గొడుగు.. వానలో తప్ప ఎండలో గొడుగు వాడటం తెలియని వారు ఉన్నారు. ఈ మండుటెండలో బ్యాగ్‌లో తప్పకుండా ఒక గొడుగు ఉంచుకోవాలి. ఇది  ఎండ నుండి కాపాడటానికి సహాయపడుతుంది. స్కార్ఫ్ లు.. అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తమ బ్యాగ్‌లో తప్పకుండా స్కార్ఫ్ ఉంచుకోవాలి. ఇది  తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది, అలాగే ఎండదెబ్బ,  చర్మం నల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.                                     *రూపశ్రీ.
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు.  చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు.  అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి? 1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి  తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది.  ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్  పనితీరును అందిస్తుంది. నైట్ బ్యాకప్ సెలక్షన్.. సోలార్ ఏసీ  అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట  బ్యాటరీ బ్యాకప్ అయిపోతే,  దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా  ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది.  సులభంగా చెప్పాలంటే,  సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు. పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.                                         *రూపశ్రీ.
 అస్సాంలో  యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది.  ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు.  దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో  యువత బరిలోకి దిగింది.   అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి  30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే  క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.  భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న  యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను  బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే  అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది.  తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై  అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి.  ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.  
తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలిలో   విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేయకపోతే.. ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా అని  ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై  శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం   పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.  ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు.. ఆ కుటుంబాలకు నెలకు పాతిక వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలన్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమకారులపై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలనీ,  ప్రభుత్వ గుర్తింపు కార్డు  ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ  ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు.   అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు.  ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.  ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.   ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.  కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు.  అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే  నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.  
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం.  చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు.  అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి,  వాపును తగ్గిస్తాయి,  నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం  అందరికీ సురక్షితం కాదని అంటున్నారు.  కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి.  ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి?  పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే.. పసుపు పాలు ప్రయోజనాలు.. రోగనిరోధకశక్తి.. పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,  యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.   వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా  ఉంటుంది. జలుబు, దగ్గు.. పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు,  జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి.  దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. వాపులు.. పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు,  కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు. పసుపు పాలు ఎవరు తాగకూడదు? జీర్ణసమస్యలు ఉన్నవారు.. తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు  సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం,  పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. రక్త సంబంధ వ్యాధుల మందులు.. పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది.  ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు. మధుమేహ రోగులు.. పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు.  మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు.  దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు.                              *రూపశ్రీ.
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. రాత్రి భోజనం.. రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది.  చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు.  కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం  అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే  జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ,  గుండె పనితీరు ప్రభావితం కావచ్చు. కాఫీ.. కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది  నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్.. రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు.  అయితే రాత్రి పడుకునే ముందు  ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు.  పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి.  గుండె ఆరోగ్యాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది. చిరుతిళ్లు.. కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల  ఆకలి తగ్గడమే కాకుండా,  నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం  గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి.. నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి.  అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు,  గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు. మద్యం.. రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు.  ఈ అలవాటు వల్ల  రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.                                  *రూపశ్రీ.
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.  వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది.  అయితే  వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.  ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి  చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్,  మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది. బరువు.. వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా   పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్. వ్యాధులు.. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,   చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.                                      *రూపశ్రీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.