తేల్చిచెప్పేశారు.. ఏపీకి ఇచ్చేది ఏం లేదు...!

 

ఎట్టకేలకు బీజేపీ పెద్దలు ఏపీకి విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇన్ని రోజులు ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు... ఏపీకి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది.. కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా బీజేపీ ఏపీకి మొండిచేయి చూపించింది అని ఇప్పటికే ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళలు చేస్తున్నారు. ఈ కారణంగానే టీడీపీ-బీజేపీ పొత్తుకు కూడా బీటలు వారాయి. ఇక రేపో మాపో రెండు పార్టీలు విడిపోవడమే తరువాయి. అయితే ఆ టైం ఇప్పుడు దగ్గర పడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నిరోజులు ఏపీ విభజన హామీల గురించి, నిధుల కేటాయింపు గురించి మరోసారి ఆలోచిస్తామని చెప్పుకొచ్చిన బీజేపీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఏపీకి ఇక ఇచ్చేది ఏం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా'తో నిర్వహించిన సమావేశంలో ఆయన ఇదే విషయాన్ని తేల్చి చెప్పారట. ఏపీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతీసుకుని అమిత్‌షాతోనూ..టిడిపి ఎంపిలతోనూ సమావేశం నిర్వహించారట. ఇక ఈ సమావేశంలో.. .ఇక తాము ఆంధ్రాకు ఇచ్చిన హామీలపై చర్చించే దేమీ లేదని.....దీనిని ఇంతటితో వదిలేయాలని 'అమిత్‌షా' 'వెంకయ్య'ను కోరినట్లు సమాచారం. దీంతో..ఇక టిడిపి,బిజెపిలు అటో...ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

 

మరి ఈ నెల 5 వతేదీని పార్లమెంట్ సమావేశాలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ చివరి ప్రయత్నం చేసింది. కానీ బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితిలో తగ్గేలా కనిపించడంలేదు. దీంతో మళ్లీ పార్లమెంట్లోనే ఈ విషయం తేల్చుకోవాలని  నిర్ణయం తీసుకున్నారట. మొత్తం మీద ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. బీజేపీ ఏపీకి చేసిన అన్యాయాన్ని ఇప్పటికే జనాలు అర్ధంచేసుకున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో దీనికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారు.