పార్టీ నేతలను భయపెడుతున్న జగన్ మెసేజ్..
posted on Mar 2, 2018 11:00AM
.jpg)
జగన్ పంపిన ఎస్ఎంఎస్ లు చూసి ఇప్పుడు ఆపార్టీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ పార్టీ నేతలనే వణికించే ఎస్ఎంఎస్ లు జగన్ ఏం చేసుంటాడబ్బా.. అంతలా పార్టీ నేతలను భయపట్టే మెసేజ్ ఏమై ఉంటుందనేకదా డౌట్. కొంత మంది తెలియక తప్పుచేస్తారు.. మరికొంత మంది...తెలిసి తెలిసి తప్పు చేస్తారు... ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే జగన్. తప్పులు చేయడం..వాటిని సమర్థించుకోవడం ఆయనకే చెల్లుతుంది. ఇప్పుడు తాజాగా చేసిన తప్పునే మరోసారి చేయడానికి సిద్దమయ్యారు. ఇంతకీ అదేంటంటారా..?
గతంలో పాదయాత్ర వంకతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. తానే కాదు... తనతో పాటు తన పార్టీ నేతలకు కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశాడు. మరి జగన్ ఆదేశించిన తరువాత నేతలు దాన్ని పాటించకుండా ఉంటారా..? సమావేశాలు జరిగినన్నీ రోజులు పార్టీ నేతలు అసెంబ్లీ దరిదాపులకు కూడా రాలేదు. దీనివల్ల జగన్ కు ఏదైనా మంచిపేరు వచ్చిందా అంటే అదీ లేదు...పాదయాత్ర చేసుకోవడానికి ఇదో వంక పెట్టుకున్నారని కొంతమంది అంటే.. ప్రతిపక్షమై ఉండి అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడకుండా... ఇలా సమావేశాలకు డుమ్మా కొట్టడం ఏంటని మరికొంత మంది విమర్శలు గుప్పించారు. అలాంటిది తన తప్పును సరిచేసుకొని త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సింది పోయి.. మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లొద్దని అన్నారట. దీంతో జగన్ మళ్ళీ అదే పాట పాడటంతో, ఎమ్మల్యేలు అవాక్కయ్యారట. అంతేకాదు జగన్ తీసుకున్న నిర్ణయంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారట. కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో సర్కారు నిర్ణయాలు, వివిధ శాఖలకు కేటాయింపులపై నిలదీసే అవకాశాన్ని చేతులారా దూరం చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదమేనన్న అభిప్రాయపడుతున్నారట. మరికొంతమంది.. జగన్ పాదయాత్రలో ఉన్నాడు కాబట్టి... ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని మినహాయించి, మిగిలిన ఎమ్మెల్యేలు హాజరయితే బాగుంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారట. అయితే ఇవన్నీ పార్టీ నేతలు తమలో తాము చర్చించుకునే మాటలు మాత్రమే. తమ అభిప్రాయాలు జగన్ దగ్గర పస్తావించే ధైర్యం మాత్రం లేదు. ఇక జగన్ తన మోనార్క్ తెలివితేటలు మొత్తం ఉపయోగించి.. ఏదో చేద్దామని అనుకుంటాడు.. ఆఖరికి అది రివర్స్ అయిన తరువాత కానీ తెలియదు.. తాను తప్పుచేశానని.. మరి చుద్దాం... ఏం జరుగుతుందో..