Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రెండింగ్ లో..గొడ్డలి పార్టీ, కాక్రోచ్ పార్టీ!
posted on: May 23, 2026 5:03PM

గొడ్డలి పార్టీ. ఈ పదం ప్రధానంగా వైసీపీని విమర్శించడానికి కూటమి నేతలు తరచూ వాడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే.. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అని మరో మారు కామెంట్ చేశారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. రప్పారప్పా రంకెలు.. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా? సీబీఎన్ దగ్గర తోక జాడిస్తే.. ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటులేదని కూడా అన్నారు.
అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకొక నాటకమాడుతున్నారు. అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా? దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వారికి సన్మానాలా? కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు.. తల్లి, చెల్లికి ఆస్తులివ్వకుండా వేధించారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలను ఏం చూస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. నేను ప్రజల సేవకుణ్ణి.. పెత్తందారు కాదు. నిరంతరం పనిచేసి పేదల రుణం తీర్చుకుంటా. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించింది- ఎన్డీయే కూటమి అంటూ కామెంట్ చేశారు ఏపీ సీఎం. దీనంతటికీ కారణం.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలి వాడకం తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటినుంచి ప్రత్యర్థి పార్టీలు వైసిపిని టార్గెట్ చేస్తూ గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ సంస్కృతిని గొడ్డలి సంస్కృతి అని పిలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రాబు తదితర కూటమి పార్టీల నేతలు..
ఇక పోతే కాక్రోచ్ ఆర్ బొద్దింక. ఇటీవల దేశ రాజకీయాల్లో బాగా వైరల్ అయిందీ పదం. ఎలా పుట్టింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ? అని చూస్తే.. సుప్రీం కోర్ట్ కోర్టు విచారణల సందర్భంలో దేశంలోని నిరుద్యోగ యువతను, కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్న జీవులు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నా.. అది కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కొత్త రూపు తీసుకుని ఫాలోయర్స్ సంఖ్య అమాంతం పెంచుకుని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులపై ఒక వ్యంగ్యాస్త్రంగానూ నిలుస్తోంది.
ఇలాంటివే మరికొన్ని పదాలను చూస్తే.. పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
ఇక పోతే ఇటీవలి కాలంలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఇంకో పదం.. మెలోడీ- ఇది మరీ ఇంటర్నేషనల్ క్రేజ్. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమైన పదం కాదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన నేమ్ మెలోడీ. అంతర్జాతీయ సదస్సుల్లో వీరిద్దరూ కలిసినప్పుడు దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక సంభాషణలు, నవ్వులను చూసి నెటిజన్లు మెలోడీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వేల సంఖ్యలో రీల్స్, మీమ్స్ సృష్టించారు. స్వయంగా ఇటలీ ప్రధాని మెలోని కూడా ఒక సెల్ఫీ వీడియో పెడుతూ " హలో ఫ్రం మెలోడీ టీమ్’ అనడంతో ఈ పదం గ్లోబల్ ట్రెండ్ అయిపోయింది. టాఫీ డిప్లమసీ లేదా చాక్లెట్ రాజకీయం కూడా ఇదే కోవలోకి వచ్చే పదమే.
ఇక రీల్స్ మంత్రి, బిర్యానీ పాలిటిక్స్ అంటూ రకరకాల మీమ్స్ కమ్ వర్డ్స్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఒకప్పుడు రాజకీయం అంటే కేవలం సీరియస్ ఉపన్యాసాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు.. గొడ్డలి పార్టీ, కాక్రోచ్ పార్టీ అంటూ సెటైరికల్ కామెంట్లతో పాటు మెలోడీ, టాఫీలాంటి సిల్లీ పదాల వల్ల పాలిటిక్స్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌గా, మీమ్స్ మెటీరియల్‌గా మారిపోయాయి.





