నరకం చూపించే పంటి నొప్పికి... జామ ఆకులతో శాశ్వత పరిష్కారం!

posted on: May 25, 2026 12:37PM

దంతాల నొప్పి (Toothache) అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. పంటి నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కోసారి రాత్రి వేళల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తే ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే జామ ఆకులు (Guava Leaves) అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని ప్రముఖ హెర్బలిస్ట్ చెబుతున్నారు. 

తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ & మెడిసిన్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు, Ph.D (Australia) గారు జామ ఆకుల విశిష్టతను, వాటితో దంతాల నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో క్లియర్ గా ఈ వీడియోలో వివరించారు. 

జామ ఆకుల్లోని ఔషధ గుణాలు:

జామ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory), యాంటీ మైక్రోబియాల్ (Anti-microbial) మరియు అనల్జెసిక్ (నోప్పి నివారణ) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లోని బ్యాక్టీరియాను నశింపజేసి, చిగుళ్ల వాపులను మరియు పంటి నొప్పిని తక్షణమే తగ్గించడంలో సహాయపడతాయి.

డాక్టర్ లక్ష్మణరావు గారు సూచించిన సులువైన ఇంటి చిట్కాలు:

జామ ఆకులను నమలడం: లేత జామ ఆకులను శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకుని బాగా నమలాలి. ఆ రసం పంటి నొప్పి ఉన్న భాగంలోకి చేరడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. 

జామ ఆకుల కషాయం (మౌత్ వాష్): కొన్ని జామ ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కలిపి, నోట్లో పోసుకుని పుక్కిలించాలి (Gargling). ఇది సహజసిద్ధమైన మౌత్ వాష్‌లా పనిచేసి చిగుళ్ల వాపులను, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.

మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!

google-ad-img
    Related Sigment News
    • Loading...