మోడీ హవా తగ్గిందటానికి ఇవే నిదర్శనాలు...


నాలుగేళ్ల క్రితం.. కేంద్రంలో బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో... ఆ తరువాత ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా దాదాపు ఆ పార్టీనే గెలుపు సొంత చేసుకుంది. అయితే ఇది అప్పటిమాట. మోడీ నాలుగేళ్ల పాలనలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ ఏ ఉపఎన్నికలు జరిగినా పరాజయాన్ని మూటగట్టుకుంటున్నారు. గుజరాత్ ఎన్నిక్లలో ఏదో చచ్చీ చెడీ గెలిచిన బీజేపీ పరిస్థితి ఏంటో అప్పుడే అందరికీ అర్ధమైపోయింది. ఆతరువాత రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. ఇప్పుడు ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన మూడు స్థానాల్లోనూ బిజెపి పరాజయం పాలైంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుబుల్‌ సాహు మరణించడంతో ఒడిశా రాష్ట్రంలోని బీజ్‌పూర్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ఆయన భార్య బిజెడి అభ్యర్థిగా రంగంలోకి దిగి..ఘనవిజయం సాధించారు. ఇక  మధ్యప్రదేశ్‌లో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార బిజెపి పరాజయం పాలయింది. దీంతో ఇప్పటికే బీజేపీ పార్టీ  పరిస్థితి గురించి ఆందోళన పడుతుంటే...ఈ ఉపఎన్నికల్లో ఓడిపోవడం చూసి కలవరపడుతున్నారట. అంతేకాదు.. నవంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరాజయం పాలవడంపై నేతలు టెన్షన్ పడుతున్నారట. ఏది ఏమైనా ఉత్తరాదిన అన్ని ఎన్నికల్లో దాదాపు విజయం సాధించిన మోడీ...దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉపఎన్నికల్లో మాత్రం పరాజయమే మూటగట్టుకుంటున్నారు. ఈ ఉపఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఈ నాలుగేళ్ల పాలనలో మోడీపై ప్రజలకు ఉన్న నమ్మకం.. ప్రజల్లో మోడీ ప్రభ తగ్గుతుందని పూర్తిగా అర్ధమైపోతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu