శ్రీదేవికి లెటర్ రాసిన కూతురు జాహ్నవి..

 

అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త విన్న దేశం మొత్తం ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. అసలు శ్రీదేవి చనిపోయిందంటే..ఇప్పటికీ నమ్మలేని వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. మరి మనకే అలా ఉంటే... శ్రీదేవి కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో  చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తన ఇద్దరు కూతుళ్లు..వాళ్ళిద్దర్నీ ఓదార్చడం ఎవ్వరి వలన కావడం లేదు. తన పిల్లల కోసం దాదాపు 15 ఏళ్లు సిని పరిశ్రమకు సైతం దూరమైందంటే..పిల్లలను శ్రీదేవి ఎలా కంటికి రెప్పలా పెంచుకున్నారో అర్గం చేసుకోవచ్చు. తన కూతుళ్ల భవిష్యత్తు కోసం... తన ఇద్దరు కూతుర్లను సెటిల్ చేయడానికి ఆమె చాలా కష్టపడుతోంది. ఇక శ్రీదేవి కూతుళ్లు కూడా.. జాహ్నవి, ఖుషిలు కూడా తన తల్లి శ్రీదేవిని విడిచిపెట్టింది లేదు. ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ ఉన్నా.. తనతోనే ఉండేవాళ్లు. అంతేకాదు పలు సందర్భాల్లో శ్రీదేవి కూడా తన కూతుళ్ల గురించి చెబుతూ మురుసుకునేది. తన చిన్న కుమార్తె ఖుషి తండ్రి బోనీ కపూర్ నాన్న కూచి అని.. జాహ్నవి మాత్రం.. నా పార్టీ అని... ఖుషి కంటే జాహ్నవికే తన అవసరం ఎక్కువగా ఉంటుందని శ్రీదేవి గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జాహ్నవి శ్రీదేవికి రాసిన ఓ లెటర్ పలువురి హృదయాల్ని కలచివేస్తుంది. ఫెమినా ఎడిటర్ తాన్యా చైతన్య జాహ్నవి రాసిన లెటర్ ను తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  "నువ్వు సాధించిన విజయాలు, పని పట్ల నీ నిబద్ధత, నీ స్ఫూర్తిదాయక జీవితం గురించి వింటూ మేం పెరిగాం. నేను నీ కూతురిగా పుట్టడం నాకెంతో గర్వకారణం. నీ కూతురు జాహ్నవి అంటూ ఆమె ఈ లెటర్ లో రాసుకొచ్చారు". ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా ఇంత కష్టపడి తన పెద్ద కూతురి మొదటి సినిమా అయినా చూడకుండా కన్నుమూయడం దురదృష్టకరం..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu