జేఎఫ్సీ రిపోర్డ్ వచ్చేసింది... కేంద్రం పొడిచింది ఏం లేదు..

 

ఏపీకి నిధులు ఇచ్చామని ఒకపక్క కేంద్ర ప్రభుత్వం... కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది ఏం లేదని మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది కాలంగా చెప్పుకొస్తున్న  సంగతి తెలిసిందే. అయితే ఎవరు.. నిజం చెబుతున్నారు..ఎవరు అబద్దం చెబుతున్నారో అన్నది సమాధానం లేని ప్రశ్న. అయితే రెండు ప్రభుత్వాల నిగ్గు తేల్చడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ పేరుతో కమిటీని ఏర్పాడు చేశాడు. ఈ కమిటీలో పెద్ద పెద్దతలకాయలనే పెట్టుకున్నాడు. ఇక అలా కమిటీ ఏర్పాటు చేశారో.. లేదో అప్పుడే నివేదికను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. గురువారం నాడు ఈ నివేదికను పవన్ కళ్యాణ్ కు అందజేయగా, ఇంతకీ ఈ రిపోర్ట్ లో ఏముంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 

దాదాపు రెండు వారాల పాటు ఈ కమిటీ అన్ని వివరాలు సేకరించి తేల్చింది ఏంటంటే.. ఇన్ని రోజులు ఏపీకి ఎవ్వరికీ ఇవ్వనన్ని నిధులు ఇచ్చామని ఓ తెగ చెప్పుకుంటున్న బీజేపీ.. ఏపీకి వెలగబెట్టింది ఏం లేదంట. విభజన చట్టంలోని హామీలు... ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇచ్చిన హామీలు.. ఏవీ సక్రమంగా అమలు కాలేదని కమిటీ పెద్దలు నిర్ధారించినట్టు సమాచారం. ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి ఉదారత చూపలేదని నిర్ధారించారు. అంతే కాదు ఇంకా పలు అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతేకాదు అవినీతి విషయంలో టిడిపి ప్రభుత్వంలో ఉన్న కొన్ని లోపాలను కూడా ఈ కమిటీ ఎత్తిచూపినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుతం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టిడిపి – బిజెపిల వలన రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏం లేదన్నది మాత్రం అర్దమవుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ శనివారం నాడు అధికారికంగా వెల్లడించనున్నారు. మరి చూద్దాం ఈ రిపోర్డ్ బయటకు వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu