ఫిబ్రవరి 19న ‘అప్పుడలా ఇప్పుడిలా’..
సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో, ప్రదీప్ కుమార్ జంపా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ తో పాటు, ట్రైలర్ కు ట్రెమండస్ అప్లాజ్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ చిత్రం మీద ఆసక్తి కనబరిచారు.