Read more!

English | Telugu

ఫిబ్రవరి 19న ‘అప్పుడలా ఇప్పుడిలా’..

సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో, ప్రదీప్ కుమార్ జంపా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ తో పాటు, ట్రైలర్ కు ట్రెమండస్ అప్లాజ్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ చిత్రం మీద ఆసక్తి కనబరిచారు. చిన్న చిత్రాల్లో, మంచి బిజినెస్ చేసుకుంటున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మూవీ తమ బ్యానర్ కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా..ప్రతీ సన్నివేశాన్నీ డైరెక్టర్ విష్ణు అద్భుతంగా డిజైన్ చేశారనీ, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందన్నారు. ఖర్చుకు వెనకాడకుండా, మంచి క్వాలిటీ సినిమా కోసం నిర్మాతలు తపన పడ్డారని,సినిమా బిజినెస్ చాలా బాగా జరుగుతోందన్నారు దర్శకుడు కె.ఆర్.విష్ణు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ థియేటర్లలో ' అప్పుడలా ఇప్పుడిలా ' రాబోతోందని ఆయన తెలిపారు.