English | Telugu

అల్లుడ్ని లైట్ తీసుకొన్న బోయ‌పాటి

చిత్ర‌సీమ మొత్తం హిట్ చుట్టూనే తిరుగుతుంటుంది. హిట్టుంటే ఈగ‌ల్లా మూగేస్తారు. అదే ఫ్లాప్ త‌గిలితే.. చ‌ల్ల‌గా జారుకొంటారు. అల్లుడు శీను.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. బోయ‌పాటితో ఓ సినిమా చేయాల‌ని బెల్లంకొండ ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నాడు. అల్లుడు శీను త‌రవాత బోయ‌పాటి సినిమానే ప‌ట్టాలెక్కాలి. అయితే ఈ సినిమా క్లాప్ కొట్టుకొన్నాక ఆగిపోయింది. స్పీడున్నోడు త‌రవాత బోయ‌పాటితోనే సినిమా ఉంటుంద‌ని శ్రీ‌నివాస్ కూడా చెప్పుకొచ్చాడు. అయితే.. ఈ సినిమా ఇప్పుడు డైలమాలో ప‌డింది. స్పీడున్నోడు ఫ్లాప్ అవ్వ‌డంతో బోయ‌పాటి శ్రీ‌ను.. ఈ అల్లుడిని లైట్ తీసుకొన్నాడ‌ట‌. స్టార్ హీరోల‌తో సినిమాలూ చేస్తూ... ఫ్లాప్ హీరోతో ప్ర‌యాణిస్తే.. త‌న కెరీర్‌కి డామేజీ వ‌స్తుంద‌ని బోయ‌పాటి భ‌య‌ప‌డుతున్నట్టు టాక్‌. బోయ‌పాటి క‌థ చెబితే సినిమా చేయ‌డానికి అగ్ర హీరోలు రెడీగా ఉంటారు. దానికి తోడు స‌రైనోడుపై బోల్డ‌న్ని అంచ‌నాలున్నాయి. ఆ సినిమా హిట్ అయితే... స్టార్ హీరోతో సినిమా చేయ‌డం మ‌రింత ఈజీ. ఈ ద‌శ‌లో ఫ్లాప్ హీరోతో సినిమా తీయ‌డం ఎందుకు అని బోయ‌పాటి భావిస్తున్నాడ‌ట‌. దానికి తోడు ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూల్లో 'బోయ‌పాటి క‌థ న‌చ్చ‌లేదు. అందుకే రెండో సినిమా ఆగిపోయింది' అని పొర‌పాటున నోరు జారాడు అల్లుడు శ్రీ‌ను. దాంతో బోయ‌పాటి హ‌ర్ట‌య్యాడ‌ని టాక్‌. ఆ మాట‌ల‌కూ, సినిమా ఫ్లాప్‌కీ బాగా లింకు కుద‌ర‌డంతో... ఈ ప్రాజెక్టునుంచి బోయ‌పాటి త‌ప్పుకొనే ఛాన్సులున్నాయ‌ని తెలుస్తోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.