Read more!

English | Telugu

ఇక నెట్టింట్లో.. ఆర్జీవీ అరాచ‌కం!

ఎవ‌రెస్ట్ నుంచి పాతాళ‌పు అంచుల్లో ప‌డిపోయిన ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ అన‌డంలో ఏమైనా సందేహాలుంటే...అస‌లు ఆర్జీవి స్ట్రాట‌జీపై కాస్త‌యినా ప్రేమ ఉంటే..వ‌ర్మ సిద్ధాంతాల‌పై, క్రియేటివిటీపై, చేసే సిల్లీ కామెంట్ల‌పై, సృష్టించే కాంట్ర‌వ‌ర్సీల‌పై కాస్త‌యినా క‌న్‌స‌ర్న్ ఉంటే.. అవ‌న్నీ ఒక్క ఫొటోతో ప‌టాపంచ‌లు అయిపోతాయి.

సింగిల్ ఎక్స్ అనే పేరుతో ఆర్జీవీ టాకీస్ ప‌తాకంపై వ‌ర్మ ఓ షార్ట్ పిల్మ్ తీశాడు. దానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ని వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశాడు. లోదుస్తుల‌పై ఫోక‌స్ చేస్తూ.. బాత్రూమ్‌లో అమ్మాయి బ్యాక్ చూపిస్తున్న ఆ పోస్ట‌ర్‌నిచూస్తే... ఎవ్వ‌రికైనా వ‌ర్మ‌పై జాలి పోయి కోపం వ‌స్తుంది. అది అస‌హ్యానికి దారి తీసినా తీయొచ్చు. ఇంత‌కీ పోచేస్తే ఇదో షార్ట్ ఫిల్మ్‌. ఆ ఫొటోచూస్తే వ‌ర్మ ఉద్దేశం ఏమిటో, ఏం చూపించ‌బోతున్నాడో ఇట్టే అర్థ‌మైపోతుంది. పైగా... ఈ షార్ట్ ఫిల్మ్‌ని సెన్సార్ వాళ్ల‌కు డెడికేట్ చేస్తున్నాడ‌ట‌. `సినిమా తీస్తే మీరు క‌టింగులు బీప్ లూ వేస్తారు.. ఇంట‌ర్నెట్‌లో న‌న్ను ఆపే మొన‌గాడెవ్వ‌డు` అనే సంకేతాల్ని పంప‌డానికే వ‌ర్మ ఈ ఎత్తుగ‌డ వేశాడ‌న్న‌ది సుస్ప‌ష్టం. త‌న అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా ఉన్న ఎలాంటి వీడియోనైనా, ఎవ‌రు పంపినా వాటిని అప్‌లోడ్ చేస్తానంటున్నాడు వ‌ర్మ‌. ఇక త‌న స్థాయి అరాచ‌క‌త్వం వెండి తెర‌పైనుంచి నెట్టింట్లోకి దిగుమ‌తి అయిపోతోంద‌న్న‌మాట‌. సెక్స్ క్రైమ్ షాకింగ్ ఇలా టాపిక్ ఏదైనా.. ఆర్జీవీ టాకీస్‌పై షార్ట్ పిల్మ్స్‌గా వ‌చ్చేస్తాయన్న‌మాట‌. యువ‌త బ‌ల‌హీన‌త‌ల్ని సొమ్ము చేసుకొని.... యూ ట్యూబ్ క్లిక్కుల‌తో ల‌క్ష‌లు సంపాదించేయొచ్చ‌న్న‌ది వ‌ర్మ ప్లాన్‌. ఇక ఈ అరాచ‌కం ఏ స్థాయిలో ఉంటుందో చెప్ప‌డానికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ బ‌య‌ట‌పెట్టాడు. ఇక ఆ షార్ట్ ఫిల్మ్ ఏ స్థాయిలో ఉంటుందో దేవుడికే ఎరుక‌.