Read more!

English | Telugu

ర‌వితేజ పేరు చెబితే... పారిపోయింది

కొంతమంది హీరోల పేర్లు చెబితే... క‌థానాయిక‌లు ఝ‌డుసుకొంటారు. దెయ్యాన్నో భూతాన్నో చూసిన‌ట్టు పారిపోతుంటారు. కార‌ణాలేమైనా అలాంటి ఇమేజే ర‌వితేజ‌కూ ఉంది. ర‌వితేజ సినిమాల్లో క‌థానాయిక‌లుగా న‌టించ‌డానికి చాలామంది సాహ‌సించ‌ర‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ఇప్పుడు ఈ సంగ‌తి మ‌రోసారి నిరూపిత‌మైంది. ఎవ‌డు త‌ర‌వాత‌.. టాలీవుడ్‌లో క‌నిపించ‌లేదు అమీజాక్స‌న్‌. తెలుగులో ఒక్క అవ‌కాశం వ‌స్తే బాగుణ్ణు అంటూ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోంది. అలాంటిది ఎదురెళ్లి.. 'మా సినిమాలో న‌టిస్తారా?' అంటూ అడిగితే... అమీ కాదంటుందా?  తాను ఎగిరి గంతేసింది. కానీ... ర‌వితేజ హీరో అన‌గానే.. 'నో' అనేసింద‌ట‌. 'సారీ.. నాకు కుద‌ర‌దు' అని త‌ప్పించుకొనే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని టాక్‌. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. మార్చిలో షూటింగ్ మొద‌లెడ‌తారు. క‌థానాయిక‌గా అమీ అయితే బాగుంటుంద‌న్న‌ది చిత్ర‌బృందం ఆలోచ‌న‌. అయితే తెలుగులో అవ‌కాశాల కోసం తెగ ఎదురుచూస్తున్న అమీ కూడా ర‌వితేజ పేరు చెప్పేస‌రికి... త‌ప్పుకొంద‌ని టాక్‌. అందుకే మ‌రో క‌థానాయిక వేట‌లో ప‌డిపోయింది చిత్ర‌బృందం. మ‌రి ఈ మాస్ మ‌హారాజా అంటే అంత భ‌యం ఏమిటో??  ఎందుకో?