Read more!

English | Telugu

బరువు పెరుగుతున్న బాహుబలి

భారతదేశ చలనచిత్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే సినిమాగా పేరు సంపాదించింది బాహుబలి. సినిమాకు ఎంత పేరొచ్చిందో,దానిలో నటించిన ప్రభాస్ కు కూడా దేశవ్యాప్తంగా అంతే పేరొచ్చింది. సినిమాకు ప్రభాస్ ప్రత్యేకంగా బాడీని బిల్డప్ చేయడం గురించి చాలా చర్చ జరిగింది. తాజాగా, బాహుబలి రెండో భాగంలో అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం, ప్రభాస్ మరింతగా బాడీని పెంచబోతున్నాడట.

మొదటి భాగంలో శివుడు కుర్రాడు కావడంతో కాస్త బరువు తక్కువగానే ఉన్నా, అమరేంద్ర బాహుబలి మాత్రం శివుడి కంటే పెద్దగా కనిపించాలని రాజమౌళి చెప్పడంతో, ఈ డెసిషన్ తీసుకున్నాడు ప్రభాస్. ఇప్పటి వరకూ 87 కేజీల బరువున్న ప్రభాస్, రెండో భాగం కోసం 105 కేజీలకు చేరడానికి శ్రమిస్తున్నాడు. దీని కోసం తన సొంత జిమ్ లో కసరత్తులతో పాటు, రోజూ గంటన్నర పాటు యోగా, ఫిట్ నెస్ ఎక్సర్ సైజులు చేస్తున్నాడు. హై ప్రొటీన్ ఫుడ్ ను కూడా కేవలం డైట్ ప్రకారమే తీసుకుంటున్నాడట. కేవలం 87 కేజీలకే అభిమానుల మతులు పోగొట్టిన ప్రభాస్, 105 కేజీల భారీ కటౌట్ గా ఎలా ఉండబోతున్నాడో, తెలియాలంటే, బాహుబలి రిలీజ్ అయ్యేవరకే వేచి చూడాల్సిందే..