English | Telugu

చ‌ర‌ణ్ టార్చ‌ర్ మామూలుగా లేదు

బ్రూస్లీ ఫ్లాప్ రామ్‌చ‌ర‌ణ్‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపించింది. మ‌రుస‌టి సినిమా విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త ప‌డిపోతున్నాడు. అస‌లే చెర్రీకి కెలుకుళ్లు ఎక్కువ‌. ద‌ర్శ‌కుడి ప‌నిలో విప‌రీతంగా జోక్యం చేసుకొంటుంటాడ‌ని టాక్‌. దానికి తోడు చిరంజీవి కూడా వేళ్లూ, కాళ్లూ పెడుతుంటాడ‌ట‌. అందుకే... చ‌ర‌ణ్‌తో సినిమా అంటే ద‌ర్శ‌కులు భ‌య‌ప‌డిపోతుంటారు. ఇప్పుడు ఆ కెలుకుడు కార్య‌క్ర‌మం మ‌రింత ఎక్కువైంద‌ట‌. త‌ని ఒరువ‌న్ స్ర్కిప్టు పూర్తి స్థాయిలో సిద్ధ‌మైనా... చ‌ర‌ణ్ ఆమెద ముద్ర ఇంకా ప‌డ‌లేద‌ని టాక్‌.

అంతే కాదు.. ఒక‌టికి ప‌ది సార్లు స‌న్నివేశాల్ని మార్చుకొని ర‌మ్మంటున్నాడ‌ట‌. త‌ని ఒరువ‌న్ స్ర్కిప్టుని త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న‌వాళ్లంద‌రికీ వినిపించి.. వాళ్ల అభిప్రాయం తీసుకొంటున్నాడ‌ట‌. ఒకొక్క‌రూ ఒక్కోర‌కంగా స‌ల‌హాలిస్తుంటే.. వాటిని కూడా ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోమ‌ని సురేంద‌ర్‌రెడ్డిని టార్చ‌ర్ పెడుతున్నాని టాక్‌. దానికి తోడు అల్లు అర‌వింద్ కూడా ఒత్తిడి పెంచేస్తున్నాడ‌ట‌. క‌థాచ‌ర్చల్లో న‌టీన‌టుల ఎంపిక‌లో అర‌వింద్ క‌ల‌గ చేసుకోవ‌డం సురేంద‌ర్ రెడ్డిని బాధిస్తోంద‌ని తెలుస్తోంది. 'నామీద న‌మ్మ‌కం లేక‌పోతే... ఈ ప్రాజెక్టు నేను చేయ‌లేను' అని కూడా చాలాసార్లు చెప్పాడ‌ట‌. ఒక ద‌శ‌లో ఈ ప్రాజెక్టు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని సురేంద‌ర్ రెడ్డి కూడా ఫిక్స‌యిన‌ట్టు చెబుతున్నారు. అయితే కిక్ 2 డిజాస్ట‌ర్ త‌ర‌వాత సూరి.. కెరీర్ ప‌తానావ‌స్థ‌లో ప‌డిపోయింది. ఏదోలా.. ఈసినిమాని హిట్ చేస్తేగానీ, మ‌ళ్లీ త‌న‌కి అవ‌కాశాలు రావు. అందుకే.. అన్నింటినీ మౌనంగా భ‌రిస్తున్నాడ‌ట‌. స్టార్ హీరోతో సినిమా ద‌క్కించుకోగానే స‌రిపోదు. ఇలాంటి టార్చ‌ర్ల‌నూ భ‌రించాల్సిందే.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.