English | Telugu

నయన వెంకీని వెయిట్ చేయిస్తోందా..

విక్టరీ వెంకటేష్ పేరుకు తగ్గట్టే ఆయన ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఆయనకు ఫ్లాఫ్ పర్సంటేజ్ అందరు హీరోల కంటే చాలా తక్కువ. తన సినిమాలో అన్నీ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవడమే, వెంకీ విజయ రహస్యం. ఇప్పుడు వెంకీకి సోలో హిట్ కావాలి.అందుకే భలే భలే మగాడివోయ్ లాంటి హిట్ సినిమాతో ఊపుమీదున్న మారుతి డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయ్యారు వెంకటేష్. మారుతికి కూడా ఫాస్ట్ గా సీన్స్ తీసేసే అలవాటు ఉండటంతో, మార్చి ఎండింగ్ కల్లా సినిమాకు కంప్లీట్ గా ప్యాకప్ చెప్పేద్దామనుకున్నారు.

కానీ ఇప్పుడు వారికి సడెన్ గా నయనతార రూపంలో సమస్య వచ్చిపడిందని సమాచారం. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటిపోయినా, ఇప్పటికీ ఫామ్ లోనే ఉన్న సీనియర్ హీరోయిన్ నయన్. తమిళ సినిమాలతో ఆమె డైరీ ఫుల్ అయిపోయింది.
ఇప్పుడు వెంకీ ' బాబు బంగారం ' సినిమాకు ఆమెనే తీసుకున్నారు. నయన డేట్స్ ఇంకా అడ్జస్ట్ కాకపోవడంతో, ఆమెతో ఒక్క సీన్ కూడా తీయలేదు. ప్రస్తుతానికి నయన సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని ఫిలిం నగర్ టాక్. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ, మూవీని స్పీడ్ గా రోల్ అవుట్ చేసేయాలనుకున్న ' బాబు బంగారం ' టీమ్ డిజప్పాయింట్ అవుతున్నారట..మరి నయనకు ఎప్పుడు ఖాళీ అవుతుందో చూడాలి..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.