English | Telugu

పూరి ముందే తోక జాడించాడా??

ర‌వితేజ‌కి స్టార్ డ‌మ్ తీసుకొచ్చిందెవ‌రు?ర‌వితేజ‌తో ఎక్కువ సినిమాలు చేసిందెవ‌రు?అస‌లు ర‌వితేజ‌కు లైఫ్ ఇచ్చిందెవ‌రు? వీట‌న్నింటికీ ఒక్క‌టే స‌మాధానం.. పూరి జ‌గ‌న్నాథ్‌. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యంతో ర‌వితేజ‌కు హీరోగా తొలి హిట్ ప‌డింది. ఇడియ‌ట్ తో మాస్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది. అమ్మా నాన్న త‌మిళ అమ్మాయితో కుటుంబ ప్రేక్ష‌కుల‌కూ ద‌గ్గ‌రైపోయాడు. ఈ సినిమాల‌న్నీ పూరి నుంచి వ‌చ్చిన‌వే. ఆ త‌ర‌వాతొచ్చిన నేనింతే.. విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌ల్ని ద‌క్కించుకొంది. దేవుడు చేసిన మ‌నుషులు ఫ్లాప్ అయినా... వీళ్లిద్ద‌రిదీ ఇప్ప‌టికీ క్రేజీ కాంబినేష‌నే. ప్ర‌స్తుతం పూరి.. కెరీర్‌లో చాలా క్లిష్టమైన ద‌శ అనుభ‌విస్తున్నాడు. ఎలాగైనా స‌రే, ఓ హిట్టు కొట్టి త‌న‌ని తాను నిరూపించుకోవాల‌నుకొన్నాడు. అందుకే ర‌వితేజ‌తో ఓ సినిమా చేద్దామ‌ని స‌ర్వం సిద్దం చేసుకొన్నాడ‌ట‌. `ర‌వితేజ మ‌నోడే క‌దా కాల్షీట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాడ‌`న్న ధీమా పూరిది. అయితే పూరీ ముందే.. ర‌వితేజ తోక జాడించాడ‌ని తెలుస్తోంది. `ప్ర‌స్తుతానికి నేను బిజీ.. త‌ర‌వాత చూద్దాం `అంటూ ర‌వితేజ షాక్ ఇచ్చాడ‌ట‌. దాంతో పూరి... నివ్వెర‌పోవాల్సివ‌చ్చింది. ర‌వితేజ పారితోషికం దాదాపుగా రూ.7 కోట్ల‌కు పైమాటే. పూరి అయితే అంత ఇవ్వ‌డు.. ఇవ్వ‌లేడు. అందుకే.. పూరికి దూరంగా ఉంటున్నాడ‌ని తెలుస్తోంది. చిరు కాద‌న్న ఆటోజానీ సినిమాని ర‌వితేజ‌తో తీసి హిట్టుకొడ‌దామ‌ని పెద్ద ప్లాన్ వేశాడు పూరి. కానీ ర‌వితేజ మాత్రం పూరి కి నో చెప్పాడ‌ట‌. ర‌వితేజ మ‌రీ ఇంత డ‌బ్బు మ‌నిషైపోయాడా? అని పూరి సన్నిహితులు వాపోతున్నార్ట‌. ర‌వితేజ కాద‌న‌డంతోనే క‌ల్యాణ్‌రామ్ తో పూరి సినిమా చేయ‌డానికి ప్రొసీడ్ అయ్యాడ‌ని టాక్‌.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.