English | Telugu
బాలయ్య 'అన్ స్టాపబుల్' షోలో 'ఆర్ఆర్ఆర్' టీమ్.. బాబాయ్ తో అబ్బాయి?
Updated : Dec 15, 2021
'అఖండ' సక్సెస్ జోష్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో మరింత ఎనర్జీతో పాల్గొంటున్నారు. మొదటి మూడు ఎపిసోడ్స్ లో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందంతో అలరించిన బాలయ్య.. నాలుగో ఎపిసోడ్ లో అఖండ మూవీ టీమ్ తో సందడి చేశారు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్ కోసం 'ఆర్ఆర్ఆర్' టీమ్ ని రంగంలోకి దింపారు.
Also Read:బన్నీకి జక్కన్న స్మూత్ వార్నింగ్!
'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఐదో ఎపిసోడ్ లో దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సందడి చేయనున్నారని తెలుపుతూ తాజాగా పోస్టర్స్ ను విడుదల చేసింది ఆహా. ఈ పోస్టర్స్ లో బాలకృష్ణ మరింత ఎనర్జీతో కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' జనవరి 7 న విడుదల కానుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే రాజమౌళి షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళి.. బాలయ్య ఒక ఆటమ్ బాంబు లాంటోడు అంటూ ప్రశంసించారు. మరి ఇప్పుడు ఆ ఆటమ్ బాంబుతో కలిసి ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం.
Also Read:మిలియన్ డాలర్ల క్లబ్‌లో 'అఖండ'!
మోహన్ బాబు గెస్ట్ గా వచ్చిన మొదటి ఎపిసోడ్ లో మంచు లక్ష్మి, మంచు విష్ణు మెరిశారు. అదేవిధంగా ఐదో ఎపిసోడ్ లో తారక్, చరణ్ మెరుస్తారేమో చూడాలి. అదే జరిగితే నందమూరి ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. బాబాయ్ అబ్బాయిలు తమ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించడం ఖాయం. మరి తారక్, చరణ్ ఈ ఎపిసోడ్ లో సందడి చేస్తారో లేదో చూడాలి.