English | Telugu
అప్పుడు మెగాస్టార్.. ఇప్పుడు మెగా పవర్‌స్టార్
Updated : Dec 15, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్‌బాస్ ఈ దఫా కొంత నిరాశే పరుస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ షోకి ఊపుని తీసుకొచ్చిన కంటెస్టెంట్ వీజే సన్నీ. అతని కారణంగానే తాజా సీజన్ కి ప్రేక్షకుల్లో మళ్లీ ఊపొచ్చింది. అతని వల్లే షో పై మళ్లీ ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో చివరి అంకానికి చేరిని బిగ్‌బాస్ మరో ఐదు రోజుల్లో అంటే ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ముగియబోతోంది. ఈ సందర్భంగా ఈ షో గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ లుగా హాజరయ్యే సెలబ్రిటీల గురించి పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.
19 మందిలో మొదలైన ఈ షోలో చివరి వారం వచ్చేసరికి 5 మెంబర్స్ మిగిలారు. సన్నీ , మానస్, శ్రీరామచంద్ర, సిరి, షణ్ముఖ్ వున్నారు. వీళ్లలో విజేత ఎవరన్నది మంగళవారం ఎపిసోడ్ లో బిగ్‌బాస్ తేల్చేశాడు. దీంతో గ్రాండ్ ఫినాలే రోజు హాజరయ్యే గెస్ట్ లు ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత సీజన్ గ్రాండ్ ఫినాలేతో పోలిస్తే తాజా సీజన్ ఫైనల్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని, ఇందు కోసం బాలీవుడ్ క్రేజీ స్టార్లని ఆహ్వానిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:'బిగ్ బాస్' హౌస్ నుంచి రాగానే '5జి లవ్' చేయనున్న మానస్!
కాగా గత సీజన్ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా పాల్గొని విజేతని అభినందించడమే కాకుండా సోహైల్ కి తన సినిమాలో గెస్ట్ పాత్రలో నటించడానికి తాను సిద్ధమని మాట కూడా ఇవ్వడం, మెహబూబ్ కు ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ సీజన్ ఫినాలేకు చిరు రావడం లేదని.. మెగా పవర్ స్టార్ వస్తున్నారన్నది తాజా వార్త. చరణ్ తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కొంత మంది బాలీవుడ్ క్రేజీ స్టార్స్ కూడా ఫినాలేలో పాల్గొంటారని తెలుస్తోంది. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో బిగ్ బాస్ నిర్వాహకులు హింట్ ఇచ్చే అవకాశం వుందని విశ్వసనీయ సమాచారం.