English | Telugu

చూపించ‌లేను.. త‌ట్టుకోలేరు : విష్ణు ప్రియ‌

యాంక‌ర్ విష్ణు ప్రియ బుల్లితెర‌పై చేసే హంగామా.. అల్ల‌రి అంద‌రికి తెలిసిందే. ఇక సోష‌ల్ మీడియాలో మాత్రం ఆమె చేసే హంగామాకు హ‌ద్దే వుండ‌దు. హాట్ హాట్ ఫొటో షూట్ ల‌కు సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తూ అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటుంది. సెక్సీ డ్యాన్సింగ్ వీడియోల‌తో కుర్రాళ్ల‌కు షాకులిస్తుంటుంది. ఆహా వెబ్ సిరీస్ కోసం చాలా హాట్ గా మారి హీటెక్కించే అందాల‌తో షాకిచ్చింది విష్ణు ప్రియ‌.

Also Read:మ‌ళ్లీ రెచ్చిపోయిన రోజా

తాజాగా సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా విష్ణు ప్రియ పెట్టిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. చూపించ‌లేను.. చూపిస్తే త‌ట్టుకోలేరు అంటూ విష్ణు ప్రియ పెట్టిన తాజా పోస్ట్ ఓ రేంజ్ లో వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ
విష‌యం ఏంటంటే `ది బేక‌ర్స్ అండ్ బ్యూటీ` అంటూ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేసిన విష్ణు ప్రియ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీగా మారిపోయింది.

తాజాగా షూటింగ్ కి వెళ్లిన విష్ణు ప్రియ ఉద‌యం మొద‌లైన షూటింగ్ రాత్రి ఓవ‌ర్ నైట్ అయినా పూర్తి కాలేద‌ని, దాంతో తాను చాలా టైడ్ అయిపోయాన‌ని, క‌ళ్లు మండుతున్నాయ‌ని, వాటిని చూపించ‌లేన‌ని, అవి చూస్తే మీరు త‌ట్టుకోలేర‌ని షాకింగ్ పోస్ట్ పెట్టింది. నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని చెబుతూ త‌న క‌ళ్ల‌కు చేతులు అడ్డుపెట్టుకున్న ఓ ఫొటోని షేర్ చేసింది. ఇప్పుడ‌ది నెట్టింట వైర‌ల్ గా మారింది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.