English | Telugu
కాజల్ ఎలిమినేషన్‌కు కారణాలు ఇవేనా?
Updated : Dec 13, 2021
12వ వారం యాంకర్ రవి ఎలిమినేట్ కావడం తెలిసిందే. అయితే ఇది అన్యాయం అక్రమమని .. కుట్ర చేసి రవిని ఇంటి నుంచి బయటికి పంపించారని విమర్శలు వినిపించాయి. తాజాగా జరిగిన కాజల్ ఎలిమినేట్ వెనక అయితే ఎలాంటి కుట్ర లేదు.. కుతంత్రం లేదు. కారణం హౌస్ లో వున్న కంటెస్టెంట్ లతో పోలిస్తే కాజల్ కు ఓటింగ్ తక్కువగా నమోదు కావడమే. అయితే ఆమె వెనకబడటానికి, హౌస్ నుంచి బయటికి రావడానికి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
ముందే గేమ్ ప్లాన్ ని యాంకర్ రవిలా సిద్ధం చేసుకుని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ తను ఫాలో అయిన స్ట్రాటజీనే ఇంటి దారి పట్టించిందని చెబుతున్నారు. ప్రతీ విషయంలోనూ తలదూర్చడం.. గిల్లికజ్జాలకు దిగడం.. దీంతో హౌస్ మేట్స్ చాలా వరకు కాజల్ బయటికి ఎప్పుడు వెళుతుందా అని ఓపెన్ గానే చెప్పేయడంతో కాజల్ జర్నీకి బిగ్‌బాస్ హౌస్ లో బ్రేక్ పడింది. అనవరంగా అరుస్తూ ఇంటి సభ్యులకు చిరాకు తెప్పించిన ఆమె నోరే ఎలిమినేట్ అయ్యేలా చేసింది.
కాజల్ పారితోషికం ఎంతో తెలుసా?
ఇక మొదట్లో షణ్ముఖ్ తో సన్నిహితంగా వున్న కాజల్ ఆ తరువాత తన స్టాండ్ ని మార్చుకుని మానస్ తో ఫ్రెండ్షిప్ చేయడం.. సన్నీకి దగ్గర కావడంతో నెటిజన్ లు కాజల్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మానస్, సన్నీలతో కాజల్ కు ప్రత్యేకమైన బంధం ఏర్పడటంతో ఒక్కసారిగా కాజల్ పై పాజిటివ్ వైబ్ మొదలైంది. ఓ దశలో సన్నీని టార్గెట్ చేసిన నాగార్జుననే ఎదిరిస్తూ సన్నీకి అండగా నిలిచింది కాజల్. ఈ ఒక్క సంఘటనతో కాజల్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమెపై ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్ స్టార్టయింది. కాజల్ కున్న క్లారిటీ.. గెలుపు పై వున్న విశ్వాసం అమెని ఇన్ని రోజులు హౌస్ లో కంటిన్యూ అయ్యేలా చేశాయి.