English | Telugu
మోనిత బాబు శ్రీవల్లి ఒడికి .. ఏం జరుగుతోంది?
Updated : Dec 15, 2021
బుల్లితెర వీక్షకుల్ని గత కొంత కాలంగా ఎంటర్‌టైన్ చేస్తూనే చిత్ర విచిత్రమైన మలుపులు, ట్విస్ట్ లతో చిరాకు తెప్పిస్తున్న సీరియల్ `కార్తీక దీపం`. ఎండింగ్ అనుకున్న సీరియల్ ని దర్శకుడు కాపు గంటి రాజేంద్ర సాగదీస్తుండటం ప్రేక్షకుల్లో అసహనాన్ని తెప్పిస్తోంది. ఇదిలా వుంటే బుధవారం 1223వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ రోజు హైలైట్స్ ఏంటో ఓసారి చూద్దాం
Also Read:నిజం తెలుసుకున్న మోనిత..రౌడీలకు చుక్కలు చూపించిన కార్తీక్
కారులో వున్న తన బాబు కనిపించకుండా పోవడంతో ఆదిత్య పై అనుమానంతో ఆనందరావు ఇంటికి వస్తుంది మోనిత. `నా బాబుని మీ ఆదిత్యే ఎత్తుకొచ్చాడు. కోపం వుంటే తిట్టండి.. కొట్టండి.. కానీ ఇలా నా బిడ్డని దూరం చేస్తారా? ` అని అరుస్తుంది మోనిత. వెంటనే `ఏం మాట్లాడుతున్నావ్` అని తిరిగి ప్రశ్నిస్తుంది సౌందర్య.. కానీ మోనిత మాత్రం ఆమె మాటల్ని పెద్దగా పట్టించుకోదు. `నా కొడుకుని ఎత్తుకెళితే నేను ఏడుస్తూ కూర్చుంటాననుకుంటున్నారా? .. తనని ఎత్తుకెళ్లింది ఎవరో తెలిసేదాకా ఇక్కడే కూర్చుంటాను. మీ కొడుకు, నా కొడుకు దొరికే వరకు ఇక్కడే వుంటాను` అంటూ అరుస్తుంది మోనిత.
కట్ చేస్తే... ఆసుపత్రిలో శ్రీవల్లి ఏడుస్తూ వుంటుంది. ఈ సారి కూడా కాన్పు పోయిందని కుమిలిపోతూ వుంటుంది. ఇంతలో శ్రీవల్లి భర్త కోటేష్ ఒక బాబుని తీసుకుని వచ్చి శ్రీవల్లి చేతుల్లో పెడుతూ `వల్లీ ఇదే ఆసుపత్రిలో తల్లి చనిపోయిన బిడ్డ అట.. మగ బిడ్డే .. మనం పెంచుకుందాం ` అంటాడు. వెంటనే బాబుని అందుకుని ముద్దాడిన శ్రీవల్లి దేవుడికి థ్యాంక్స్ చెబుతుంది. శ్రీవల్లి ఆనందంతో వుండగా అసలు ఆ బాబుని తాను ఎక్కడి నుంచి తీసుకొచ్చానో గుర్తు చేసుకుంటాడు కోటేష్. తను వల్లి చేతుల్లో పెట్టిన బాబు మోనిత కొడుకు. ఈ ట్విస్ట్ ఏంటీ? .. అతని చేతుల్లోకి మోనిత బాబు ఎలా వచ్చాడు? .. అసలు ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.