English | Telugu
బిగ్‌బాస్ : సన్నీ మీ టైమ్ వచ్చేసింది
Updated : Dec 15, 2021
గత సీజన్‌లో సోహైల్ `కథ వేరే వుంటది` అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కప్పు గెలవలేకపోయినా విన్నర్ ని మించిన పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అయితే తాజా సీజన్ లో మాత్రం వీజే సన్నీ `అప్నా టైమ్ ఆయేగా`... కప్పు ముఖ్యం బిగులూ.. అంటూ రచ్చ చేస్తున్నాడు. ఈ రెండు డైలాగ్‌లతో సన్నీ ప్రేక్షకుల హృదయాల్ని గట్టిగానే తడిమినట్టున్నాడు. ఎందుకంటే ఇదే విషయాన్ని బిగ్‌బాస్ నొక్కి మరీ చెప్పడం... మీ టైమ్ వచ్చేసిందని ఇండైరెక్ట్‌గా విజేత నువ్వే అంటూ హింట్ ఇచ్చేయడం సన్నీ అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
కప్పు ముఖ్యం బిగులూ అంటూ టైటిల్ కి ఒక్క అడుగు దూరంలో వున్న వీజే సన్నీ తన జర్నీ అన్ని రకాల రసాలని పండించి ఒక విధంగా సినిమాలో హీరో తరహాలో పరిపూర్ణంగా నిలవడం విశేషం. మంగళవారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్ లో ముందు షణ్ముఖ్ జస్వంత్ జర్నీని చూపించిన బిగ్‌బాస్ ఆ తరువాత వీజే సన్నీని లాన్ లోకి పిలిచి అతని జ్ఞాపకాల్ని... హౌస్ లో అతనికి ఎదురైన అవమానాల్ని.. గెలుచుకున్న ఎవిక్షన్ పాస్ ని .. మిగతా వారి కోసం దాన్ని త్యాగం చేసిన తీరుని చూపించాడు.
Also read:షన్ను - సిరిలకు జెస్సీ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ తరువాత సన్నీ జర్నీని శ్రీమంతుడు, లెజెండ్.. మాస్టర్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ని వేసి హౌస్ లో సన్నీ ఓ హీరో అనే స్థాయిలో ఇచ్చిన ఎలివేషన్.. అతనే ఈ సీజన్ విజేత అంటూ ఇండైరెక్ట్‌గా చెప్పిన తీరుతో సన్నీనే ఈ జీన్ విజేత అని కన్ఫర్మ్ అయిపోయింది. `సరదా సన్నీ ఒకే అక్షరంతో మొదలవుతాయని .. మీరు గుర్తు చేశారు. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అందరి ముఖంపై చిరునవ్వు తీసుకు వచ్చి ఎంటర్‌టైనర్ గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. `అప్నా టైమ్ ఆయేగా.. సన్నీ మీ సమయం వచ్చేసింది` అంటూ బిగ్ బాస్ సన్నీని ఓ రేంజ్ లో పొగడ్తలతో ముంచేసి విజేత తనే అంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేయడంతో సన్నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.