English | Telugu
బిగ్ బాస్ : కప్పు బరాబర్ గెలుస్తా - సన్నీ
Updated : Dec 13, 2021
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5సోమవారం సెంచరీ కొట్టేసింది. షో మొదలై వంద రోజులు పూర్తి చేసుకుంది. దీంతో హౌస్ లో వున్న ఐదుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫినాలే ఎలా వుంటుంది? .. విన్నర్ నేనే అవుతానంటూ ఆలోచనల్లో మునిగితేలుతున్నారు. హౌస్ లోవున్న టాప్ 5 కంటెస్టెంట్ లలో సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, సిరి , షణ్ముఖ్ వున్నారు. ఈ ఐదుగురిలో ఒక్కరే టైటిల్ విన్నర్‌గా నిలవబోతున్నారు. అయితే అది ఎవరు? అన్నదే ఇప్పుడు కంటెస్టెంట్‌లలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
రీమేక్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్!
ఈ నేపథ్యంలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న సన్నీ నే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయంటూ ప్రచారం మొదలైంది. ఓట్ల పరంగానూ సన్నీనే అందరి కంటే ముందు వరుసలో నిలుస్తున్నాడు. ఇదిలా వుంటే గ్రాండ్ ఫినాలే పై సన్నీ స్పందించాడు. గ్రాండ్ ఫినాలే దగ్గరపడుతున్న నేపథ్యంలో సన్నీ, మానస్ దీని గురించి మాట్లాడుకున్నారు.
ఈ సందర్బంగా సన్నీ మాట్లాడుతూ ` టెన్షన్ గా వుంది ఎలాగైనా టైటిల్ గెలవాలి. మా అమ్మకు కప్ ఇస్తరా బయ్.. ఇది ఫిక్స్.. ఏదైనా కానీ బరాబర్ కప్పు ఇస్తా` అంటూ తన విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ తరువాతే బిగ్‌బాస్ కంటెస్టెంట్ అ జర్నీని బిగ్ బాస్ వన్ బై వన్ చూపించడం మొదలు పెట్టారు. మంగళవారం సన్నీ జర్నీ చూపించే అవకాశం వుంది.