English | Telugu
శ్రీరామచంద్రను గెలిపించమంటూ ఆటో తోలిన రవి! వీడియో వైరల్!!
Updated : Dec 14, 2021
బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ క్లైమాక్స్‌కు వచ్చింది. 13 వారాలకు పైగా వీక్షకుల్ని రంజింపచేస్తోన్న ఈ సీజన్ విన్నర్‌గా నిలవడానికి బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్.. నలుగురు మేల్, ఒకరు ఫిమేల్.. ఢీ అంటే ఢీ అంటున్నారు. అభిమానులతో పాటు, హౌస్‌లో వారికి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి, బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా తమకు నచ్చిన ఫైనలిస్ట్ గెలుపు కోసం తీవ్రంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్, మానస్ లలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. బెట్టింగ్ రాయుళ్లు తమ పని తాము చేస్తున్నారు.
Also read:నాగ్.. విన్నర్‌గా అతన్నే చూడాలనుకుంటున్నారా?
సన్నీ, షణ్ణు, శ్రీరామ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నదనీ, ఈ ముగ్గురిలో ఒకరు విన్నర్ అవడం తథ్యమనీ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు హౌస్‌లో తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన సింగర్ శ్రీరామచంద్ర కోసం యాంకర్ రవి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక శ్రీరామ్‌తో మాట్లాడుతూ, "నువ్వు లోపలుండి ఆడు, నీకోసం నేను బయటనుంచి ఆడతా" అని చెప్పాడు రవి. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ అతని గెలుపు కోసం వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు.
Also read:కాజల్ పారితోషికం ఎంతో తెలుసా?
రోడ్డుపై "బిగ్ బాస్ హౌస్.. బిగ్ బాస్ హౌస్" అని కేకలు వేసుకుంటూ ఒక ఆటో నడిపాడు. "బిగ్ బాస్ సీజన్ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి" అంటూ ప్రచారం చేశాడు. ఆటో వెనుక వోట్ ఫర్ శ్రీరామ్ అనే పోస్టర్ అతికించాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన రవి, "All the five are deserving, But the title deserving SRC" అనే క్యాప్షన్ పెట్టాడు. ఫ్రెండ్ కోసం రవి పడుతున్న తపన చూసి, అందరూ అతడిని ప్రశంసిస్తున్నారు. శ్రీరామచంద్ర అభిమానులు కూడా రవి ఆటో తోలుతూ, శ్రీరామచంద్రకు ఓటేయమని అడుగుతున్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.