English | Telugu
మీకు నచ్చినట్లు కాకుండా వాడికి నచ్చినట్లు ఉండనివ్వండి.. దీప్తి ఎమోషనల్ పోస్ట్!
Updated : Dec 15, 2021
బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకొచ్చేసింది. డిసెంబర్ 19న (వచ్చే ఆదివారం) ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. బరిలో ఐదుగురు కంటెస్టెంట్లు.. సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, మానస్, సిరి హన్మంత్ మిగిలారు. వీరిలో సన్నీ, షణ్ణు మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆ ఇద్దరిలో సన్నీయే విజేత అంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రచారం కూడా చేస్తున్నారు. సిరితో షణ్ణు గేమ్స్ ఆడుతున్నాడనీ, ఆమెతో కావాలని లవ్ ట్రాక్ నడుపుతున్నాడనీ ఇటీవల నెగటివ్ ప్రచారం వచ్చింది.
Also read:నాగ్.. విన్నర్‌గా అతన్నే చూడాలనుకుంటున్నారా?
అయితే బిగ్ బాస్ హౌస్‌లో షణ్ణు బిహేవియర్‌ను అతడి గాళ్ ఫ్రెండ్ దీప్తి సునయన వెనకేసుకు వస్తోంది. అది కేవలం షో అనీ, అందులో గెలవడానికి షణ్ణు గేమ్స్ ఆడుతున్నాడే తప్ప, దాన్ని బేస్ చేసుకొని అతడి క్యారెక్టర్‌ను డిసైడ్ చేయవద్దనీ అంటోంది.
Also read:షన్ను - సిరిలకు జెస్సీ స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షణ్ణును ఉద్దేశించి ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. షణ్ముఖ్ నిల్చొని ఉన్న ఒక ఫొటోను షేర్ చేసిన ఆమె, "నిర్ధారణలకు రాకండి. బిగ్ బాస్‌ని చూస్తూ అతని క్యారెక్టర్ మొత్తాన్ని అంచనా వేయకండి. ఇది కేవలం ఒక షో మాత్రమే అని గుర్తుంచుకోండి. అతను చాలా మంచి మనిషి. అతనేం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. అతన్ని డిసైడ్ చేసుకోనివ్వండి. అతను మీ అంచనాలను అందుకుంటాడని ఆశించకండి. మీకు నచ్చినట్లు కాకుండా వాడికి నచ్చినట్లు ఉండనివ్వండి. అతను అతనే. ఎవరూ ద్వేషానికి అర్హులు కారు. దయచేసి మీ ఫేవరేట్ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయండి. ఇప్పుడూ, ఎప్పుడూ నేను షణ్ముఖ్‌నే సపోర్ట్ చేస్తాను. అతన్ని సంతోషంగా చూడాలనుకుంటున్నాను." అని రాసుకొచ్చింది.