English | Telugu
హైపర్ ఆదిపై జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
Updated : Dec 15, 2021
జబర్దస్త్ వేదిక ఎంతో మంది కమెడియన్ లకు అవకాశాల్ని కల్పించి వారిని పాపులర్ చేసింది. ఏ ఆధారం లేని వారికి అండగా నిలిచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ వేదికపై ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన ఎంత మంది ఈ షో వల్ల పాపులర్ అయ్యారు. కొంత మంది స్థిరపడ్డారు కూడా. అంతే కాకుండా సినిమాల్లో అవకాశాల్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. ఈ వేదికపై హైపర్ ఆదిది సక్సెస్ ఫుల్ ప్రయాణం.
Also read:ఢీ 14: సుధీర్ పోయి సార్థక్ వచ్చె.. ఏం జరిగిందో!?
అతని పంచ్ లకు చాలా మంది అభిమానులున్నారు. ఆ పంచ్ లు నచ్చి తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చిన దర్శకులూ వున్నారు. అంతే కాకుండా హైపర్ ఆది టైమింగ్ నచ్చి కథా చర్చల్లో అతన్ని భాగస్వామి చేసిన వెంకీ అట్లూరి లాంటి యువ దర్శకులు కూడా వున్నారు. అలాంటి ఆదిపై జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. తాను చనిపోయే సందర్భంలోనూ ఆది పేరునే తలుస్తానంటూ శాంతి స్వరూప్ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also read:ఎక్స్‌ట్రా జబర్దస్త్ : మళ్లీ రెచ్చిపోయిన రోజా
ప్రస్తుతం హైపర్ ఆది `శ్రీదేవీ డ్రామా కంపనీ` పేరుతో ప్రసారం అవుతున్న కామెడీలో స్కిట్ లు చేస్తూ నవ్విస్తున్నారు. అయితే ఇదే వేదికపై శాంతి స్వరూప్ అనే కమెడియన్ .. హైపర్ ఆది తన జీవితంలో ఎంత ముఖ్యమో వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న తీరు పలువురిని కదిలిస్తోంది. పూట గడవడమే కష్టంగా వున్న రోజుల్లో రెండు అరటి పళ్లు తిని పడుకున్న రోజులు వున్నాయని.. తాను ఇప్పుడు ఈ స్థాయిలో వున్నానంటే దానికి కారణం హైనర్ ఆదినే అని శాంతి స్వరూప్ భావోద్వేగానికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.