English | Telugu

బిగ్‌బాస్ ఓటీటీ అత‌ని చేతికా?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ముగిసింది. విజేత‌గా వీజే స‌న్నీ నిలిచిన విష‌యం  తెలిసిందే. ఇదిలా వుంటే ఈ సీజ‌న్ ముగిసిన వెంట‌నే ఓటీటీ లో బిగ్‌బాస్ అనే వార్త‌లు మొద‌ల‌య్యాయి. ఓటీటీ బిగ్ బాస్ 24 గంట‌ల నిడివితో వుంటుంద‌ని, దాని ఫార్మాట్ వేరేగా వుంటుంద‌ని ఇటీవ‌ల బిగ్‌బాస్ హోస్ట్‌, హీరో నాగార్జున వెల్ల‌డించారు. అయితే దీనికి హోస్ట్ గా ఎవ‌రు వ్య‌వ‌హ‌రిస్తారు? .. ఏమా క‌థ‌... కంటెస్టెంట్ లు ఎలా వుంటారు? .. ఎలా ఎంపిక చేస్తారు? .. అన్న విష‌యాల‌పై మాత్రం ఇంత వ‌ర‌కు ఎలాంటి స్ప‌ష్ట‌త‌లేదు. ఇదిలా వుంటే బిగ్‌బాస్ ఓటీటీ ఓంకార్ చేతుల్లోకి వెళ్లిందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.