English | Telugu
బిగ్ బాస్ నుంచి మానస్ ఔట్! అతని దృష్టిలో సన్నీ విన్నర్!!
Updated : Dec 19, 2021
ఐదుగురు ఫైనలిస్టుల్లో మొదట సిరి ఎలిమినేట్ అయ్యాక మిగిలిన నలుగురిలో ఎవరు ముందుగా బయటకు వెళ్తారా అని వారి ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్ కంటెస్టెంట్స్‌తో పాటు వీక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, మానస్ ఎలిమినేట్ అయ్యి, బయటకు వచ్చాడు. అతడిని హౌస్ నుంచి శ్యామ్ సింగ రాయ్ హీరో హీరోయిన్లు.. నాని, సాయిపల్లవి, కృతి శెట్టి తీసుకువచ్చారు. ఆడియెన్స్ పోల్ ప్రకారం టాప్ 4 ఫైనలిస్టుల్లో ముందుగా ఎలిమినేట్ అయిన ఒకరిని హౌస్ నుంచి బయటకు తెచ్చే బాధ్యతను వారికి అప్పగించారు హోస్ట్ నాగార్జున.
Also read:శ్రీరామచంద్రను గెలిపించమంటూ ఆటో తోలిన రవి! వీడియో వైరల్!!
హౌస్‌లోకి మొదట సాయిపల్లవి, కృతిలకు పంపారు నాగ్. ఆ ఇద్దరూ వెళ్లి కంటెస్టెంట్లతో మాట్లాతుండగా, నాని చేతికి ఒక మనీ బాక్స్ ఇచ్చి అతడిని కూడా హౌస్‌లోకి పంపారు. నలుగురిలో ఎవరైనా ఆ బాక్స్‌లోని డబ్బును తీసుకొని వెళ్లవచ్చని నాని ఆఫర్ చేశాడు. ఎలిమినేషన్‌కు గురయ్యేవారికి ఇచ్చే డబ్బు కంటే అందులో ఎక్కువ ఉంటుందని కూడా చెప్పాడు. కానీ నలుగురిలో ఎవరూ ఆ బాక్స్‌ను అందుకోవడానికి ముందుకు రాలేదు.
Also read:నాగ్.. విన్నర్‌గా అతన్నే చూడాలనుకుంటున్నారా?
అప్పుడు నాగ్ వారికి ఓ టాస్క్ ఇచ్చాడు. నాలుగు గేట్‌లను పెట్టి వాటిని లాగమని ఒక్కో కంటెస్టెంట్‌కు చెప్పారు. మొదట సన్నీ లాగగా, అతడు సేఫ్ అయ్యాడు. తర్వాత షణ్ముఖ్ కూడా సేఫ్ అయ్యాడు. దాంతో మానస్, శ్రీరామచంద్ర ఇద్దరినీ ఒకేసారి గేట్లు లాగమని చెప్పారు నాగ్. ఆ ఇద్దరూ గేట్లు పుల్ చేయగా, మానస్ బొమ్మ కిందపడిపోయింది. దాంతో అతను ఎలిమినేట్ అయినట్లు నాగ్ అనౌన్స్ చేశారు. అతన్ని తీసుకొని గెస్టులు ముగ్గురు.. సాయిపల్లవి, కృతి, నాని బయటకు వచ్చారు.
Also read:సోహైల్ ఈ సీజన్ విన్నర్ ఎవరో చెప్పేశాడు
ఎవరు విజేతగా నిలుస్తారని అనుకుంటున్నావని మానస్‌ను నాగ్ ప్రశ్నించగా, అతను సన్నీ పేరు చెప్పాడు. ఎందుకని నాగ్ అడిగితే, అతనిలో ఆ పట్టుదల, కసి ఎక్కువగా ఉన్నాయని జవాబిచ్చాడు మానస్.